దేవేందర్ గౌడ్ పార్టీ మార్పుపై పుకార్లు: క్లారిటీ ఇచ్చిన కుమారుడు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ కాంగ్రెసులో చేరే అవకాశాలున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన కుమారుడు వీరేందర్ గౌడ్ స్పందించారు. తన తండ్రి పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.

తానూ తన తండ్రి దేవేందర్ గౌడ్ పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారుర. అవన్నీ ఊహాజనితమేనని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పాటు పడుతామని చెప్పారు.

Veerender Goud clarifies rumors on Party change

దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసులో చేరిన రేవంత్ రెడ్డి బాటలోనే ఆయన నడుస్తారని ప్రచారం జరిగింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam party leader Devender Goud's son Veerender Goud clarified that they are not switching over to Congress.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి