కేసీఆర్ పై మరోపోరుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. ఈసారైనా వర్కవుట్ అవుతుందా!!
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోమారు యుద్ధం చేయడానికి టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహాన్ని రచించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడంతో పాటు కెసిఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించిన రేవంత్ రెడ్డి అందులో భాగంగా పార్టీ శ్రేణులతో సమాలోచనలు జరుపుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైనప్పటికీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఓటమిని సైతం లెక్క చేయకుండా అలుపెరుగని పోరాటం చేయడానికి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు.

రాష్ట్రంలో సమస్యలపై మరోమారు కాంగ్రెస్ పోరుబాట
ఇక తాజాగా గాంధీ భవన్ నుంచి జూమ్ మీటింగ్లో నేతలతో కీలక సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్ నాయకులైన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులతో మాట్లాడారు. ప్రజల మద్దతు కూడగట్టడం కోసం మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అయితే ఈ సమావేశానికి జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు.
రాష్ట్రంలో తాజా పరిస్థితుల్లో ధరణి పోర్టల్ పైన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ధాన్యం కొనుగోలు సమస్యలపైన, పోడు భూముల సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈమేరకు కార్యాచరణను కూడా రూపొందించి అమలు చేయడానికి రెడీ అవుతున్నారు.

కాంగ్రెస్ పోరాట కార్యాచరణ ఇలా .. సక్సెస్ అవుతారా?
ఇందిరాపార్కు వద్ద రెండు రోజులపాటు నిరసన దీక్ష చేపట్టాలని, రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాలలో ప్రజల సమస్యల పైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేసిన తర్వాత గవర్నర్ కు వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు. ఇక రైతుల రుణమాఫీ కి సంబంధించిన 25 వేల కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపులపై, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే అంశాలపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలని డిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నో వ్యూహాలు చేస్తున్నా, ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుంది అన్నది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

నేతల మధ్య సమన్వయ లేమి? కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేసినా దానికి తగినట్టుగా ప్రతిఫలం రావడం లేదన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మన మునుగోడు మన కాంగ్రెస్ అంటూ పెద్దఎత్తున ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సమన్వయం లేకపోవడమే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాలు ఫెయిల్యూర్ కు కారణంగా కనిపిస్తుంది.
ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి, వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే బీజేపీ బలోపేతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరోమారు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి రూపొందించుకున్న మాస్టర్ ప్లాన్ ఏ మాత్రం వర్కౌట్ అవుతుంది అన్నది ప్రశ్నార్థకమే!!
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications