కౌన్సెలింగ్: భయపడిపోయారా, తాగిపట్టుబడిన యాంకర్ ప్రదీప్ ఎక్కడ?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి తర్వాత మోతాదుకు మించి తాగి పోలీసులకు దొరికిన యాంకర్ ప్రదీప్ మంగళవారం బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదు. ఉదయం పదకొండు గంటల వరకు రావాలని పోలీసులు ఆదేశించారు.

  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు : యాంకర్ ప్రదీప్‌కు శిక్ష తప్పదా ?

  తాగొద్దని చెప్పిన ప్రదీప్ వీడియో, పక్కన అమ్మాయి ఉందా, ఎవరు? (వీడియో)

  కౌన్సెలింగ్‌కు రావాలని ఆదేశాలు జారీ చేసినా, ప్రదీప్ రాలేదని బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ బలవంతయ్య వెల్లడించారు. సాంకేతికంగా ఆయనకు శనివారం వరకు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు సమయం ఉందని, కానీ దొరికిన రెండు రోజుల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నామన్నారు.

  ప్రదీప్ ఇంటికి ట్రాఫిక్ పోలీసులు

  ప్రదీప్ ఇంటికి ట్రాఫిక్ పోలీసులు

  ప్రదీప్ కోసం ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను పంపించినట్లు తెలిపారు. బుధవారం హాజరు కాకుంటే ఈ విషయాన్ని ఛార్జీషీటులో రిపోర్ట్ చేస్తామని తెలిపారు. కౌన్సెలింగ్‌కు ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాల్సిందే అన్నారు. బ్రీత్ అనలైజర్ టెస్టులో ప్రదీప్‌కు 178 పాయింట్ల రీడింగ్ వచ్చిన విషయం తెలిసిందే.

  ప్రదీప్ అజ్ఞాతంలో ఉన్నారా?

  ప్రదీప్ అజ్ఞాతంలో ఉన్నారా?

  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ప్రదీప్ అజ్ఞాతంలో ఉన్నాడని తెలుస్తోందని ప్రచారం సాగుతోంది. మీడియా దృష్టి ప్రధానంగా తనపై ఉండటంతో ఆయన మంగళవారం కౌన్సెలింగ్‌కు గైర్హాజరు అయి ఉండవచ్చునని చెబుతున్నారు. మంగళవారం హాజరు అవుతారా చూడాలని అంటున్నారు.

  కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సిందే

  కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సిందే

  మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు హితవు పలుకుతున్నారు. ప్రదీప్ కౌన్సెలింగ్‌కు హాజరు కాకుంటే ఛార్జీషీట్ దాఖలు చేసి వారెంట్ జారీ చేసి, కౌన్సెలింగ్ ఇచ్చాకే కోర్టులో ప్రవేశ పెడతామని పోలీసులు చెబుతున్నారు. ప్రదీప్ చర్యను బట్టి తమ తదుపరి చర్యలు ఉంటాయని చెబుతున్నారు.

   ప్రదీప్ పట్టుబడటంపై ఆశ్చర్యం

  ప్రదీప్ పట్టుబడటంపై ఆశ్చర్యం

  కొత్త ఏడాది 2018 సందర్భంగా యాంకర్ ప్రదీప్ తాగి, పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ప్రదీప్ తాగి పట్టుబడటం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన సిన్సియర్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్నారు. గతంలో తాగి వాహనాలు నడవద్దని కూడా సూచించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Popular Telugu TV anchor Machiraju Pradeep, who was booked for drunk driving in early hours of Monday, did not appear for the counselling session at Begumpet Traffic Police Station on Tuesday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి