వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్షన్ 8పై ఇరుకునపడ్డ టీఆర్ఎస్: గవర్నర్‌తో కేసీఆర్ భేటీ, ఢిల్లీలో నిరాహార దీక్ష?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం ఉదయం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఆయన తాజా రాజకీయ పరిణామాల పైన చర్చించారని సమాచారం. సెక్షన్ 8 గురించి ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది.

కాగా, ఓటుకు నోటు విచారణ కేసు కొత్త మలుపు తిరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న నరసింహన్... నోటు కేసును పర్యవేక్షించే అధికారం ఉంటుందని అటార్నీ జనరల్ సూచించిన విషయం తెలిసిందే.

ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరిస్తోన్న నరసింహన్ పని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఇది కొంత ఊరట కలిగించేదేనని చెప్పవచ్చు. అలాగే హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలుకు అవకాశం లేదని వాదిస్తున్న తెరాస.. అటార్నీ జనరల్ సలహాతో ఇరుకునపడే అవకాశాలున్నాయంటున్నారు.

Section 8: KCR meets governor Narasimhan

పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8లో ఉన్న వివిధ అంశాల ప్రాతిపదికన ఓటుకు నోటు కేసును పర్యవేక్షించే అధికారం గవర్నర్‌కు ఉందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి అభిప్రాయపడినట్టుగా వార్తలు వచ్చాయి. పునర్విభజన చట్టం ప్రకారం ఉభయ రాష్ట్రాలకు పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటంది.

ఈ వ్యవధిలో రెండు రాష్ట్రాల పోలీసులు, రెండు రాష్ట్రాల శాంతిభద్రతల పరిరక్షణా బాధ్యతలు గవర్నర్‌కే ఉంటాయని అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. ఓటుకు నోటు నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ఇటీవల ఢిల్లీకి వచ్చినప్పుడు అటార్నీ జనరల్‌తో సమావేశమయ్యారు.

ఆ సమయంలో ఓటుకు నోటు వ్యవహారాన్ని ప్రస్తావించారని తెలుస్తోంది. దీంతో సెక్షన్ 8లో గవర్నర్‌కు ఉన్న విస్తృతాధికారాలను అటార్నీ జనరల్ పూర్తిగా విడమరిచి చెప్పారని సమాచారం. సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు కేసు విచారణను పర్యవేక్షించే అధికారం ఉందని అటార్నీ జనరల్ స్పష్టం చేశారంటున్నారు.

Section 8: KCR meets governor Narasimhan

అయితే, చర్చల రూపంలోనే తప్ప లిఖిత పూర్వకంగా గవర్నర్ నరసింహన్‌కు అటార్నీ జనరల్ ఎలాంటి సలహా ఇవ్వలేదని చెప్పారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న అటార్నీ జనరల్ వచ్చే వారంలో తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, హైదరాబాద్‌లో సెక్షన్ 8 నిర్ణయం పైన అవసరమైతే టీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.

జాతీయస్థాయి మద్దతు కోసం ఢిల్లీలో నిరాహార దీక్ష యోచనలో కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేస్తే నిరాహార దీక్ష చేయాలనే యోచనలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉన్నట్లుగా తెలుస్తోంది. జాతీయస్థాయి మద్దతును కూడగట్టే
ప్రయత్నాలు చేయాలని తెరాస భావిస్తోంది. ఢిల్లీలో లేదా హైదరాబాదులో నిరాహార దీక్ష చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారని తెలుస్తోంది.

మరో ఉద్యమం: శ్రీనివాస్ గౌడ్

సెక్షన్ 8 అమలు చేస్తే మరో ఉద్యమం చేపడతామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సాయంత్రం ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. సెక్షన్ 8 అమలు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని తెరాస భావిస్తోంది.

English summary
Section 8: KCR meets governor Narasimhan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X