స్టెప్పులేశారు: బతుకమ్మ ఆడిన ఉపాసన, రాంచరణ్, నిహారిక(వీడియో)
హైదరాబాద్: తెలంగాణ మహిళలు గురువారం సద్దుల బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని గిల్డ్ ఆఫ్ సర్వీస్ సేవా సమాజ్ బాలిక నిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో సినీ నటుడు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన పాల్గొన్నారు.
బాలికలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి డ్యాన్స్ వేసి అందరినీ ఉత్సాహపరిచారు.
#happydussehra #Heartwarming #bathukamma with girls from Guild of Service Seva Samaj Balika Nilayam orphanage. #Celebratingwomen 😊 pic.twitter.com/ydNbQvOVwt
— Upasana Kamineni (@upasanakonidela) September 29, 2017
కాగా, ఈ విషయాన్ని ఉపాసన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోను పోస్ట్ చేశారు. రామ్ చరణ్ ఉపాసనతో కలిసి ఫొటోలు దిగడానికి గిల్డ్ ఆఫ్ సర్వీస్ సేవా సమాజ్ బాలికలు ఉత్సాహం చూపించారు. ఈ వేడుకలో నాగబాబు కూతురు నిహారిక, ఉపాసన తల్లి కూడా పాల్గొన్నారు.
ఇది ఇలావుండగా, ఈ సందర్భంగా తీసిన వీడియోను రాంచరణ్ కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. 'బాలికా నిలయంలోని బాలికలతో దసరా, బతుకమ్మ సంబరాలు. పదేళ్లుగా(చిత్ర పరిశ్రమలో) మీరు చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు. ఇలాగే అనేక ఏళ్లు సాగాలని కోరుకుంటున్నా' అని రాశారు.












Click it and Unblock the Notifications