రిపోర్టు పంపినా!: అసెంబ్లీలో చర్చ పెట్టండి.. అమరవీరులపై కేసీఆర్‌కు రేవంత్ లేఖ
ప్రభుత్వం అమరవీరులను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని పలుమార్లు ఆయన విమర్శించారు. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన అమరవీరుడు సాయాగౌడ్ గురించి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు.
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా.. రాష్ట్రం కోసం బలిదానం చేసిన అమరవీరుల సంఖ్య ఎంతన్నది కూడా ప్రభుత్వం ఇంతవరకు లెక్క తేల్చకపోయిందని రేవంత్ రెడ్డి పలుమార్లు విమర్శించిన సంగతి తెలిసిందే.
Recommended Video

ప్రభుత్వం అమరవీరులను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని పలుమార్లు ఆయన విమర్శించారు. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన అమరవీరుడు సాయాగౌడ్ గురించి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన సూచించారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయాగౌడ్ తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నట్టు రికార్డుల్లో ఉందని రేవంత్ తెలిపారు. నిజామాబాద్ కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపించినా.. ఇంతవరకు సాయాగౌడ్ కుటుంబానికి ఎటువంటి సహాయం అందలేదన్నారు. అమరులను ఆదుకునే విషయమై అసెంబ్లీలో ఒకరోజు చర్చ పెట్టాలని లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications