హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, మాట్లాడక 8 నెలలు: రోహిత్ తండ్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన కొడుకు వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తండ్రి శుక్రవారం నాడు అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన తండ్రి స్పందించారు.

రోహిత్ తండ్రి వడ్డెర కులానికి చెందిన వారు. తల్లి మాల కులానికి చెందిన వారు. రోహిత్ ఆత్మహత్య పైన ఇప్పటి వరకు తల్లి మాత్రమే పెదవి విప్పారు. ఇప్పుడు తండ్రి పెదవి మాట్లాడారు. రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు.

 Vemula Rohith father responds on son's suicide

తమ కుటుంబం అంతా కలిసే ఉంటుందని చెప్పారు. రోహిత్‌తో తాను మాట్లాడక ఎనిమిది నెలలు అవుతోందని చెప్పారు. విశ్వవిద్యాలయానికి సంబంధించిన విషయాలు తనకు ఎప్పుడూ చెప్పేవాడు కాదన్నారు. అమ్మ, అమ్మమ్మలతోనే చర్చించేవాడని చెప్పారు. తమకు కావాల్సింది నష్టపరిహారం కాదని, న్యాయం అన్నారు.

హెచ్‌సియులో ఆరో రోజు ఆందోళనలు

హైదరాబాద్ సెంట్రల్ యూనవర్సిటీలో ఆరో రోజైన శుక్రవారం నాడు ఆందోళనలు కొనసాగుతున్నాయి. సస్పెన్షన్ ఉత్తర్వులను స్వీకరించమని నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులు స్పష్టం చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కాలకులైన వారిని శిక్షించాలన్నారు.

English summary
HCU student Vemula Rohith father responds on son's suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X