నేను ముద్దెట్టుకుంటా చూడూ..పెట్టుకోపోతే నాకేస్తా చూడూ జంబలకడి జారు మిఠాయా!చర్చంతా ఆ రచ్చపైనే.!
హైదరాబాద్: తెలుగు పరిశ్రమతో పాటు సినీ అభిమానుల చర్చంతా ఆ రచ్చ మీదే నడుస్తోంది. ఒక సినిమా ప్రమోషన్ కోసం ఆ దర్శకుడు సృజనాత్మకత హద్దులు దాటినట్టు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా ఐ డోంట్ కేర్ అన్నట్టు వ్యవహరించడం కూడా మొత్తం ఎపిసోడ్ లో కొసమెరుపు. ఎవ్వరికీ సరిగా పేరు కూడా తెలియని ఓ అప్ కమింగ్ నటి ఆ పేరు మోసిన దర్శకుడికి అంత చనువు ఇవ్వడం, అంత స్వేచ్చగా ఒళ్లప్పజెప్పడంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ, నటి ఆషు రెడ్డి మద్య జరిగిన సంభాషణ, చిత్ర విచిత్ర వ్యవహారంపై వినూత్న చర్చ జరుగుతోంది.

ఓ వినూత్న విచిత్ర ఎపిసోడ్..
ఆర్జీవి ఆషూరెడ్డి.. ఓ వినూత్న విచిత్ర ఎపిసోడ్..
దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసినా వినూత్నంగా ఉంటుంది. కొన్ని సందర్బాల్లో విచిత్రంగా, మరికొన్ని సందర్బాల్లో వింతగా, ఇంకొన్ని సందర్బాల్లొ జుగుప్సాకరంగా ఉంటుంది. అసలు తెలుగు సినిమా పరిశ్రమకు ఓ వైవిద్యమైన దర్శకుడు దొరికాడు అనే చర్చ నుండి ఆ దర్శకుడిని పరిశ్రమనుండి ఎందుకు బహిష్కరించడం లేదు అనేంత వరకూ వర్మ వ్యవహారం దూసుకెళ్లింది. అసలు వర్మ తీసే సినిమాలు సమజానికి సందేశాన్ని గానీ, సమాచారాన్ని గానీ, వినోదాన్ని గానీ పంచుతున్నాయా అంటే అన్ని వర్గాల నుండి నో అనే సమాధానం వస్తుంది. ఇది వాస్తవం. ఐనప్పటికీ నిత్యం సినిమాలు నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ సదా వార్తల్లో వివాదం అవుతుంటారు ఆర్జీవి.

నార్త్ నుంచి నాకే స్ధితికి.. వర్మ విజయమా.. పతనమా.?
తెలుగు తెరపై రక్త చరిత్ర ఆవిష్కరించినా, మన దేశం కాని మియా మాల్కోవాతో ఏదో చిత్రం, విచిత్రం, వింత తెరకెక్కించినా వర్మ తనకు తానే సాటి అని నిరూపించుకుంటారు. తాను తీసే చిత్రంలో ఏ అంశం ఇతి వృత్తంగా ఎంచుకున్నా దాన్ని వాదించి, మెప్పించి, ఒప్పించుకునే తర్కం కూడా వర్మకు బాగా తెలుసనే చర్చ జరుగుతోంది. అందుకే ఎప్పుడూ వివాదాస్పద దర్శకుడిగా, వింతైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా నిత్యం కీర్తించబడుతుంటాడు రాంగోపాల్ వర్మ. తాజాగా డేంజరస్ సినిమా ప్రమోషన్ కోసం వర్మ ఎంచుకున్న దారి మాత్రం పూర్తి రహదారని పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

చిత్రమైన వేషాలు.. వాటికి ప్రమోషన్ అని పేరెందుకంటున్న ప్రేక్షకులు
ఇక తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియని వర్థమాన నటి ఆషు రెడ్డి. బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా కాస్తో కూస్తో ప్రాచూర్యం పొందిన ఆషు పెద్దగా ఎవ్వరికీ తెలియదు. మన సృజనాత్మకతకు మారుపేరైన దర్శకుడు రాంగోపాల్ వర్మ చూపు ఆమె పై సోకింది. అంతే తనను ఏ విధంగా వాడుకోవాలని ఆలోచించిన వర్మ ఎంతో వినూత్న తరహాలో ఆషు రెడ్డిని ఆదరించాడు. అంతకు కొన్ని రోజుల ముందు యాంకర్ అరియనా గ్లోరీతో ఏదో చేద్దాం అనుకున్న వర్మ చివరకు ట్రాక్ షూ ధరింపజేసి సైకిల్ తొక్కించి వదిలేసాడు. ఆ ఎపిసోడ్ జనాలకు అంతగా కిక్కివ్వలేదని భావించిన వర్మ ఆషురెడ్డితో మాత్రం ఎంతో అధునాతనంగా, దాపరికంలేకుండా వ్యవహరించారు.

ఆర్జీవి నిజంగా డేంజరస్.. ఆషురెడ్డితో అదరగొట్టిన ప్రమోషన్
ఆషురెడ్డి ఆర్జీవి మద్య జరుగిన ముద్దు ఎపిసోడ్ శృతిమించిందని కొందరు, వాళ్లిద్దరికి ఇష్టం ఐనప్పుడు వేరే వాళ్లకు ఏంటి అభ్యంతరం అని కొందరు, నాలుగు గోడల మద్య జరిగే వ్యవహారాన్నంతా ఫోర్ క్యామ్ సెటప్ తో షూట్ చేసి జనాల మద్యకు వదిలి చిత్రమైన రాక్షసానందం పొందడం ఎందుకనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి ముద్దుల వల్ల సభ్యసమాజానికి వర్మ ఏం సమాచారం అందిస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. వోడ్కా తాగుతూ, ఓ వనిత అందాలను వర్ణిస్తూఇంత రచ్చ చేస్తే గానీ, తాను తీసిన సినిమా ఆదరణ పొందదా అని సగటు ప్రేక్షకుడు వర్మకు చురకలంటిస్తున్నా దాని వేడిని కూడా ఆస్వాదించడం ఒక్క వర్మకే సాద్యం. అందుకే నువ్వు చూసినా.. చూడక పోయినా నేన్ సినిమాలు తీసేస్త జూడూ జంబలకడి జారు మిఠాయీ అంటుటాడు మన ఆర్జీవి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications