జాడలేని నేతలు: సంగీత ఆమరణ దీక్ష విరమణ, ధర్నా కొనసాగింపు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన శ్రీనివాస్ రెడ్డి భార్య సంగీత ఆమరణ నిరహర దీక్షను మంగళవారం నాడు విరమించుకొన్నారు.ఆమె 52 రోజులుగా రిలే దీక్ష చేస్తున్నారు. అయితే ఆమెకు న్యాయం జరగకపోవడంతో మంగళవారం నాడు ఆమరణ నిరహరదీక్ష చేయాలని నిర్ణయం తీసుకొంది. అయితే సంగీతను దీక్ష విరమింపచేశారు మహిళా సంఘాల నేతలు. అయితే ధర్నాను కొనసాగించనున్నట్టు సంగీత ప్రకటించారు.

రంగంలోకి ఎంపీ మల్లారెడ్డి: చర్లపల్లి జైలులో శ్రీనివాస్‌రెడ్డితో చర్చలు, రాజీ కుదిరేనా?

మూడు పెళ్ళిళ్ళు చేసుకొన్నారనే ఆరోపణలతో సంగీత శ్రీనివాస్ రెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ కేసులో శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మరో వైపు ఈ కేసులో శ్రీనివాస్ రెడ్డి తల్లి దండ్రులు కూడ అరెస్టై బెయిల్ పై విడుదలయ్యారు.

సంగీత 52 రోజులుగా శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందే ఆందోళన చేస్తోంది. అయితే తనకు ఎలాంటి న్యాయం జరుగుతోందనే నమ్మకం కుదరకపోవడంతో ఆమె ఆమరణ నిరహరదీక్షకు పూనుకొంది. అయితే మంగళవారం సాయంత్రం మహిళా సంఘాల నేతలు సంగీతను ఆమరణ దీక్షను విరమింపజేశారు.

ఆమరణదీక్ష విరమణ

ఆమరణదీక్ష విరమణ

తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సంగీత చేస్తున్న దీక్షకు స్పందన రాకపోవడంతో మంగళవారం నాడు ఆమరణదీక్షకు పూనుకొంది. అయితే ఈ విషయం తెలుసుకొన్న మహిళా సంఘాల నేతలు సంగీత వద్దకు చేరుకొని ఆమరణదీక్ష నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు. అయితే ఆమెను అతి కష్టం మీద మహిళా సంఘాల నాయకులు ఆమరణ నిరహరదీక్ష మానుకొనేలా ఒప్పించారు. చివరకు మహిళా సంఘాల నేతల సూచనల మేరకు సంగీత ఆమరణ నిరహర దీక్షను విరమించింది. మహిళా సంఘాల నేతలు ఆమెకు నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపజేశారు.

ధర్నా కొనసాగిస్తా

ధర్నా కొనసాగిస్తా

తనకు న్యాయం జరిగే వరకు తాను శ్రీనివాస్ రెడ్డి ఇంటి ఎదుట ధర్నా కొనసాగిస్తానని సంగీత ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని మహిళా సంఘాల నేతలు కూడ మద్దతు ప్రకటించారు. తన కూతురికి, తనకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేస్తోంది. అయితే భాదితురాలికి అండగా నిలుస్తామని మహిళా సంఘాలు చెబుతున్నాయి.

తేలని వ్యవహరం

తేలని వ్యవహరం

సంగీతకు న్యాయం చేస్తామని పలువురు ప్రజాప్రతినిదులు హమీలు ఇచ్చారు. మేడ్చల్ ఎమ్మెల్యే , మల్కాజిగిరి ఎంపీలు సంగీత ధర్నా వద్దకు వచ్చి హమీలు గుప్పించారు. చర్లపల్లి జైలులో శ్రీనివాస్ రెడ్డితో ఎంపీ మల్లారెడ్డి చర్చలు కూడ జరిపారు. కానీ, ఇంతవరకు ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో సంగీత ఇంకా ఆందోళన కొనసాగిస్తోంది.

సంగీతకు న్యాయం చేయాలి

సంగీతకు న్యాయం చేయాలి

52 రోజులుగా సంగీత ఆందోళన కొనసాగిస్తున్నా ఇంతవరకు ఆమెకు న్యాయం జరగకపోవడంతో మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం చొరవచూపాలని మహిళసంఘాల నేతలు కోరుతున్నారు. సంగీతకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.శ్రీనివాస్ రెడ్డితో పాటు అతని కుటుంబసభ్యులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నేతలు కోరుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sangeetha withdrawn hunger strike on tuesday evening, but she will continues agitation for justice. women leaders demanded the government resolve this issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X