రోడ్డు ప్రమాదంలో మరణించిన పోలీసు కుటుంబాలకు సాయం.!చెక్కులు అందజేసిన స్టీఫెన్ రవీంద్ర.!
హైదరాబాద్ : వివిధ కారణాలచే గానీ, వివిధ ప్రమాదాల వల్ల గానీ మరణించిన పోలీసు కుటుంబాలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు సైమరాబాద్ కమీషన్ స్టీఫెన్ రవీంద్ర. గతంలో ఇలాంటి ప్రమాదాల బారిన పడ్డ సిబ్బందికి లేదా పదవీ విరమణ పొందిన సిబ్బందికి వారికి రావాల్సిన నిదుల అంశంలో చాలా జాప్యం జరిగేది. కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా పని అయ్యేది కాదు. సరైన వ్యవస్థ, సమర్ధవంతమైన అధికారులు లేక అలాంటి పరిస్థితులు నెలకొనేవని తెలుస్తోంది. కాని సాంకేతికత పెరిగి అంతా ఆన్ లైన్ వ్యవస్థగా రూపాంతరం చెందిన ప్రస్తుత రోజుల్లో నష్టపరిహారం అంశంలో కూడా ఎలాంటి జాప్యం జరగడంలేదని చెప్పొచ్చు. అంతే కాకుండా స్టీఫెన్ రవీంద్ర లాంటి నిజాయితీ కలిగిన అదికారులు ఉన్నత స్ధానంలో ఉంటే క్రిందిస్దాయి సిబ్బందికి మరింత క్షేమకరంగా ఉటుందని ప్రస్తుత పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

సైబరాబాద్ కమిషనరేట్ లో పని చేస్తూ విధి నిర్వహణలో చనిపోయిన పోలీసుల కుటుంబసభ్యులకు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., చేతులమీదుగా పరిహారాన్ని అందించారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ఆఫీసు సూపరింటెండెంట్ గా పని చేసే సలీం పాషా ఈ ఏడాది ఏప్రిల్లో కోవిడ్ కారణంగా చనిపోయారు. అలాగే సైబరాబాద్ అర్మేడ్ హెడ్ క్వార్టర్ లో అసిస్టెంట్ రిజర్వ్ సబ్-ఇన్స్పెక్టర్ గా పనిచేసే నారం రెడ్డి 2020 నవంబర్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోయినాడు. కాగా వీరిరువురి కుటుంబసభ్యులు సైబరాబాద్ కమీషనర్ ని కలవగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆఫీసు సూపరింటెండెంట్ సలీం పాషా భార్య నుస్రత్ జహాన్ కు పోలీస్ భద్రతా నిధి నుండి 8 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఇందులో వారి ఇద్దరి మైనర్ పిల్లలకు చెరొక 2 లక్షల రూపాయల చొప్పున ఫిక్స్ డ్ డిపాజిట్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా నారం రెడ్డి భార్య శోభ కు వెల్ఫేర్ ఎక్స్ గ్రేషియా నుండి 5 లక్షల రూపాయల చెక్కును అందజేసారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు భద్రారెడ్డి పాల్గొన్నారు.













Click it and Unblock the Notifications