మసాజ్ సెంటర్‌పై పోలీసుల దాడి, ఏడుగురి అరెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని మాదాపూర్‌లోని రైన్ మసాజ్ సెంటర్‌పై పోలీసులు బుదవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ముగ్గురు యువతులతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల నుండి సుమారు 7 వేల రూపాయాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

నగరంలో నిర్వహిస్తున్న కొన్ని మసాజ్ సెంటర్లపై ఎస్‌వోటీ పోలీసులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మాదాపుర్‌లోని రైన్ మసాజ్ సెంటర్‌పై బుధవారం ఎస్‌వోటీ దాడులు నిర్వహించారు. దాడిలో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న ముగ్గురు యువతులతో మరో నలుగురిని కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

seven held in raids on massage centre in hyderabad

ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్‌వోటీ పోలీసులు ఈ మసాజ్ సెంటర్ పై దాడి చేశారు. అయొదే మసాజ్ సెంటర్ నిర్వాహకుడు పారిపోయాడని పోలీసులు తెలిపారు.

నిందితుడిని కూడ పట్టుకొనేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
seven people held in massage centre at Madhapur in Hyderabad on wednesday. police seized 7 thousand rupees.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X