వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ పక్క రైతులు,మరోపక్క విద్యార్థుల ఆత్మహత్యలు.!ఏంటి ఈ మృత్యుకేళి.?ఇంటర్ బోర్డ్ ముందు జగ్గారెడ్డి దీక్ష.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరణ మృదంగం వినిపిస్తోందని, ఓ పక్క విద్యార్ధులు, మరోపక్క రెండు పదుల వయసు లేని పసి విద్యార్థులు తనువు చాలిస్తుంటే హృదయం ద్రవిస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ చోటుచేసుకుంటున్న మృత్యుకేళిని ఇకనైనా ఆపాలని సీఎం చంద్రశేఖర్ రావు కు లేఖ రాసారు జగ్గారెడ్డి. ముక్కుపచ్చలారని ఇంటర్ విద్యార్థులు ఫలితం ఆశించిన స్థాయిలో రాకపోవడం, ఇందులో యంత్రాంగం తప్పిదం ఉండడం, వెరసి కలత చెందిన విద్యార్ధులు ఆత్వహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.

 ఇంటర్ విద్యార్థుల అంశంలో నిర్ణయం తీసుకోవాలి.. సీఎం కేసీఆర్ కు జగ్గారెడ్డి లేఖ

ఇంటర్ విద్యార్థుల అంశంలో నిర్ణయం తీసుకోవాలి.. సీఎం కేసీఆర్ కు జగ్గారెడ్డి లేఖ

ఇంటర్ విద్యార్ధుల అంశంలో సీఎం చంద్రశేఖర్ రావు జోక్యం చేసుకుని మరణాలను ఆపే దిశగా ప్రకటన చేయకపోతే దీక్షకు ఉపక్రమిస్తానని తెలంగాణ ప్రభుత్వాన్ని జగ్గారెడ్డి హెచ్చరించారు. ఇదే అంశం పట్ల 12 గంటలలోపే సీఎం చంద్రశేఖర్ రావు ప్రకటన చేయాలని, లేదంటే రేపు గురువారం ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు దీక్ష చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. ఇంటర్ విద్యార్థుల పక్షాన తాను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు జగ్గారెడ్డి. తాను ఒక్కడినే దీక్ష చేయబోతున్నట్టు స్పష్టం చేసారు. చిన్న పిల్లలకు సంబంధించిన సున్నితమైన విషయం కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు జగ్గారెడ్డి.

 ఇంటర్ విద్యార్థులను ప్రమోట్ చేయండి.. లేకపోతే ఇంటర్ బోర్డ్ ముందు జగ్గారెడ్డి దీక్ష

ఇంటర్ విద్యార్థులను ప్రమోట్ చేయండి.. లేకపోతే ఇంటర్ బోర్డ్ ముందు జగ్గారెడ్డి దీక్ష

కరోనా వైరస్ వల్ల విద్యార్థులు చదువులకు దూరమయ్యారు కాబట్టి ఆన్ లైన్ చదువుల వద్ద పరిపూర్ణమైన విద్య అందడం లేదునే అభిప్రాయాన్ని జగ్గారెడ్డి వ్యక్తం చేసారు. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడినట్టే విద్యారంగంపై పూర్తిగా విరుచుకుపడిందని అన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల చదువుల్లో ఆటంకాలు చోటుచేసుకున్నాయని అన్నారు. ఆన్ లైన్ తరగతులు కొనసాగుతున్నా సబ్జెక్టును విద్యార్థులు సరిగా అవగాహన చేసుకోలేకపోయారని జగ్గారెడ్డి తెలిపారు.
ఇంటర్ విద్యార్థులు మొన్న విడుదలైన ఫలితాలతో మానసికంగా కృంగిపోయారని, మరి కొందరు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత హృదయవిదారకమని ఆందోళన వ్యక్తం చేసారు జగ్గారెడ్డి. విద్యార్థులు ఆశించిన మేర ఫలితాలు రాకపోవడం వల్ల మానసిక వేదనకు గురై, తోటి విద్యార్థుల ముందు నామూషీగా భావించి, ఆత్మ న్యూనతా భావంతో చనిపోతున్నారని అన్నారు.

 ఇంటర్ విద్యార్థులను పాస్ చేయండి.. చిన్నారుల మరణాలను అడ్డుకోవాలన్న జగ్గారెడ్డి

ఇంటర్ విద్యార్థులను పాస్ చేయండి.. చిన్నారుల మరణాలను అడ్డుకోవాలన్న జగ్గారెడ్డి

ఇలాంటి దశలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపాలని జగ్గారెడ్డి సూచించారు. కరోనావైరస్, అకస్మాత్తుగా ఆన్ లైన్ క్లాసుల వల్ల నెలకొన్న అయోమయంతో విద్యార్ధులకు మార్కులు తక్కువవచ్చి ఉండి ఉండొచ్చని జగ్గారెడ్డి అభిప్రాయ పడ్డారు. ఇలాంటి విద్యార్ధులందరికీ అదనపు మార్కులు వేసి పాస్ చేయాలని, విద్యార్థులు చాలా సున్నిత మనస్కులని, సీఎం చంద్రశేఖర్ రావు, విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ విద్యార్థుల పట్ల సానుకూలంగా ఆలోచించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

 అదనపు మార్కులు కలపిండి.. విద్యార్ధుల ప్రణాలు కాపాడాలనన్న జగ్గన్న

అదనపు మార్కులు కలపిండి.. విద్యార్ధుల ప్రణాలు కాపాడాలనన్న జగ్గన్న

విద్యార్ధులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని, గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇప్పుడు అవి పనరావృతం చేయొద్దని విద్యార్థి లోకాన్ని జగ్గారెడ్డి వేడుకున్నారు. నిండా రెండు పదుల వయసు లేని విద్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే వారి తల్లిదండ్రుల కడుపుకోత ఎవరు తీరుస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కాలయాపన చేయకుండా విద్యార్దులకు ఓ మంచి నిర్ణయం ప్రకటించాలని, గతంలో జరిగిన పొరపాట్ల నుండి గుణపాఠం నేర్చుకుని విద్యార్ధులకు ఇకనైనా న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జగ్గారెడ్డి డిమాండ్ చేసారు.

English summary
Sangareddy MLA Jaggareddy, TPCC Working President, said that the death knell was being heard in Telangana, Jaggareddy wrote a letter to CM Chandrasekhar Rao to stop the death toll in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X