హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీని మింగేసిన ఔటర్ రింగ్ రోడ్డు: వాహనం కొట్టేసి వెళ్లిపోయింది

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. తాజాగా ఆదివారంనాడు ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో టెక్కీ మరణించాడు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. తాజాగా ఆదివారంనాడు ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో టెక్కీ మరణించాడు. టెక్కీ నిబంధలను పాటించకపోవడం వల్లనే ఆ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు.

హైదరాబాద్ : ఔటర్ రింగ్‌రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓసాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మరణించాడు. ఈ ప్రమాదంలో మరొకతను గాయపడ్డాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకొంది.

పోలీసుల కథనం ప్రకారం - కొండాపూర్‌లో నివాసముండే అమీత్‌కుమార్‌రాయ్ (23) టేక్ మహేంద్ర సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తన స్నేహితుడు మహ్మద్‌తో కలిసి బైక్‌పై గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌వైపు ఔటర్ రింగ్‌రోడ్డుపై వెళుతున్నాడు. అయితే అప్పా దాటిన తర్వా త వెనుకనుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం డీకొట్టంది.

Techie dies in mishap on Outer Ring Road

దీంతో అమీత్‌కుమార్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా మహ్మద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. వారు మహ్మద్‌ను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను అప్పటికే మరణించాడు. అమీత్‌కుమార్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలిం చారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నా రు. అయితే నిబంధనలు అతిక్రమించి ద్విచక్రవాహనంపై ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రయాణించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

ద్విచక్రవాహనాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ అమిత్ గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు అమిత్ బైకును నడిపించినట్లు చెబుతున్నారు. పోలీసులు గుర్తు తెలియని వాహనం నెంబర్ ప్లేటును సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. టోల్ గేట్ ఉన్నప్పటికీ అమిత్ బైకు ద్వారా ఆ రోడ్డుపైకి ఎలా ప్రవేశించాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A 24-year-old techie was killed in an accident on ORR early on Sunday morning. The mishap occurred when an unknown vehicle hit the bike that Amit Kumar Rai and his friend were riding. Police said that despite restrictions on the movement of bikes on ORR, Amit drove around 15 km from Gachibowli till Shamshabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X