హరీష్ ఎఫెక్ట్: కృష్ణా బోర్డు నుండి సమీర్‌ఛటర్జీ ఔట్, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కేంద్ర ప్రభుత్వానికి చేసిన ఫిర్యాదుతో చలనం మొదలైంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి పదవి నుండి సమీర్‌ఛటర్జీని తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఆయన స్థానంలో పోలవరం ప్రాజెక్టు ప్లానింగ్‌ అండ్‌ డిజైనింగ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఎ.పరమేశంను బోర్డు సభ్య కార్య దర్శిగా నియమించింది.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వివాదంపై రాష్ట్ర విభజన సమయంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో సభ్య కార్యదర్శులుగా పనిచేస్తున్నవారిలో కొందరు అధికారులు ఏపీ రాష్ట్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చాలా కాలం నుండి తెలంగాణ ఆరోపణలు చేస్తోంది.

గతంలో పనిచేసిన సభ్య కార్యదర్శిపై కూడ తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. తాజాగా కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్‌మెంట్ సభ్య కార్యదర్శి సమీర్‌ఛటర్జీపై తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కేంద్రానికి లేఖ రాయడంతో సమీర్‌ఛటర్జీని తొలగించింది ప్రభుత్వం.

సమీర్ ఛటర్జీపై వేటు

సమీర్ ఛటర్జీపై వేటు

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పక్షపాత ధోరణిని నిరసిస్తూ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చేసిన ఫిర్యాదుపై కేంద్ర జల వనరుల శాఖ స్పందించింది. బోర్డు సభ్య కార్యదర్శి పదవి నుంచి సమీర్‌ చటర్జీని తొలగించింది. ఆయన స్థానంలో పోలవరం ప్రాజెక్టు ప్లానింగ్‌ అండ్‌ డిజైనింగ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఎ.పరమేశంను బోర్డు సభ్య కార్య దర్శిగా నియమించింది.ఈ మేరకు బుధవారం కేంద్ర జల వనరుల శాఖ అండర్‌ సెక్రెటరీ నరేంద్రసింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. బోర్డులో కొత్తగా హరికేశ్‌ మీనాను సభ్యుడిగా నియమించారు.

గతంలో కూడ ఇదే తరహ ఆరోపణలు

గతంలో కూడ ఇదే తరహ ఆరోపణలు

కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్య కార్యదర్శిగా పనిచేసిన వారు గతంలో కూడ ఏపీకి అనుకూలంగా వ్యవహరించారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. వాస్తవానికి తొలుత సభ్య కార్యదర్శిగా ఉన్న ఆర్‌కే గుప్తా వ్యవహారశైలి సరిగా లేదంటూ తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆయన తీరు కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని పేర్కొనడంతో కేం ద్రం ఆయనను తొలగించి.. ఆ స్థానంలో గతేడాది అక్టోబర్‌లో సమీర్‌ చటర్జీని నియమించింది. కృష్ణా జలాల నీటి వినియోగం, విడుదలకు సంబంధించిన అంశాల్లో సమీర్‌ చటర్జీ ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తొలి నుంచీ ఆయనపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. అయినా ఇంతకాలం నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. కానీ ఇటీవల కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చుకునే అంశంలో సమీర్‌ చటర్జీ మొండిగా వ్యవహరించారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది.ఈ విషయాలపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.

నీటి కేటాయింపులు లేకుండా ఎలా?

నీటి కేటాయింపులు లేకుండా ఎలా?


ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేనందున ప్రాజెక్టులపై బోర్డు నియంత్రణ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. గతంలో జరిగిన సమావేశాల్లో కూడ ఇదే విషయమై చర్చ జరిగిన నీటి కేటాయింపులు జరిగిన తర్వాతే ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకొనేందుకు అంగీకరిస్తామని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయినా సమీర్ ఛటర్జీ ఈ విషయంలో మొండిగా వ్యవహరించారనే అభిప్రాయంతో తెలంగాణ సర్కార్ ఉంది. పైగా ఫైనల్‌నోటిఫికేషన్‌ను తయారు చేసి, దాన్ని ఆమోదించాలంటూ నేరుగా కేంద్రానికి లేఖ రాశారు. దీంతోపాటు ఇటీవల వివాదాస్పద టెలీమెట్రీ లెక్కలు, నీటి పంపకాల విషయంలో ఏపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. మంత్రి హరీశ్‌రావు ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ.. ఈ నెల 9న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీకి లేఖ రాశారు.టెలీమెట్రీ లెక్కలను ఏపీ టాంపరింగ్ చేసిందని తెలంగాణ ఆరోపణలు చేసింది. ఈ అంశాలన్నింటిపై హరీష్‌రావు ఫిర్యాదు చేసింది.

రెండు రాష్ట్రాల మధ్య ఎప్పుడూ వివాదమే

రెండు రాష్ట్రాల మధ్య ఎప్పుడూ వివాదమే

రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం విషయంలో తరచూ వివాదాలు చోటుచేసుకొంటున్నాయి. కృష్ణా నదికి వరదలు రాని సమయంలో ఈ గొడవలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. అయితే కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులో పనిచేస్తున్న అదికారులకు రెండు రాష్ట్రాలకు న్యాయం చేయడం కత్తిమీద సాము మాదిరిగానే ఉంటుంది. అయితే ఆయా రాష్ట్రాలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిదులు కూడ తమ రాష్ట్రాలకు అనుకూలంగా సమావేశాల్లో వాదనలు విన్పిస్తుంటారు. అయితే నీటి కేటాయింపుల విషయమై ఇంకా స్పష్టత రాలేదు. కోర్టుల్లో వాదనలు సాగుతున్నాయి. కోర్టులు ఈ విషయమై తీర్పులు వెలువరించిన తర్వాత స్సష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sameer Chattarjee removed from Krishna river management board on Wednesday.Union government appointed A. Paramesham as Krishna river management board secretary in the place of Sameer.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి