'సంధ్యపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం', కాలుతున్న శరీరంతో పరుగెత్తింది!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తన కూతురు సంధ్యారాణి విషయంలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం సాగుతోందని ఆమె తల్లి వాపోతున్నారు. తన కూతురుపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తన కూతురు మృతిలో కార్తీక్ తల్లికి కూడా ప్రమేయం ఉందని ఆమె ఆరోపించారు. ఆమె మంగళవారం మాట్లాడుతూ.. దోషులను కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

'అప్పుడు ఏదో చేయాలనిపించింది, అప్పుడప్పుడు కార్తీక్ ఇంటికి సంధ్య, బావకు తెలుసు'

కాలుతున్న శరీరంతోనే పరుగెత్తిన సంధ్య

కాలుతున్న శరీరంతోనే పరుగెత్తిన సంధ్య

తన ప్రేమనుతిరస్కరించిందనే ఉన్మాదంతో కార్తీక్ అనే యువకుడు నడిరోడ్డుపై సంధ్యపై పెట్రోలు పోసి నిప్పు అంటించిన విషయం తెలిసిందే. ఆమె కాలుతున్న శరీరంతోనే కొద్ది దూరం పరుగెత్తింది. గురువారం ఈ సంఘటన జరగగా.. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందింది. ఈ కేసులో కార్తీక్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

సంధ్యారాణి పై కార్తీక్ తల్లి ఆగ్రహం, ఆరోపణలు !
చిన్న వయస్సులోనే తండ్రి మృతి

చిన్న వయస్సులోనే తండ్రి మృతి

సంధ్యారాణి తండ్రి ఆమె చిన్న వయస్సులోనే మృతి చెందారు. ముగ్గురు సోదరులకు వివాహమై వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు అయ్యాయి. వారు ఇక్కడే ఉంటున్నారు. తల్లి వారిని కష్టపడి పెంచుతోంది.

ప్రేమను తిరస్కరించింది

ప్రేమను తిరస్కరించింది


డిగ్రీ పూర్తి చేసిన సంధ్య లక్కీ ట్రేడర్స్ అల్యూమినియం డోర్స్, విండోస్ తారు చేసే సంస్థలో అకౌంటెంటుగా పని చేసేది. సంధ్యతో పరిచయం తర్వాత కార్తీక్ గతంలోను ప్రపోజ్ చేశాడు. కుటుంబ భారాన్ని సంధ్య కూడా మోస్తోంది. అతని ప్రేమను తిరస్కరించింది.

సంధ్యారాణికి అంతకుముందు బెదిరింపు

సంధ్యారాణికి అంతకుముందు బెదిరింపు

హత్యకు ముందు సంధ్యారాణి - కార్తీక్‌ల మధ్య ఫోన్ సంభాషణ జరిగిందని, ఆ సమయంలో ఆమెను బెదిరించాడని తెలుస్తోంది. తనను ప్రేమించకుంటే చంపేస్తానని బెదిరించాడని తెలుస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sandhya mother talks about her daughter on Tuesday in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి