ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాహుబలి టిక్కెట్లపై కేసీఆర్ శ్రద్ధ, సన్నాసి.. దిగిపో: పొన్నం నిప్పులు

కేసీఆర్ ప్రభుత్వానికి బాహుబలి టిక్కెట్లు, బహిరంగ సభలపై ఉన్న శ్రద్ధ రైతుల పైన లేదని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆదివారం మండిపడ్డారు. రైతులపై కేసులు పెడితే ప్రతిఘటన తప్పదన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వానికి బాహుబలి టిక్కెట్లు, బహిరంగ సభలపై ఉన్న శ్రద్ధ రైతుల పైన లేదని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆదివారం మండిపడ్డారు. రైతులపై కేసులు పెడితే ప్రతిఘటన తప్పదన్నారు.

కాంగ్రెస్ అంటేనే రైతుల సంక్షేమం కోసం చూసే పార్టీ అన్నారు. కేసీఆర్! చేతకాకుంటే దిగిమో, రైతులను మేం ఆదుకుంటాం.. అని పొన్నం వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వంలో రైతులు రోడ్డున పడ్డారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయన్నారు.

రైతులను ఆదుకోని కేసీఆర్ ఓ సన్నాసి అన్నారు. రైతులపై అక్రమంగా కేసులు పెడితే, అరెస్టులు చేస్తే జైల్ భరోకు పిలుపునిస్తామని హెచ్చరించారు.

ponnam prabhakar

ప్ర‌భుత్వ తీరుపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డి మండిప‌డ్డారు. ఏదో రకంగా భూసేకరణ బిల్లు పాస్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించిందన్నారు. కేవ‌లం బిల్లు కొర‌కే ప్ర‌త్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి, దాన్ని రెండు నిముషాల్లో పూర్తి చేసుకుపోయే అప‌వాదు ఈ ప్ర‌భుత్వానికి రాకూడ‌ద‌న్నారు.

ప్ర‌జా స‌మ‌స్య‌లపై మాట్లాడాల్సిన అవ‌స‌రం త‌మ‌పై ఉంద‌న్న విష‌యాన్ని ప్ర‌భుత్వాన్ని ప‌దే ప‌దే గుర్తు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. చ‌ర్చ‌కు డిమాండ్ చేశామ‌ని, ఆ డిమాండ్‌ను అంగీక‌రించలేద‌అన్నారు.

సభ జరిగిన తీరు అప్రజాస్వామికమ‌ని, 5 నిమిషాల్లో బిల్లు పాస్ చేశారని, ఈ సంఘటనను ప్రజలు అర్థం చేసుకోవాలని, ప్రజాసంఘాలు వ్యతిరేకించాలని జానారెడ్డి పిలుపునిచ్చారు. సభలో రైతు సమస్యలపై చర్చించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మిర్చి ధర భారీగా తగ్గడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు.

English summary
Telangana Congress leader and former MP Ponnam Prabhakar lashed out at Telangana CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X