పునర్జన్మ ఇచ్చింది తెలుగునేలే, కోమా నుండి ఉగాదినాడే బయటపడ్డా: నరసింహాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:హేవళంబి సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలను ఇవ్వాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షను వ్యక్తం చేశారు. రెండురాష్ట్రాలు సమృద్ధిని సాధించాలని ఆయన కోరుకొన్నారు.ఇరు రాష్ట్రాల ప్రజలకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఉగాది వేడుకలను మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ వేడుకల్లో రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఎపి విపక్ష నాయకుడు వైఎస్ జగన్, రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ ఏడాది రెండు రాష్ట్రాల్లో ప్రజలకు మేలు కల్గించాలని పలువురు ఆకాంక్షను వ్యక్తం చేశారు.ఉగాది పర్వదిన వేడుకలను గవర్నర్ నిర్వహించడం పట్ల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ధన్యవాదాలు తెలిపారు

తెలుగు నేలతో విడదీయరాని అనుబంధం

తెలుగు నేలతో విడదీయరాని అనుబంధం

తెలుగు నేలతో తనకు విడదీయరాని సంబంధం ఉందని గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు.

ఉగాది అంటే తనకు ఎంతో ప్రత్యేకమని ఆయన గుర్తు చేసుకొన్నారు. తాను చదువుకొంది తెలుగు నేలపైనేనని ఆయన గుర్తు చేసుకొన్నారు. తాను తొలిసారి ఉద్యోగ బాధ్యతలను స్వీకరించింది కూడ తెలుగునేలపైనేనని ఆయన ఉగాది వేడుకల సందర్భంగా ప్రస్తావించారు.

ఉగాది రోజే బతికి బయటపడ్డాను

ఉగాది రోజే బతికి బయటపడ్డాను

తెలుగు నేలంటే తనకు అమితమైన ప్రేమంటూ గవర్నర్ నరసింహన్ చెప్పారు.నలభై ఆరేళ్ల క్రితం తాను చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడని ఆయన గుర్తు చేసుకొన్నారు.

రెండు రోజుల పాటు తాను కోమాలో ఉన్నానని చనిపోయానని బావించారని, కాని, ఉగాది రోజునే తాను కోమా నుండి బయపడ్డానని ఆయన చెప్పారు. ఆ సమయంలో కర్నూల్ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అందుకే తనకు ఉగాది రోజు అంటే ఇష్టమని ఆయన చెప్పారు.

ఉద్యోగుల ప్లాట్స్ కు సమృద్ది పేరు పెట్టాం

ఉద్యోగుల ప్లాట్స్ కు సమృద్ది పేరు పెట్టాం

రాజ్ భవన్ ఉద్యోగుల కోసం కొత్తగా ప్లాట్స్ నిర్మాణం పెట్టామని ఈ సముదాయానికి సమృద్ది అని పేరు పెట్టామని గవర్నర్ గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలు సమృద్దిగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

విస్తారంగా వర్షాలు

విస్తారంగా వర్షాలు

ఉగాది వేడుకల్లో భాగంగా బ్రహ్మశ్రీ కొండగప శ్రీవిద్యాశ్రీధర్ శర్మ పంచాంగ పఠనం చేశారు. దుర్ముఖినామ సంవత్సరం కంటే సమృద్దిగా వర్షాలు కురుస్తాయని పంచాంగ పఠనంలో ఆయన చెప్పారు.

గత ఏడాది కంటే తేడాలు ఉండవన్నారు. కీళ్ళు, మెదడు, నరాల సంబంధ వ్యాధులు పెరిగే అవకాశం ఉందన్నారు.బంగారు, వెండి, పెట్రోలు ధరలు నిలకడగా ఉంటాయన్నారు. నకిలీ మందుల బెడద తప్పకపోవచ్చన్నారు. సంప్రదింపుల ద్వారా సరిహద్దు రాష్ట్రాలతో సమస్యలు పరిష్కారమౌతాయని చెప్పారు.

ఉగాది వేడుకలు నిర్వహించడం అభినందనీయం

ఉగాది వేడుకలు నిర్వహించడం అభినందనీయం


ప్రతి ఏటా ఉగాది వేడుకలను గవర్నర్ నరసింహన్ నిర్వహించడాన్ని తెలంగాణ సిఎం కెసిఆర్ అభినందించారు. తెలుగువారు కాకపోయినప్పటికీ గవర్నర్ తెలుగు సంవత్సరాది వేడుకలను నిర్వహించడం అభినందనలతో ముంచెత్తారు.తెలంగాణ ప్రజల తరపున గవర్నర్ కు ఆయన అభినందనలు తెలిపారు.రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభకాంక్షలు తెలిపారు.

మనుషులను కలిపే వేదికగా రాజ్ భవన్

మనుషులను కలిపే వేదికగా రాజ్ భవన్

ఉగాది అనగానే పచ్చడి గుర్తుకు వస్తోందని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తుచేశారు.పచ్చడి తిన్న తర్వాతే ఉగాదిరోజున తాను ఇతర కార్యక్రమాలను చేస్తానని ఆయన చెప్పారు.

మనుషులను కలిపే వేదికగా రాజ్ భవన్ పనిచేస్తోందన్నారు. ఉగాది విషయంలో కొంత గందరగోళం ఉందనన్నారు. గవర్నర్ ఒకరోజు ముందే వేడుకలు జరిపినా తనకు గానీ, తెలంగాణ సిఎం కెసిఆర్ కు ఎలాంటి గందరగోళం లేదన్నారు.ప్రజలకు సుపరిపాలన ఇస్తామన్నని చంద్రబాబు హమీ ఇచ్చారు.ప్రజలకు మంచి జరగాలని కోరుకొంటున్నట్టు చెప్పారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాలు

ఉగాది వేడుకలను పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకొన్నాయి.లిటిల్ మ్యూజీషియన్ అకాడమీకి చెందిన రామాచారి బృందం గీతాలు ఆలపించారు. అరబి వయోలిన్ స్కూల్ కు చెందిన విద్యార్థులు గురువు అశోక్ గురజాల నేతృత్వంలో వయోలిన్ సింఫనీ నిర్వహించారు. మంజుల రామస్వామి శిష్యబృందం దీపనాట్యం ఆహుతులను ఆకట్టుకొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
ugadi celebrations held at rajbhavan on tuesday night.telangana and andhra pradesh chief ministers kcr and chandrababu naidu attended.
Please Wait while comments are loading...