రేవంత్ రెడ్డికి అస్వస్థత, భద్రత మధ్య కొడంగల్: అరెస్ట్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం
Recommended Video

కొడంగల్: పోలీసుల అదుపులో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనను మంగళవారం వేకువజామున మూడు గంటలకు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం తెలిపింది.
సీఈవో రజత్ కుమార్ కూడా వెంటనే విడుదల చేయాలని డీజీపీని ఆదేశించారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఆయనను విడుదల చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా రేవంత్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీస్ ట్రెయినింగ్ సెంటర్‌లో వైద్యం అందించారు. బీపీ ఎక్కువ కావడంతో ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు.

రేవంత్ రెడ్డికి చికిత్స
రేవంత్ రెడ్డికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పోలీస్ ట్రెయినింగ్ సెంటర్ నుంచి తరలించారు. భారీ భద్రత మధ్య కొడంగల్‌కు ఆయనను తరలించారు.

రేవంత్ ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేసుకోవచ్చు
మరోవైపు, రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ కావడంతో ఎక్కడైనా ప్రచారం చేసుకునే హక్కు ఉందని సీఈవో రజత్ కుమార్ చెప్పారు. ప్రచారంలో పాల్గొనాల్సి ఉండటంతో రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని సీఈవో డీజీపీకి అదేశాలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. కొడంగల్‌లో కేసీఆర్ బహిరంగ సభ ఉందని, రేవంత్ ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేసుకోవచ్చునని చెప్పారు.

రేవంత్ అరెస్టుపై రాహుల్ గాంధీ ఆగ్రహం
రేవంత్ రెడ్డి అరెస్టు పైన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. అరెస్టులతో కాంగ్రెస్ ప్రభంజనాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అడ్డుకోలేదని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ నిరంకుశ ధోరణికి పరాకాష్ట ఈ అరెస్ట్ అన్నారు. తెరాస ప్రజా వ్యతిరేక పాలనకు రోజులు దగ్గరపడ్డాయని చెప్పారు. తెరాసను తెలంగాణ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు.

రేవంత్ రెడ్డి అరెస్ట్ హైడ్రామా
రేవంత్ రెడ్డిని మంగళవారం వేకువజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను జడ్చర్ల పోలీస్ ట్రెయినింగ్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అరెస్టుపై నిప్పులు చెరిగారు. హైకోర్టుకు వెళ్లారు. అరెస్టుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు కేసీఆర్ కొడంగల్ సభ పూర్తవుతున్న నేపథ్యంలో రేవంత్‌ను విడుదల చేయాలని తెలంగాణ సీఈవో కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.
-
అదిరిపోయే శుభవార్త.. త్వరలో తెలంగాణాలో ఐదు కొత్త ప్రతిష్టాత్మక పథకాలు -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..












Click it and Unblock the Notifications