Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ కొత్త ఇంటలిజెన్స్ చీఫ్‌గా అనిల్ కుమార్... ఆ ఎఫెక్టేనా... హాట్ టాపిక్‌గా కేసీఆర్ నిర్ణయం

తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్‌గా అడిషనల్ డీజీపీ అనిల్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం(ఆగస్టు 24) ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్ కుమార్ 1996 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన అధికారి. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ విభాగంలో అదనపు కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాఫిక్‌ సీపీగా అనిల్ కుమార్ స్థానంలో చౌహాన్‌కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇప్పటివరకూ రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్‌గా టి.ప్రభాకర్ రావు కొనసాగుతూ వచ్చారు.

ఆ ఎఫెక్టేనా...

ఆ ఎఫెక్టేనా...

నిజానికి 14 నెలల క్రితమే ఐపీఎస్‌గా ఆయన రిటైర్డ్ అయ్యారు. అయితే ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మూడేళ్ల పాటు పొడగించింది. ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని కీలకమైన నిఘా విభాగానికి చీఫ్‌గా నియమించడంపై గతంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కేసీఆర్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి.ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గతంలో ప్రభాకర్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వృద్ద వెలమ దొరల రాజ్యం నడుస్తోందని విమర్శించారు.పోలీస్ వ్యవస్థలో ప్రైవేట్ సైన్యంలా ప్రభాకర్ రావు పనిచేస్తున్నారని ఆరోపించారు.ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ,ప్రత్యర్థులను వేధించేవారికి పోస్టింగులు ఇస్తున్నారని ఆరోపించారు.

రేవంత్,ఈటల విమర్శల ఎఫెక్టా...?

రేవంత్,ఈటల విమర్శల ఎఫెక్టా...?

ఇటీవల దళిత గిరిజన దండోరా సభలోనూ ప్రభాకర్ రావుపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రభాకర్ రావు పదవి నుంచి తప్పుకుని అమెరికా వెళ్లినా సరే.... రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి మరీ తీసుకొస్తామన్నారు. ఒక్క దెబ్బకు వంద దెబ్బలు కొడుతామని హెచ్చరించారు.హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా ప్రభాకర్ రావుపై తీవ్ర ఆరోపణలు,విమర్శలు చేశారు.'ప్రభాకర్ రావు.. నువ్వ చట్టానికి లోబడి పని చేస్తున్నావా?.. చుట్టాలనికి లోబడి పని చేస్తున్నావా?.. కేసీఆర్ చుట్టం లెక్క పని చేస్తే ఒప్పుకోము. వందల మంది ఇంటలిజెన్స్ అధికారులు హుజూరాబాద్‌లో తిరుగుతున్నారు. నువ్వు రాజకీయాలు చేయాలంటే గులాబీ కండువా కప్పుకో. మీ ఇజ్జత్ పోతోంది. మిమ్మల్ని చూసి ప్రజలు అసహ్య పడుతున్నారు. ఎన్నికల అప్పుడు ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారు' అని హెచ్చరించారు.

హాట్ టాపిక్‌గా కేసీఆర్ నిర్ణయాలు...

హాట్ టాపిక్‌గా కేసీఆర్ నిర్ణయాలు...

పదవుల విషయంలో సొంత సామాజికవర్గానికి చెందిన అధికారులకు కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. యువత ఐఏఎస్‌లకు పోస్టింగులు ఇవ్వకుండా... రిటైర్డ్ అయిన అధికారులను తీసుకొచ్చి కీలక పదవుల్లో నియమించడమేంటని ఆకునూరి మురళి లాంటి ఐఏఎస్ అధికారులు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ప్రభాకర్ రావు స్థానంలో అనిల్ కుమార్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ఇటీవలే దళిత సామాజికవర్గానికి చెందిన ఐఏఎస్ రాహుల్ బొజ్జాను సీఎంవో సెక్రటరీగా నియమించిన సంగతి తెలిసిందే. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ అధికారులపై కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలకు చెక్ పెట్టేందుకే కేసీఆర్ ఇటీవలి కాలంలో వారికి ప్రాధాన్యం ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది.

Recommended Video

    మూడుచింతలపల్లి లో కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల దీక్ష
    కేసీఆర్‌లో మార్పు?

    కేసీఆర్‌లో మార్పు?

    హుజురాబాద్ ఉపఎన్నిక ఎఫెక్టో లేక మరేమో తెలియదు గానీ కేసీఆర్‌లో మాత్రం మార్పు ప్రస్పుటంగా కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది. ఎప్పుడూ ఫాంహౌస్‌కే పరిమితమయ్యే ఆయన ఇటీవల జనంలో తిరుగుతున్నారు.పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే నాగార్జునసాగర్‌లో పర్యటించి... గతంలో ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఖాళీగా ఉన్న ఎస్సీ కార్పోరేషన్,బీసీ కమిషన్ ఛైర్మన్ పదవులను భర్తీ చేశారు. కేసీఆర్‌లో కనిపిస్తున్న ఈ మార్పు హుజురాబాద్ ఉపఎన్నిక పుణ్యమే అని ప్రత్యర్థులు అంటున్నారు. ఈటల పుణ్యమాని కేసీఆర్ దిగొస్తున్నారని... ఓటమి భయం వల్లే జనంలో తిరుగుతున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

    ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్

    ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్

    హుజురాబాద్ ఉపఎన్నికను సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పేరుకు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను టీఆర్ఎస్ తరుపున బరిలో దింపుతున్నప్పటికీ... ఉపఎన్నికను కేసీఆర్ వర్సెస్ ఈటల గానే చాలామంది విశ్లేషిస్తున్నారు. అందుకే కేసీఆర్ హుజురాబాద్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఎస్సీ కార్పోరేషన్,బీసీ కమిషన్ పదవులను హుజురాబాద్ నేతలకే ఇచ్చారు. కొత్త ఫించన్లు,కొత్త రేషన్ కార్డులు,రోడ్లు,ఇతరత్రా అభివృద్ది కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. దళిత బంధును పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడి నుంచే ప్రారంభించారు. నియోజకవర్గంలోని దాదాపు 20వేల పైచిలుకు దళిత కుటుంబాలకు... కుటుంబానికి రూ.10లక్షలు చొప్పున చెల్లించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.1000 కోట్లు విడుదల చేశారు. మరో రూ.1000 కోట్లు త్వరలోనే విడుదల చేయనున్నారు.

    దళిత బంధు ప్రకటన తర్వాత ఇతర వర్గాల నుంచి కూడా డిమాండ్లు వెల్లువెత్తడంతో... బీసీ,ఓసీ,మైనారిటీ వర్గాల్లోని పేదలకు కూడా ఈ పథకాన్ని అమలుచేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆయా వర్గాల్లోని పేదలకూ కుటుంబానికి రూ.10లక్షలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. నిజానికి ఏడాది క్రితమే దళిత బంధు పథకం అమలుకావాల్సిందని... కరోనా వల్ల ఆలస్యమైందని కేసీఆర్ చెబుతున్నారు. అయితే హుజురాబాద్ ఉపఎన్నిక కారణంగానే కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారనే వాదన వినిపిస్తోంది. దళిత బంధు అమలు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే అనేక సందేహాలు,అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో బీసీ,ఓసీ,మైనారిటీ వర్గాలకు కూడా ఈ పథకాన్నిప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పథకాలు అమలుచేసి తీరితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌కు తిరుగుండదని కేసీఆర్ భావిస్తున్నారు. ఒకవేళ అమలులో విఫలమైతే మాత్రం అంచనాలు తలకిందులయ్యే అవకాశం లేకపోలేదు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+