సంచలనం: హైదరాబాదు మెట్రో రైలుతో ఉబర్ జట్టు

Posted By:
Subscribe to Oneindia Telugu
  Hyderabad Metro : హైదరాబాదు మెట్రో రైలుతో ఉబర్

  హైదరాబాద్‌: ఉబర్‌ క్యాబ్‌ సంస్థ హైదరాబాద్‌ మెట్రో రైలుతో జట్టు కట్టి హైదరాబాద్ నగరవాసులకు సేవలు అందిస్తుందని ని తెలంగాణ, ఏపీ ఉబర్‌ జనరల్‌ మేనేజర్‌ దీపక్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

  మెట్రో ప్రయాణికులను ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు, మెట్రో స్టేషన్‌ నుంచి గమ్య స్థానాలకు చేర్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే మియాపూర్‌ మెట్రో స్టేషన్‌లో ఓ కియోస్కను ఏర్పాటు చేశామని, త్వరలో మిగతా మెట్రో స్టేషన్‌లలోనూ ఏర్పాటు చేస్తామని అన్నారు.

  సొంత వాహనాల సమస్య తీరుతుంది...

  సొంత వాహనాల సమస్య తీరుతుంది...

  మెట్రోలో ప్రయాణం చేసేందుకు వచ్చే ప్రయాణికులు సొంత కార్లు, ద్విచక్ర వాహనాలను వినియోగించుకోకుండా షేరింగ్‌ ద్వారా వారిని స్టేషన్‌ల నుంచి గమ్య స్థానాలకు చేర్చేలా క్యాబ్‌లను అందుబాటులో ఉంచుతామని దీపక్ రెడ్డి చెప్పారు.

  పార్కింగ్ సమస్య కూడా తీరుతుంది

  పార్కింగ్ సమస్య కూడా తీరుతుంది

  తాము చేసే ఏర్పాటు వల్ల మెట్రో స్టేషన్‌ల వద్ద పార్కింగ్‌ సమస్య తగ్గుతుందని ఆయన చెప్పారు. హైదరాబాదు నగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఉబర్‌ క్యాబ్‌లు, ఉబర్‌ మోటో సేవలు అందుబాటులో ఉంటాయని దీపక్‌ రెడ్డి తెలిపారు.

  చాలా స్టేషన్లలో పార్కింగ్ సమస్య...

  చాలా స్టేషన్లలో పార్కింగ్ సమస్య...

  మెట్రో రైలు ప్రారంభమైనప్పటికీ కొన్ని స్టేషన్లలో ఇప్పటి వరకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయలేదు. దీంతో మెట్రో ప్రయాణికులు రోడ్లపై వాహనాలను పార్కు చేస్తున్నారు. ఇది మరో విధమైన ట్రాఫిక్ సమస్యను సృష్టిస్తోంది.

  మెట్రోకు ఎనలేని ఆదరణ....

  మెట్రోకు ఎనలేని ఆదరణ....

  హైదరాబాదు మెట్రో రైలుకు అనూహ్యమైన ప్రతిస్పందన లభిస్తోంది. నగరవాసులు మెట్రోలో ప్రయాణించడానికి ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. చార్జీలు కాస్తా ఎక్కువ ఉన్నాయని నసుగుున్నప్పటికీ మెట్రో ప్రయాణాన్ని ఆనందిస్తున్నారు. ఉబర్ క్యాబ్‌లు అందుబాటులోకి వస్తే మరింతగా మెట్రో ప్రయాణం సౌకర్యంగా మారుతుంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Uber has decided work with Hyderabad metro to give service to Hyderabadis to make Hyderabad metro rail journey easy.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి