మోడీకి కేసీఆర్ లేఖ: జాత్యహంకార దాడులను ట్రంప్ దృష్టికి తీసుకెళ్లాలని!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాశారు. జాత్యహంకార దాడులతో అక్కడి భారతీయుల్లో ఆందోళన నెలకొందని, వారి సమస్యలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ఇక నేటి అసెంబ్లీ సమావేశంలో పలుభివృద్ది పథకాల గురించి సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30 వేల డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం జరుగుతున్నదని, ఈ ఏడాది మొత్తంగా 2లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఈ ఇళ్లు గత కాంగ్రెస్, టీడీపీ హయాంలో నిర్మించిన 14లక్షల ఇళ్లకు సమానమని తెలిపారు. మునుపెన్నడూ లేని పద్ధతుల్లో ఈసారి బడ్జెట్‌లో వృత్తిదారులు తమను తాము చూసుకుని సంబరపడుతున్నారని అన్నారు.

Telangana cm kcr on development schemes of trs

దాస్ క్యాపిటల్ ప్రస్తావన:

కమ్యూనిస్టు సిద్దాంతాన్ని ఆచరించడంలో ఇక్కడి కమ్యూనిస్టులు వైఫల్యం చెందారని కేసీఆర్ పరోక్షంగా ప్రస్తావించారు. కమ్యూనిస్టు సిద్దాంతం ప్రాధాన్యత గురించి సభలో వివరించారు. మావో, లెనిన్ కమ్యూనిస్టు సిద్దాంతం పరిణామశీలంగా ఉంటుందని, తాను దాస్ క్యాపిటల్ చదివానని అన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో మార్క్ ఫెడ్ కీలక పాత్రం పోషించారని ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చారు.

ప్రధాని వద్దకు అఖిలపక్షంతో:

ఎస్సీ వర్గీకరణ, ఇతరత్రా సమస్యలపై చర్చించేందుకు ప్రధాని మోడీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్తానని సీఎం కేసీఆర్ తెలియజేశారు. మోడీ అపాయిమెంట్ ఖరారు కాగానే ఈ కార్యచరణ ఉంటుందన్నారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్‌తోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమిషన్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. హజ్ భూములకు సంబంధించి హౌజ్ కమిటీకి రిఫర్ చేద్దామని పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana CM KCR wrote a letter to Prime minister Modi on Indo-American problems. Especially the consecutive attacks on indians in america
Please Wait while comments are loading...