వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగ్గారెడ్డికి గుండు కొట్టించండి ఉత్తమ్ సంచలనం, కారణమేమిటీ?

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డికి గుండు గీయిస్తానని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. అయితే ఈ సవాల్ ను కాంగ్రెస్ పార్టీ స్వీకరించింది. అంత దమ్ముంటే ఓయూ

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డికి గుండు గీయిస్తానని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. అయితే ఈ సవాల్ ను కాంగ్రెస్ పార్టీ స్వీకరించింది. అంత దమ్ముంటే ఓయూకు రావాలని సుమన్ కు కాంగ్రెస్ పార్టీ సవాల్ విసిరింది.ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దపల్లి ఎంపీ సుమన్ సవాల్ ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు.

ఈ నెల 1వ, తేదిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభ తర్వాత కాంగ్రెస్ , టిఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్దం చోటుచేసుకొంది. రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరోకరు విమర్శలు తీవ్రస్థాయిలో సాగుతున్నాయి.

తాజాగా రాష్ట్రంలో చోటుచేసుకొన్న భూ కుంభకోణాలపై కూడ ఈ రెండు పార్టీల మధ్య మాటల తూటాలు సాగుతున్నాయి.ఈ రెండు పార్టీల నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎవరి పాత్ర ఏమిటనే విషయాలను కూడ ప్రస్తావిస్తున్నారు.

రాహుల్ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. టిఆర్ఎస్ పై విమర్శల అస్త్రాలను మరింత ఎక్కువ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ విమర్శలపై కూడ టిఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది.

జగ్గారెడ్డికి గుండు కొట్టించండి

జగ్గారెడ్డికి గుండు కొట్టించండి

తమపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి గుండుకొట్టిస్తానని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్ ను కాంగ్రెస్ పార్టీ ఈ సవాల్ ను స్వీకరించింది. ఓయూలోకి వచ్చి జగ్గారెడ్డికి గుండు కొట్టించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరాడు.తాము కూడ ఓయూలోనే ఉంటామన్నారు. ఎవరి సత్తా ఏమిటో తేల్చుకొందామని ఆయన సవాల్ విసిరారు.

అధికారులు కండువాను కప్పుకొని పనిచేస్తున్నారు

అధికారులు కండువాను కప్పుకొని పనిచేస్తున్నారు

అధికారులు టీఆర్ఎస్ కండువాలు కప్పుకొని పనిచేస్తున్నారని మాజీ ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి ఆరోపించారు.పటాన్ చెరువు నియోజకవర్గంలోని అమీన్ పూర్ సర్పంచ్ సస్పెన్షన్ ను నిరసిస్తూ కలెక్టరేట్ ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. రాహుల్ కు ఘనంగా స్వాగతం పలికినందుకుగాను అమీన్ పూర్ సర్పంచ్ ను మంత్రి హరీష్ రావు సస్పెండ్ చేయించారని ఆయన విమర్శించారు.అధికారులు టిఆర్ఎస్ కండువాలు కప్పుకొని పనిచేస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వచ్చాక అలాంటి వారి అంతుతేలుస్తామన్నారు జగ్గారెడ్డి.

కాంగ్రెస్ ను ప్రతి ఇంటికి తీసుకెళ్తాం

కాంగ్రెస్ ను ప్రతి ఇంటికి తీసుకెళ్తాం

రాహుల్ గాంధీ పిలుపుమేరకు ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ విధానాలను తీసుకెళ్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ సభ సక్సెస్ కావడంతో టిఆర్ఎస్ లో బెంగ పట్టుకొందన్నారు.ఏది నిజమో , ఏది అబద్దమో ప్రజలకు తెలుసుకొంటున్నారని చెప్పారు. అయితే ప్రజలు టిఆర్ఎస్ కు బుద్దిచెప్పేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ పాత్ర ఏమిటీ?

తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ పాత్ర ఏమిటీ?

రాహుల్ సభతో టిఆర్ఎస్ నేతలు నిరాశకు గురయ్యారని, అందుకే నోటిని అదుపులో పెట్టుకోకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. మంత్రులు కేటీఆర్, తలసానిలు తమ స్థాయికి మించి మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. లేకపోతే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ పాత్ర ఏమిటని ఆయన ప్రశ్నించారు.కెటిఆర్ ఎక్కడ పోరాటం చేశారని ఆయన ప్రశ్నించారు.

English summary
Congress party leaders challenged to Trs. we are ready to take challenge Peddapally MP suman said TPCC president Uttam Kumar Reddy.he slams on Trs leaders and ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X