కార్తిక్ చేతిలో హతం: సంధ్యారాణి చివరి మాటల ఇవే, సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రేమోన్మాది కార్తిక్ చేతిలో హతమైన సంధ్యారాణి మీడియాతో చివరగా మాట్లాడింది. కార్తిక్ పెట్రోల్ పోసి తగులబెట్టడంత తీవ్రంగా గాయపడిన ఆమెను గాంధీ ఆస్పత్రిలో చేర్చారు.

ఆస్పత్రిలో ఆమె తుదిశ్వాస విడిచింది. దానికి ముందు ఆమె చివరగా మాట్లాడిన మాటలు కలకలం రేపుతున్నాయి. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇస్తూ వెళ్లింది.

కార్తిక్ చెల్లెల్లి గురించి ఇలా..

కార్తిక్ చెల్లెల్లి గురించి ఇలా..

కార్తిక్ చెల్లె ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుందని అడిగితే తార్నాకా బిగ్ బజార్‌లో పనిచేస్తుందని సంధ్యారాణి చెప్పింది. ఆమె పేరు నదియా అని చెప్పింది. ఆమె అన్నయ్య పేరు కార్తిక్ అని, తన మీద పెట్రోల్ పోసింది అతనేని చెప్పింది. నదియా ఇప్పటికీ అక్కడే పనిచేస్తోందని కూడా చెప్పింది.

ఐదు నిమిషాలు మాట్లాడాడు...

ఐదు నిమిషాలు మాట్లాడాడు...

తన ఒంటిపై పెట్రోల్ పోయక ముందు కార్తిక్ తనతో ఐదు నిమిషాలు మాట్లాడాడని సంధ్యారాణి చెప్పింది. బైక్ మీద కార్తిక్ ఒక్కడే వచ్చాడని తెలిపింది. సంధ్య హత్య కేసు నిందితుడు కార్తిక్‌పై పోలీసులు 307, 354 సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు.

ఆధారాలు సేకరించామని.

ఆధారాలు సేకరించామని.

సంధ్యారాణి హత్యకుసంబంధించిన కేసులో అన్ని ఆధారాలు సేకరించామని, త్వరలోనే చార్జిషీటు దాఖలు చేస్తామని డీసీపీ సుమతి చెప్పారు. కార్తిక్ జులాయిలాగా తిరుగుతుండంలో సంధ్య అతనిని దూరం పెట్టిందని డీసీపీ అన్నారు. ఈ కారణంగా సంధ్య అతనితో పెళ్లికి నిరాకరించిందని అన్నారు.

పథకం ప్రకారమే దాడి..

పథకం ప్రకారమే దాడి..

సంధ్య పెళ్లికి నిరాకరించడంతో ఓ పథకం ప్రకారం సంధ్యపై కార్తిక్ పెట్రోలు పోసి నిప్పు పెట్డాడని డీసీపీ చెప్పారు. కార్తీక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. సంధ్య కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Killed in petrole attack Sandhya Rani by jilted lover Karthik explained the details.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి