వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కళ్లలో నీళ్లు తిరిగాయట : తలసానికి బూస్టింగ్ ఇచ్చిన కేసీఆర్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేసిన శాఖల మార్పులో ఆయా మంత్రుల శాఖలు మారిపోయిన విషయం తెలిసిందే. అయితే మిగతావాళ్ల సంగతి ఎలా ఉన్నా.. మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ల శాఖల మార్పులపై అటు మీడియాలోను, ఇటు జనాల్లోను చాలా చర్చే జరిగింది. మంత్రుల శాఖల మార్పుపై వచ్చిన కథనాల్లో నిజానిజాలెంతో తెలియదు గానీ తలసాని విషయంలో శాఖ మార్పుకు సంబంధించి ఓ ఆసక్తికర కథనం ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తోంది.

వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి అవకతవకలు జరిగినందువల్లే తలసాని శాఖ మారిందనే వాదన బలంగా వినిపించింది. అయితే ఈ విషయంపై చిన్న బుచ్చుకున్న తలసానికి మంచి బూస్టింగ్ ఇచ్చేలా చేశారట సీఎం కేసీఆర్. పార్టీ ప్లీనరీ వేదికపై తలసాని గురించి ప్రస్తావించిన కేసీఆర్ తలసాని ఓ మాస్ లీడర్ అన్న తరహాలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వేదిక మీద తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి వెళ్లబోతున్న తలసానిని ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తలసానికి కళ్లలో నీళ్లు తిరిగేలా చేశాయట.

తీర్మానం ప్రవేశపెట్టడానికి తలసాని వెళ్తున్న సందర్భంలో ఒక్క నిమిషం ఆగు అంటూ ఆదేశించారు కేసీఆర్. తలసాని ఆగిపోగానే శాఖ మార్పుపై స్పందిస్తూ.. 'తలసాని శాఖ మార్చితే తలసానికి ఝలక్ అంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం అది కాదు, నిజానికి నేను తలసానికి ఝలక్ ఇవ్వలేదు, గిలక్ ఇవ్వలేదు. ఆయనతో చర్చించాకే శాఖ మార్చానన్నారు. తలసాని ప్రజా సంబంధాలున్న నాయకుడు. వాణిజ్య వ్యవహారాలతో ప్రజలతో నేరుగా సంబంధం ఉండే అవకాశం తక్కువ. ఆ కారణంతోనే తలసానికి పశు సంవర్ధక శాఖ కేటాయించాను. అంతే తప్ప ఆయన స్థాయి తగ్గించే ప్రయత్నమేది జరగలేదు. ఒకవిధంగా పశు సంవర్ధక శాఖతో ఆయన స్థాయిని మరింత పెంచామన్నారు'.

talasani teary eyed with kcr comments

తలసాని పనితీరుతో వాణిజ్య శాఖ ఆదాయం పెరిగిందని, పశు సంవర్ధక శాఖను కూడా తలసాని సమర్థవంతంగా నిర్వర్తిస్తారనే నమ్మకంతోనే కొత్త శాఖను అప్పగించినట్టుగా చెప్పారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలే తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నవారికి గట్టి జవాబు అని సన్నిహితులతో చెప్పుకుంటున్నారట తలసాని. మంత్రివర్గంలో కేసీఆర్ ఎక్కువగా గుర్తింపునిచ్చే వ్యక్తుల్లో తాను ఒకరినని, శాఖ మార్పు తర్వాత తన మీద బుురద జల్లాలని చూసినవారే, కేసీఆర్ తన గురించి చేసిన కామెంట్స్ ను చూసి తమ అభిప్రాయం మార్చుకుంటున్నారని చెప్తున్నారట.

మొత్తానికి కేసీఆర్ చేసిన కామెంట్స్ తలసానికి కొత్తగా బూస్టింగ్ ఇచ్చినట్టయింది. దీంతో శాఖ ఏదైనా ప్రభుత్వానికి, కేసీఆర్ కు పేరు వచ్చేలాగా పనిచేస్తానంటున్నారు తలసాని.

English summary
telangana minister talasani srinivas yadav feeling very happy with the comments of cm kcr on the dais of trs party plenary
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X