కేసీఆర్‌! ఆ మాటలేమయ్యాయి?: ఉద్యమిస్తామని తమ్మినేని విమర్శలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర తీవ్రంగా విమర్శించారు. ప్రాజెక్టులు, పరిశ్రమల పేరిట ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ అస్తవ్యస్తంగా ఉందని ఆరోపించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినదానికి.. క్షేత్రస్థాయిలో వ్యవహారాలు విరుద్ధంగా ఉన్నాయని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మల్లన్నసాగర్‌ కోసం 2013 చట్టం లేదా జీవో 123 ప్రకారం రైతులు ఏది కోరుకుంటే దాని ప్రకారమే పరిహారం ఇస్తామన్న సర్కారు మాటలు చేతల్లో అమలు కావడం లేదన్నారు.

గ్రామసభలు నిర్వహించి రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పరిహారం ప్రకటిస్తే పద్ధతిగా ఉండేదన్నారు. ప్రభుత్వ వ్యవహార శైలికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వాసితులు ఉద్యమాలు చేస్తున్నారని వారికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

thammineni veerabhadram lashes out at CM KCR

జపాన్ రాయబారితో మంత్రి కెటిఆర్

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఉదయం జపాన్ ‌రాయబారి యూపాక కికుటుతో సమావేశమై మేకిన్‌ తెలగాణ అంశంపై చర్చించారు. ఈ సాయంత్రమే మలేసియా ఉప ప్రధానితో కేటీఆర్‌ భేటీ కానున్నారు.

మంగళవారం ఉదయం 11గంటలకు సునిల్‌ మిట్టల్‌తో బేటీ కానున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనున్నారు. సాయంత్రం 4గంటలకు తైవాన్‌ రాయబారి తుంగ్‌కవాంగ్‌తో, 5గంటలకు దక్షిణ కొరియా రాయబారి హ్యున్‌చావ్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ కానున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CPM leader thammineni veerabhadram on Tuesda lashed out at Telangana CM K Chandrasekahr Rao.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి