వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఎస్‌పిఎస్సీ పరీక్షలు: తెలంగాణ కోణంలో సాహిత్యాన్ని ఎలా చదవాలి?

By Pratap
|
Google Oneindia TeluguNews

ప్రస్తుత తెలుగు సాహిత్యాన్ని తెలంగాణ దృక్కోణం నుంచి చూడాల్సిన అవసరం ఉంది. తెలుగు సాహిత్యానికి వాదాలు, సిద్ధాంతాల గొడవ ఎక్కువ. ఎప్పుడు ఏ వాదన బంగా ముందుకు వస్తే అందుకు అవసరమైన సాహిత్యం పుట్టుకొస్తోంది. ఇలా పుట్టుక రావడం సహజం కూడా. అలా వచ్చిన వాటిలో విప్లవ సాహిత్యానంతరం స్త్రీ, దళిత, ముస్లిం సాహిత్యాలు ముఖ్యమైనవి. ఈ ధోరణుల్లో తెంగాణ సాహిత్య పాయ ఎలా వ్యక్తమైందనేది ఇప్పుడు పరిశీలించాల్సిన అవసరాన్ని కాలమే కల్పించింది.

సాహిత్య విమర్శ కొమానాలు సరిగా లేనందున తెంగాణ సాహిత్యాన్ని బేరీజు వేయడంతో అన్యాయమే జరుగుతోంది. తెంగాణ సాహిత్య విమర్శకు కూడా కోస్తాంధ్ర విమర్శకు కొలమానాతో సాహిత్యాన్ని బేరీజు వేసేంతగా మానసికంగా సంసిద్ధమయ్యారు. ఈ ప్రమాణాలను పక్కన పెట్టి తెంగాణ సాహిత్యాన్ని కొత్త ప్రమాణాలతో, స్థానిక ప్రమాణాతో చూడాల్సిన అవసరం ఉంది. నిజానికి, ప్రాచీన సాహిత్యాన్ని సంస్కృత కొమానాలతో, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని పాశ్చాత్య కొమానాలతో బేరీజు వేయడం అవాటుగా మారింది. పాశ్చాత్య పండితుల మాటను ఉటంకిస్తూ విమర్శ చేస్తే తప్ప విలువ లేని పరిస్థితి ఏర్పడింది.

విప్లవ సాహిత్య విమర్శ తెలంగాణలోని విప్లవోద్యమానికి దూరంగా వున్నవాళ్లను చూడ నిరాకరించింది. విప్లవ సాహిత్య ఉధృతిలో మిగతా రచయితలు, కవులు కనిపించకుండా పోయారు. రాయసీమలోనూ, కోస్తాంధ్రలోనూ, అంతగా చెప్పాల్సివస్తే ఉత్తరాంధ్రలో కూడా ఈ స్థితి లేదు. కథా ప్రక్రియ విషయానికి వస్తే సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట అళ్వారుస్వామి పట్ల కూడా సాహిత్య చరిత్రకాయి అనుసరించిన వైఖరి చూస్తే ఎంత వివక్ష వెంటాడుతూ వస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. పి. యశోదారెడ్డి, ఇరివెంటి కృష్ణమూర్తి, సురమౌళి, అంతా ఎందరెందరో మరుగున పడిపోయే పరిస్థితి దాపురించింది.

TSPSC: How to read literature in Telangana angle?

నిన్న మొన్నటి వరకు అల్లం రాజయ్యకు, తుమ్మేటి రఘోత్తమరెడ్డికి ఎక్కడలేని ప్రచారం వుండేది. వీరిద్దరినీ తల మీదికి ఎత్తుకున్నట్లు నటిస్తూ మిగతా కథా రచయితను గుర్తించకుండా చేశారు. ఇప్పుడు వారిద్దరినీ కింద పడేసి ముందుకు సాగే ప్రయత్నంలో ఇతర ప్రాంతాల కథారచయితలు వున్నారు. విప్లవ కథను మోసే పెను బాధ్యతను ఎత్తుకున్న సాహిత్య విమర్శకు తెలంగాణ జీవన సరిస్థితును, కుటుంబ సంబంధాలను, మానవ సంబంధాలను, మానసిక సంబంధాలను చిత్రించిన కథను పక్కన పెట్టేశారు.

రాయసీమ కథా రచయితలు గొప్పగా రాయసీమ జీవితాన్ని చిత్రించారనే విమర్శకు తెలంగాణ జీవితాన్ని కూడా చిత్రించిన కథా రచన జరిగిందనే విషయాన్ని ఒప్పుకోవడం లేదు. ఆ కథను చూడ నిరాకరించారు, నిరాకరిస్తున్నారు. కథ విషయంలోనే కాదు కవిత్వం విషయంలోనూ ఇదే జరుగుతోంది. అర్థం కాదనే నెపంతో తెంగాణ కవుల భాషను, యాసను వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి, భాష యాస మాట అలా వుంచితే, కోస్తాంధ్ర సిద్ధాంతకర్తు, విమర్శకు ముందుకు తెచ్చిన దళిత, మైనారిటీ వాదాలు తెంగాణాలో ఒక రకంగానూ, కోస్తాంధ్రలో మరో రకంగానూ వ్యక్తమవుతూ వస్తున్నాయి. స్త్రీవాదానికి వస్తే తెంగాణా కోణం మచ్చుకైనా కనిపించదు.

1.

తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం ఒక ఉప్పెనలా వచ్చింది. విప్లవ సాహిత్యోద్యమంపై స్త్రీవాద సాహిత్యం ప్రశ్నలు సంధించింది. సమాజంలోని స్త్రీ వివక్షపై ప్రశ్నలు వేసింది. తన ఐడెంటిటీని నిబెట్టుకుంది. అయితే, దీనికి పరిమితులున్నాయి. ఒకటి - ప్రస్తుతం చెలామణి అవుతున్న స్త్రీవాదంతో పల్లె స్త్రీలకు పాత్ర లేకపోవడం, వారి సమస్యలను పట్టించుకోకపోవడం. రెండు తెలంగాణ స్త్రీ పాత్ర ప్రస్తుత స్త్రీవాద సాహిత్యంలో నామమాత్రం కావడం. మొదటి అంశం విషయంలో ఇప్పటికే కొద్దో గొప్పో చర్చ జరిగింది. రెండో అంశం విషయంలో ఇప్పుడిప్పుడే ఆలోచన మొదలైంది. తెంగాణ సాంస్కృతిక, సామాజిక మూలాలు కోస్తాకు భిన్నమైనవనే ఆలోచన పదునుదేరిన తర్వాత ఈ ఆలోచన మొదలైంది. ఇందుకు తగినట్లుగానే స్త్రీవాద సాహిత్యంలో తెలంగాణా స్త్రీ పాత్ర చాలా తక్కువ. ఉన్న ఒకరిద్దరు కూడా కోస్తాంధ్ర స్త్రీ వాదనను, వారి ప్రయోజనాను కాపాడే వారిగానే మిగిలిపోయారు. నిజానికి స్త్రీవాద సాహిత్యం తొగులో ఇప్పటివరకు నెరవేర్చిన ప్రయోజనం ఏమిటనే ప్రశ్న వేసుకుంటే ప్రాంతీయ ఆలోచన ఆవిర్భావానికి గ కారణాలేమిటో అర్థమవుతాయి.

కారణాల గురించి ఆలోచించే ముందు ప్రస్తుత స్త్రీవాద ప్రయోజనం ఏమిటి, దీనికి ప్రాతిపదిక ఎక్కడుంది అనే ప్రశ్నలు కూడా వేసుకోవాలి. ఆధునిక వచన సాహిత్యం మొదలైన తర్వాత కోస్తా తెలుగు కథా రచయితలు, నవలాకారులు తెలుగు సమాజంలో స్త్రీ విద్యావంతురాలు కావడం, ఉద్యోగాలు చేయడం గురించి మాట్లాడుతూ వస్తున్నారు. స్త్రీ స్వేచ్ఛ గురించి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. చం, గోపిచంద్‌ వంటి రచయితలు నేటి స్త్రీవాద రచయిత కన్నా ముందుకు వెళ్లి రచను చేశారు. సమాజంలో వస్తున్న మార్పుకు అనుగుణంగా మార్పు చెందడాన్ని కోస్తా వచన సాహిత్య ప్రక్రియ బోధిస్తూ వచ్చింది. స్త్రీకి ఉన్న సంకెళ్ళను తెంపేస్తూ వచ్చింది. సమాజంలో స్త్రీ మొబిలిటీ అవసరాన్ని అది నొక్కి చెప్పుతూ వచ్చింది. సామాజిక అవసరాల దృష్ట్యా, కుటుంబ అవసరాలు దృష్ట్యా స్త్రీని కుటుంబం నుంచి బయటి ప్రపంచంలోకి తెచ్చే ప్రయత్నం ఆ సాహిత్యంలో జరిగింది. నవల, కథ అనేవి ఆధునిక ప్రక్రియు కాబట్టి ఆధునిక సమాజం అందించిన అవకాశాను తెలియజేసేందుకు, ఆ అవకాశాను అందుకోవడానికి స్త్రీ స్వేచ్ఛను తెలియజెప్పేందుకు మంచి సాధనాలయ్యాయి. మధ్యతరగతి చదువుకున్న స్త్రీలకు అవి చేరాయి. స్త్రీ తన కాళ్ల మీద తాను నిబడాల్సిన అవసరాన్ని ఇవి చెప్పాయి. ఇందుకు ఆటంకాలుగా వున్న జెండర్‌ ప్రాధాన్యాన్ని ఈ రచను తగ్గిస్తూ వచ్చాయి. ఇందులో భాగంగా సెక్స్‌ స్వేచ్ఛ గురించి మాట్లాడాయి. ఒక స్త్రీ అవివాహితురాలిగా సెక్స్‌లో పాల్గొంటే పెద్దగా తప్పు పట్టాల్సిన పని లేదని వ్యాఖ్యానించాయి. వి. రాజరామమోహన్‌ రాయ్‌ కథను ఈ కాంటెస్ట్‌లోనే చూడాల్సి వుంటుంది. మామూలుగా చూస్తే కొంత సెక్స్‌ను కలబోసిన కథుగా ఇవి కనిపిస్తాయి. కానీ, అవి ఇచ్చే సందేశం స్త్రీ నిత్యజీవన మనుగడకు సంబంధించింది. సమాజంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, పైమెట్లు ఎక్కడానికి సెక్స్‌ అవసరాను కట్టుబాట్లకు భిన్నంగా తీర్చుకున్నా ఆమోదయోగ్యమేనని ఆయన తన కథల్లో చెప్తారు. కోస్తాంధ్ర సాహిత్యంలో ఇదొక ట్రెండ్‌.

ఈ దశదాకా స్త్రీ గురించి పురుషుడు మాట్లాడాడు. ఇదంతా స్త్రీల గురించి రాసినప్పటికీ పురుషుడు పురుషుడికి ఉద్దేశించిన సాహిత్యమే. సమాజంలో స్త్రీ ఎదుగుదకు ఆటంకం కుటుంబంలోని పురుషులు. కుటుంబంలోని పురుషుడు తన మానసిక సంకెళ్ల నుంచి బయటపడ్డానికి ఈ సాహిత్యం పని చేసింది. ఇప్పుడు స్త్రీలు తమ గురించి తామే మాట్లాడుతున్నారు. ఇందుకు అటువంటి సాహిత్యమంతా ఒక భూమికను తయారు చేసింది. ఇప్పుడు స్త్రీలు సెక్స్‌ స్వేచ్ఛ గురించి ప్రధానంగా మాట్లాడుతున్నారు. సెక్స్‌ కట్టుబాట్ల నుంచి స్త్ర్రీలు బయటపడితే, ఒక రకంగా స్త్రీత్వం నుంచి బయటపడితే అవకాశాను అందిపుచ్చుకుని ముందుకు దూకవచ్చు. ఇప్పుడు జరుగుతున్నదదే. వైవాహికేతర సంబంధాలు తప్పు కాని ‘విలువ' ఒకటి - ఒక వర్గానికి చెందిన వారిలో స్థిరపడి పోయింది. స్త్రీలు సాహిత్యంలో సెక్స్‌ స్వేచ్ఛ గురించి మాట్లాడ్డం తగ్గింది. సమాజంలో వారిస్థానం గురించి వారే మాట్లాడే స్థితి వచ్చేసింది. అంటే, దీన్ని రాయప్రోలు సుబ్బారావు ‘అమలిన శృంగారం' సిద్ధాంత ప్రతిపాదన నుంచి చలం రచనకు ఆచరణలో పరిణామంగా చూడాలి. స్త్రీలు తప్పనిసరిగా బయటి సమాజంలో కాలు పెట్టాల్సిరావడం, దానివల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితును అధిగమించడానికి మానసికంగా సంసిద్ధులు కావడం కోస్తా ప్రజలు తమ కోణం నుంచి తాము సృష్టించుకున్న సాహిత్యంగా దీన్ని చూడాల్సి వుంటుంది. అదే సమయంలో అది ఇతర ప్రాంతాలవారి దృష్టిలో ఒక ‘లెజిటమసీ'ని కల్పించుకోవడం కోసం జరిగిన ప్రయత్నం కూడా (ఇదంతా తప్పని కాదు, ఎదుగుదతో అసమానతకు ఇది ఉపయోగపడిరది). కోస్తా స్త్రీలు సమాజంలో ఎదిగిన స్థాయికి పురుషులు కూడా ఎదగలేదు. అందుకే స్త్రీవాదంపై జ్వాలాముఖి వంటివారు నిప్పు కక్కారు. ఒక రకంగా ఇది వారి పురుష అహంకారం కాదు. వారి ‘వెనుకబాటుతనం'. సమాజంలో ఎదగడానికి, అవకాశాను అందుకోవడానికి స్త్రీవాదం ఒక సాధనమనే విషయం స్ఫురణకు రాకపోవడం.

తెంగాణలో ఈ పరిస్థితి లేదు. స్త్రీవాదం గురించి మాట్లాడే స్త్రీ రచయితలు ఒకరిద్దరు కూడా కోస్తాంధ్ర స్త్రీవాదు వరుసలో చివరన నిలబడ్డారు. ఇదే సమయంలో తెంగాణ పురుష రచయితలు కొంతమంది ఇంకా విప్లవోద్యమ సాహిత్యం దగ్గరే వుండిపోతే, మరికొందరు కోస్తా స్త్రీ రచయితతో గొంతు కలిపారు. దీనికి సాంస్కృతిక, సామాజిక అంతరాలు కారణం. విద్య అనేది కోస్తాలో చాలా ముందుగా అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది పాఠకు తయారయ్యారు. దీంతో వారికోసం ఉద్దేశించిన వచన సాహిత్యం నిర్వర్తించాల్సిన పాత్ర దాదాపుగా ముగిసింది. దీంతో వారి కార్యరంగమంతా తెంగాణకు మారింది.
స్త్రీల కోసం పని చేసే ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జివోలు) ఇక్కడ ఎక్కువగా తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. వీరు చేసే పనిలో ప్రాంతీయ వివక్ష కొట్టచ్చినట్లు కనిపిస్తూనే వుంటుంది. ఇటీవ అస్మిత అనే సంస్థ అచ్చువేసిన ‘మహిళావరణం' అనే బృహద్గ్రంథం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. ఈ స్థితిలో కోస్తా స్త్రీవాదు సమస్యలు, తెంగాణ స్త్రీ సమస్యలు ఒక్కటి కావనే విషయం తెలంగాణ స్త్రీ రచయితలు, పురుష రచయితలు, విమర్శకు గుర్తించాల్సిన అవసరం వుంది.

అంతేకాకుండా, కోస్తా స్త్రీలు స్త్రీకి సెక్స్‌ స్వేచ్ఛ గురించి, కుటుంబం నుంచి విముక్తి గురించి మాట్లాడుతుంటే తెంగాణ రచయితలు చాలామంది విప్లవ కథలు రాస్తూ పోయారు. (మొదటి నుంచి తెంగాణా కథ తెంగాణాలోని సామాజిక సంబంధాలు గురించి, ఉద్యమా గురించి మాత్రమే మాట్లాడుతూ వచ్చింది. సమాజంలో పైమెట్లు అధిరోహించడానికి అవసరమైన మధ్యస్థ సాహిత్య సృష్టి చాలా తక్కువగా జరిగింది). పురుషులు కూడా స్త్రీపురుషుల మధ్య వైవాహికేతర సంబంధాల గురించి కోస్తాతో పోల్చుకుంటే ‘వెనుకబాటుతనాన్నే' ప్రదర్శించారు. అ్లం రాజయ్య ‘అతడు' కథలో నక్సలైట్‌ లీడర్‌కి, అతని ద్వారా చైతన్యం పొందిన మహిళకు మధ్య పెరిగిన మానసిక సాన్నిహిత్యం గురించి మాత్రమే రాశారు. ఇరువురి మధ్య సెక్స్‌ సంబంధం వుందనే విషయాన్ని ఆయన రాయలేదు. ఆ సంబంధం వుంటే వుండవచ్చు. లేకుంటే లేకపోవచ్చు. అది చర్చనీయాంశమే కాలేదు. అంటే తెంగాణ సాహిత్యంలో సెక్స్‌ సంబంధాలు చర్చనీయాంశమే కాలేదు. అంటే తెంగాణ సాహిత్యంలో సెక్స్‌ సబంధాు చర్చనీయాంశం కూడా కాని స్థితి వుందని అర్థం చేసుకోవాలి. అలాగే, తుమ్మేటి రఘోత్తమరెడ్డి ‘పనిప్లి' కథపై వివాదం చెరేగడం కూడా ఈ దృష్టితోనే చూడాలి. (పనిప్లి కథ స్త్రీవాదానికి వ్యతిరేకమైందనే వివాదం చెరేగింది). ఈ దృష్ట్యా తెలంగాణ వచన ప్రక్రియల్లోని స్త్రీపురుష సంబంధాలను, స్త్రీపాత్రలను, సామాజిక సంబంధాలను కొత్త కోణం నుంచి అధ్యయనం చేయాల్సి వుంటుంది.

2.
ముస్లిం తెలుగు సాహిత్యం ఇవాళ్ల తీవ్రమైన దాడిని ఎదుర్కుంటోంది. అదీ తెంగాణ నుంచి వచ్చిన ముస్లిం సాహిత్యం మీద మాత్రమే ఈ దాడి జరుగుతోంది. స్కైబాబ రాసిన ‘సుల్తానా' అనే కథ మూంగా దాడి ప్రారంభమైంది. ‘సుల్తానా' కథ ఒక ముస్లిం అమ్మాయి హిందువును ప్రేమిస్తే ఏ రకంగా మోసపోతుందో చెప్పే కథ. ఈ కథ ఒక తెలుగు వారపత్రిక సాహిత్య ప్రత్యేక సంచికలో అచ్చయింది. ఈ సంచిక వెలువడిన చాలా రోజుల తర్వాత ఆ కథ మీద దాడి ప్రారంభమైంది. కథ మీదనే కాకుండా ‘జల్‌జలా' అనే తెలుగు ముస్లిం కవితా సంకలనంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ కవితాసంకలనం వెలువడి కొన్నేళ్ళవుతోంది. చాలాకాం ‘జల్‌జలా' సంకలనంలోని కవితపై తెలుగు సాహిత్యరంగం మౌనమే పాటించింది. ఈ మౌనం వెనకగస కారణాలేమిటనేది ఇప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే కొత్తగా వచ్చిన, వస్తున్న ఆలోచనసపట్ల, విమర్శలపైన తెలుగు సాహిత్యం ఎప్పుడూ మౌనమే పాటించింది, పాటిస్తోంది. ఆంధ్ర సంపాదకుల నేతృత్వంలో మెవడిన ‘జిహాద్‌'పై, ఆంధ్ర ముస్లింలు రాస్తున్న రచనలపై గానీ ఈ దాడి జరగడం లేదు. పైగా వాటిని అక్కున చేర్చుకుంటున్నారు. ‘సుల్తానా' కథగానీ, ‘జల్‌జలా' సంకసనంలోని కొన్ని కవితలు గానీ హిందువులకు రుచించకపోవడం అసాధారణమేమీ కాదు. పైగా, ఉదార సెక్యులరిస్టుకు అవి మింగుడు పడడం మరీ కష్టం. అయితే, చిక్కల్లా కొందరు తెలుగు ముస్లిం సాహిత్యకారులు కూడా స్కైబాబకు వ్యతిరేకంగా మాట్లాడడంతో సమస్య వచ్చి పడిరది.

‘జల్‌జలా' కవులు ఇస్లాం మతంలోని, సమాజంలోని అణచివేత ధోరణులను, పేదరికాన్ని, వివక్షను ప్రశ్నిస్తూ కూడా బమైన కవితలు రాశారు. ఈ రకంగా చూస్తే మొదట తమ మతపెద్ద ఆగ్రహానికి ఈ కవులు గురి కావాల్సివుంటుంది. స్కైబాబ ధోరణివల్ల చాలా మందిని దూరం చేసుకునే పరిస్థితి వస్తుందనేది కొందరి వాదన. ఇందులో నిజం లేకపోలేదు. అయితే, ఎవరిని నొప్పించకుండా ఐడెంటిటీ ఉద్యమాలు నడిపించడం గానీ, అందుకు సంబంధించిన సాహిత్య సృజన చేయడం గానీ సాధ్యం కాదు. దళితులు అగ్రకులాపై తీవ్రంగా ధ్వజమెత్తారు. స్త్ర్రీలు పురుషులపై విరుచుకపడ్డారు. ఈ విమర్శలు హద్దు దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే, ‘జల్‌జలా' కవులు కూడా హద్దు దాటారు. ఈ హద్దులు దాటడం అవసరమా, కాదా అనే దగ్గర పేచీ వస్తుంది. హద్దు దాటకుండా సున్నితంగా, సుతిమెత్తంగా మాట్లాడానేది కొందరి వాదన. కవిత్వం ఎవరినీ నొప్పించకూదనేది వారి వాదనలోని ఆంతర్యం. ఇది చెప్పడానికి, వినడానికి కూడా బాగానే వుంటుంది. సుతిమెత్తగా మాట్లాడడమంటే ‘హేతుబద్దంగా' వాదించి ఎదుటివారిని ఒప్పించానడమే అవుతుంది. ఆధిపత్యాన్ని అనుభవిస్తున్న ఎవరూ కూడా సుతిమెత్తని హేతువును అంగీకరించి తన దారిన మార్చుకోరనే విషయాన్ని కాస్తా ఇంగితం ఉన్న వారెవరైనా చెప్పేయగలరు.

కానీ, స్థిరీకృత విలువలను దెబ్బకొట్టి కొత్త విలువలను ప్రతిపాదించే సందర్భంలో ‘అతి' కవిత్వంలో అవసరమే అవుతుంది. స్త్రీ దళితవాదులే కాదు, దిగంబర కవులు కూడా అదే విధంగా వ్యవహరించారు. వారిని కొంతమేరకు వ్యతిరేకించిన సాహితీ పెద్దలు కొందరు ఈ తర్వాత వెనక్కి తగ్గారు. అయితే, ముస్లిం తెలుగు కవుల విషయంలో ఆ రాజీకి ఎందుకు వెనకాడుతున్నారు? దళిత, స్త్రీవాదలు ఐడెంటిటీ వేరు, ముస్లిం ఐడెంటిటీ వేరు కావడమే అందుకు కారణం. అంతేకాదు, స్త్రీ, దళితవాదాలు ముందుకు నడిపిస్తున్నది కోస్తాంధ్ర సాహితీవేత్తలు. ముస్లింవాదానికి తెంగాణా నాయకత్వం వహించే పరిస్థితులు వచ్చాయి. తెంగాణ పల్లెల్లో హిందువులు, ముస్లింలు ఎవరి మతాచారాను వారు పాటిస్తూనే సహజీవనం చేసే పరిస్థితి వుండేది/ఉంది. అంటే, ఇక్కడ ముస్లిలు తమ ప్రత్యేక గుర్తింపును కోల్పోలేదు. ఇదే సమయంలో ముస్లింలు, కింది కులాలవాళ్లు కలిసి చేసుకునే పీర్ల పండగ వంటి కొత్త సంప్రదాయాలు పుట్టుకొచ్చాయి. దర్గాలు, పీర్ల పండుగ వంటివి ఈ సహజీవనాన్ని మరింత పెంచాయి.

కోస్తాంధ్రలో ముస్లింలు తమ ఐడెంటిటీని కోల్పోయారు. ఒక మేరకు కోస్తాంధ్రకు ఆనుకుని వున్న తెలంగాణా జిల్లాల్లోని ముస్లింలు కూడా ఈ ఐడెంటిటీని కోల్పోయారు. ఒకరకంగా, వారు తమ గుర్తింపులేకుండా హిందూ మెజారిటీ మతానికి తలొగ్గారు. తెలంగాణ పల్లెల్లో ఎవరి ఆచారాలకు వారు (మూఢాచారాలయినా సరే) కట్టుబడి వుంటూ కూడా పరస్పర విద్వేషాలు పెంచుకోలేదు. (తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను అధ్యయనం చేస్తే కూడా ఈ విషయం తెలుస్తుంది). నగరాల్లో, పట్టణాల్లో ఈ విద్వేషాలు చాలా కాలం తర్వాత చోటు చేసుకోవడం ప్రారంభించాయి. స్థానిక ముస్లింలకు, హిందువులకు ఎప్పుడూ వైరం లేదు. బయట నుంచి వచ్చిన ముస్లిం హిందువుల కారణంగా ఈ విద్వేషాలు మొదలయ్యాయి. వీటి వెనక రాజకీయోద్దేశ్యాలున్నాయి. అప్పటి పరిస్థితి అదయితే, దేశంలో బిజెపి ప్రాబల్యం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రాబల్యం పెరుగుతుండడం వల్ల హిందూ ముస్లిం మధ్య కృత్రిమ వైరాన్ని మరింత పెంచి పోషించే శక్తులు పెరిగాయి. చదువుకున్న మధ్యతరగతి పట్టణవాసుల మనోభావాను ప్రభావితం చేసే ఈ శక్తులు ముస్లింల ను మరింతగా దూరం చేసే పనులే చేస్తూ వస్తున్నాయి.

కోస్తాంధ్ర ముస్లిం రచయిత నుంచి వెలువడిన ఒక దీర్ఘ కథను చూస్తే అది ఎంత జనరలైజేషన్‌కు గురయిందో అర్థం చేసుకోవచ్చు. ‘ఖాదర్‌ లేడు' అనే కథలో ఖాదర్‌ పేరు స్థానంలో అప్పారావు, సుబ్బారావులాంటి ఏ పేరు పెట్టినా కథకు వాటిల్లే భంగమేమీ లేదు. ఈ రకంగా కోస్తాంధ్ర ముస్లిం సాహిత్యకారులు మమ్ముల్ని మీలో కలుపుకోండి అని వేడుకోవడమో, మీతో మాకు వైరుధ్యం లేదని హిందూ మతవాదులకు అప్పీల్‌ చేయడమో చేశారుగానీ తమ ప్రత్యేక ఉనికి గురించి మాట్లాడలేదు. అందుకే, వీరి రచనతో ఏ పేచీ లేదు. తెంగాణ ముస్లిం కవులతోనూ, కథారచయితలతోనూ ఈ పేచీ వచ్చి పడింది. ఈ స్థితిలో కోస్తాంధ్ర ముస్లిం మాదిరిగా హిందువులతో బేషరతుగా మమేకమై వుంటే తెలంగాణ ముస్లిం నుంచి శక్తివంతమైన కవితలు గానీ కథలు గానీ వచ్చి వుండేవి కావు. పాత్రకు ముస్లిం పేర్లు తగిలించి కోస్తాంధ్ర రచయిత మాదిరిగా ‘విశ్వజనీనసత్యాన్ని', ‘దీర్ఘకాలిక' రాజకీయ లక్ష్యసాధన అవసరాన్ని' బోధించి వుంటే బ్రాహ్మణవాదుకు, నయాబ్రాహ్మణ వాదులకు, నిరింద్రియ మేధావుకు అభ్యంతరం వుండేది కాదు. తెంగాణను తమ అంతర్గత వలసగా మార్చుకునే వారి బోధనలను ఎప్పటిలాగానే చెలామణి అయివుండేవి. మొత్తంగా తెలంగాణ ఐడెంటిటీతో ఈ ప్రాంతంలోని ముస్లిం ఐడెంటిటీ ఆధారపడి వుంది. నిన్నటి మొన్నటి వరకు వామపక్ష, విప్లవ భావజాలాలను మనస్ఫూర్తిగా అంగీకరించిన తెలంగాణ మేధావులు, సాహిత్యకారులు చాలామంది ఈ రోజు వాటిలోని డొల్లతనాన్ని బయటపెట్టే పనికి పూనుకున్నారు. శాశ్వత సత్యం వుంటుందనే తప్పుడు ప్రచారాన్ని వారు తిప్పికొడుతున్నారు. ఈ కోవలోకే తెలంగాణ ముస్లిం కవులు, రచయితలు వస్తారు. మాట్లాడేది సూటిగా మాట్లాడడమే వీరికి వంటబట్టింది. ఈ అవసరం కూడా ఇక్కడి వారికే ఎందుకు వచ్చిందంటే, తెలంగాణాను నానా సిద్ధాంతాలకు ప్రయోగశాలగా మార్చినందుకు.

3.
తెలుగులో విప్లవ, స్త్రీవాద కవిత్వాల తర్వాత అంత ఉధృతంగా వచ్చింది దళిత కవిత్వం. చాలామంది విప్లవ కవులు దళిత కవులుగా రూపాంతరం చెందారు. శివసాగర్‌ ‘నల్లపద్యం' నుంచి సతీష్‌ చందర్‌ ‘పంచమవేదం' వరకు దళిత కవిత్వమే అన్నారు. కాదని అనలేం. యువకగా విప్లవ పాటను ఉర్రూతూగించిన కలేకూరి ప్రసాద్‌ దళిత కవిత్వం రాశారు. మధ్యేవాద కవిత్వం రాసిన ఎండ్లూరి సుధాకర్‌, శిఖామణి కూడా దళితకవులయ్యారు. సాహిత్యంలో దళిత కవిత్వం పునాదులు సరిగా పడకముందే వీరు కవుగా నిలదొక్కు కున్నవాళ్లు. మరో ఇద్దరు కూడా బంగానే దళిత కవుగా ముందుకు వచ్చారు. వారు - పైడి తైరేష్‌బాబు, మద్దూరు నగేష్‌బాబు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి లాంటి అగ్రవర్ణ తెలంగాణ కవు - ‘దళం, దళితం రెండూ కావాలన్నారు. దళితవాదం వల్ల చాలామంది కొత్తకవులు వచ్చారు. వీరు ప్రధానంగా తెలంగాణ నుంచి, ప్రత్యేకించి నల్లగొండ జిల్లా నుంచి రావడం గమనించాల్సి వుంది. వీరు చాలా వరకు కమ్యూనిస్టు ఉద్యమాన్ని, నక్సలైట్‌ ఉద్యమాన్ని మిగతా దళిత కవుల లాగా ‘మిత్రవైరుధ్యంగా' తీసుకున్నట్లు లేదు. ‘శత్రు వైరుధ్యంగా'నే స్వీకరించారనిపిస్తుంది. కమ్యూనిస్టులను మాటల్లో కాకుండా (అనధికారికంగా) కవిత్వంలో (అధికారికంగా లేదా బహిరంగంగా) తూర్పారబట్టారు. (ఇందుకు వారు చెల్లించిన మ్యూం ఇక్కడ చర్చనీయాంశం కాదు).

క్ష్మీనరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్‌లు దళిత కవిత్వానికి అండదండందించిన మాట వాస్తవమే. అయితే, త్రిపురనేని శ్రీనివాస్‌ను పక్కన పెడితే క్ష్మీనరసయ్య స్త్రీ, విప్లవవాద కవులకు, దళిత కవులకు మధ్య ఎక్కడో ఒక దగ్గర సంధి కుదిర్చే ప్రయత్నం చేశారు. సంధి కుదిర్చే ప్రయత్నానికి నల్లగొండ గోసంగి కవులు పెద్ద అడ్డంకిగా నిలిచారు. ఇక్కడే కవిత్వానికి ప్రాంతం వుంటుందని భావించడానికి వీలుంది. ఈ లెక్కన తెలంగాణ నుంచి వెలువడిన దళితకవిత్వం, కోస్తా నుంచి వెలువడిన దళిత కవిత్వం ఒక్కటి కాదు, బహుశా, ఆకాంక్షలు కూడా ఒక్కటి కావు. ఈ తేడా ఎందులో వుంది? సంస్కృతిలో వుంది. అంటే, అన్ని సామాజిక అడ్డంకులను దాటి వచ్చినవారు కోస్తా దళిత కవులు. ఇంకా దాటడానికి ప్రయత్నిస్తున్నవారు తెలంగాణ దళితకవులు. దళిత కవిత్వం రాస్తున్న కోస్తా దళిత కవు తాత తరం నుంచీ, కనీసం తండ్రుల తరం నుంచీ విద్యనార్జించిన కుటుంబాల్లోంచి వచ్చినవారు.

తెలంగాణలో ప్రస్తుతం కవిత్వం రాస్తున్న దళిత కవులు చాలామంది తొలితరం విద్యావంతులు మాత్రమే. అందువల్ల సంస్కృతిలో తేడా ఈ రెండు ప్రాంతాల కవుల మధ్య కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అదే తేడా కవిత్వంలోనూ కనిపిస్తుంది. ఈ తేడా వచన ప్రక్రియల్లోనూ కనిపిస్తుంది. వేముల ఎల్లయ్య కక్క నవల అర్థం కావడం లేదని అన్నవారు చాలా మందే వున్నారు. అర్థం కాలేదని అంటే ఫర్వాలేదు. ఎల్లయ్య తన భాషను మార్చుకోవాలని సూచించారు. ఆయన రాతను తప్పు పట్టేప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే, అంబటి వెంకన్న రాసిన కథను ఎవరూ పట్టించుకోలేదు. కేవలం తెంగాణ యాసలో వెలువడడం వల్లనే ఇలా జరుగుతోందని చెప్పలేం. వారు తమ దళిత ఉనికితో పాటు తెలియకుండానే తెలంగాణ ఐడెంటిటీని సాహిత్యంలోకి తెస్తున్నారు. ఇది మింగుడు పడని వ్యవహారం. వారు రాయాల్సిన పద్ధతి గురించి పాఠాలు చెప్పుతున్నారంటే మీరింకా ఎదగలేదని వారికి చెప్పడమే అవుతుంది. తెలంగాణ పెద్దలు తమకున్న సిద్ధాంత రాద్ధాంతా వల్ల ఎల్లయ్య కవిత్వాన్ని కాదంటుంటే, కోస్తాంధ్ర సాహిత్యకారులు భాష పేరు చెప్పి, యాస పేరు చెప్పి తృణీకరించే పనికి పూనుకున్నారు. అల్లం రాజయ్యకు మొదట్లో ఇదే పరిస్థితి ఎదురయిందనేది మనం ఇక్కడ గుర్తిస్తే మొదటి నుంచి జరుగుతున్న ప్రయత్నమేమిటో మనకు ఇట్లే అర్థమైపోతుంది.

4.
మొత్తంగా, సాహిత్యం స్థనిర్దేశితం. ప్రాంతాలన్నీ ఒక్కటి కానట్లే సాహిత్యమంతా ఒక్కటి కాదు. అంటే, ఒకే భాషలో వెలువడిన సాహిత్యమంతా ఒకటి కాదు. ఇంకా చెప్పాలంటే, ఒకే కాలంలో వెలువడిన తెలుగు సాహిత్యమంతా ఒక్కటి కాదు. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే, విశ్వాసాల దృష్ట్యా, సైద్ధాంతిక నిబద్ధత దృష్ట్యా వెలువడిన ఒకేరకమైన సాహిత్యమంతా ఒక్కటికాదు.

కేవలం భాష పేరు మీద ఐక్యమైన ఇరు ప్రాంతాలకు ఒకే కొలబద్దలు పనికి రావు. కోస్తా, తెంగాణ మధ్య సాంస్కృతిక, సామాజిక, చారిత్రక వైరుధ్యాలున్నాయి. ఆధునికతను అన్ని రకాలుగా సంతరించుకున్న కోస్తా సాహిత్యకారులకు కెరీరిజంలో పైమెట్టు అధిరోహించడానికి సాహిత్యం పనికి వస్తుంటే తెంగాణ సాహిత్యకారులకు తమను తాము వ్యక్తీకరించుకునే సాధనం మాత్రమే. విప్లవ సాహిత్యం ఎక్కడ కెరీరిజానికి అడ్డంకిగా మారిందో అక్కడ కోస్తా సాహిత్యకాయి ప్రశ్నలు సంధించారు. (వాటిని సహేతుకమైన ప్రశ్నలు కావని అనలేం. ఇది వేరే విషయం). కోస్తాంధ్రులకు జీవితంలో పైమెట్టు అధిరోహించడానికి దళిత, స్త్రీవాదాలు సాధనాలుగా మారాయి. ఇవ్శాళ్ల్లు సాహిత్యాన్ని వారు వాడుకుంటున్న తీరును, అంటే వారి ఆచరణను చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది.

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
The Telangana state public Service Commisssion (TSPSC) aspirants should read Telugu literature in Telangana angle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X