సన్నిహితులు కూడ రేవంత్‌కు షాక్: టిక్కెట్ల చిక్కులు, కారణమదేనా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ టిక్కెట్టు విషయమై స్ఫష్టమైన హమీ లభించని కారణంగానే రేవంత్‌రెడ్డి వెంట కొందరు కీలకమైన నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు. ముఖ్యంగా నల్గొండ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలకు ఈ విషయమై హమీ లభించకపోవడంతో ప్రత్యామ్నాయంపై ఆ నేతలు దృష్టి సారించినట్టు ప్రచారం సాగుతోంది.

టిటిడిపి దారెటు: వెల్‌కం ఖాయమేనా, పొత్తులపై బాబు వ్యూహత్మక మౌనం?

తెలుగుదేశం పార్టీలో రేవంత్‌రెడ్డి అనతికాలంలోనే అత్యున్నతస్థాయికి చేరుకొన్నారు. టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్‌ను ధీటుగా ఎదుర్కొంటాడని ఆ పార్టీ నాయకత్వం భావించింది అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్‌ వెంట కొందరు కీలకమైన నేతలు కూడ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

బాబు మాటల వెనుక: పార్టీకి పూర్వవైభవం వచ్చేనా, వ్యూహమిదే!

స్థానికంగా నెలకొన్ రాజకీయ పరిస్థితుల నేపథ్యంతో పాటు, టిక్కెట్ల విషయమై స్పష్టమైన హమీ లేకపోవడంతో కొందరు నేతలు రేవంత్‌ వెంట కాంగ్రెస్ పార్టీలో చేరలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

రాజీనామాతో బాబుకు రేవంత్ షాక్: జగన్‌కు లాభమే, కెసిఆర్‌కు చిక్కులే

వారెందుకు రేవంత్‌ వెంట వెళ్ళలేదంటే?

వారెందుకు రేవంత్‌ వెంట వెళ్ళలేదంటే?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని టిడిపి ముఖ్యమైన నేతలంతా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వెంట నడుస్తారనే ప్రచారం సాగింది. అయితే రేవంత్‌రెడ్డి వెంట పటేల్‌రమేష్‌రెడ్డి, బిల్యానాయక్ మినహ మిగిలిన నేతలు ఎవరూ కూడ కాంగ్రెస్ పార్టిలో చేరలేదు. పాల్వాయి రజనీకుమారి,. బొల్లం మల్లయ్యయాదవ్‌.. చిలువేరు కాశీనాథ్‌.. బండ్రు శోభారాణి, ఎలిమినేటి సందీప్‌రెడ్డిలు టిడిపిలోనే ఉన్నారు. అయితే కంచర్ల భూపాల్‌రెడ్డి తొలుత రేవంత్ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హజరయ్యారు. కానీ, రేవంత్‌ వెంట ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కాంగ్రెస్ పార్టీ నుండి టిక్కెట్టుపై స్పష్టత రానందున భూపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. టిఆర్ఎస్‌లో చేరేందుకు కంచర్ల భూపాల్‌రెడ్డి రంగం సిద్దం చేసుకొన్నారు. ఈ మేరకు మూడు రోజుల క్రితం సీఎం కెసిఆర్‌ను కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ నెల 6వ,తేదిన కంచర్ల భూపాల్‌రెడ్డి తన అనుచరులతో కలిసి టిఆర్ఎస్‌లో చేరనున్నారు.

రేవంత్‌కు వారెందుకు షాకిచ్చారంటే?

రేవంత్‌కు వారెందుకు షాకిచ్చారంటే?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో పాల్వాయి రజనీకుమారి టిడిపి అభ్యర్థిగా పోటీచేశారు. అయితే ఆమె రేవంత్‌రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆమెకు కాంగ్రెస్ పార్టీ నుండి టిక్కెట్టు విషయమై స్పష్టత లభించే అవకాశం లేదు. 2009 ఎన్నికల సమయంలో ఈ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చిరుమర్తి లింగయ్య విజయం సాధించారు. రజనీకుమారి కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆమెకు టిక్కెట్టు దక్కకపోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో ఆమె టిడిపిలోనే ఉన్నారు. కోదాడలో బొల్లం మల్లయ్యయాదవ్ కాంగ్రెస్ పార్టీ నుండి టిడిపిలో చేరారు. అయితే టిడిపి నుండి మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు టిఆర్ఎస్‌లో చేరారు. దీంతో మల్లయ్య యాదవ్‌కు టిడిపి నుండి టిక్కెట్టు విషయమై ఇబ్బందులు లేనట్టే. కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయంగా ప్రయోజనం కంటే నష్టమేనని ఆయన భావించి ఉంటారనే అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో ఆయన టిడిపిలోనే ఉన్నారని అంటున్నారు.

కాంగ్రెస్‌లో కూడ కీలకమైన నేతలు

కాంగ్రెస్‌లో కూడ కీలకమైన నేతలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కూడ కీలకమైన నేతలున్నారు. ఈ పరిస్థితుల్లో టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయంగా లాభమా, నష్టమా అనే అభిప్రాయాలు బేరీజు వేసుకొన్న మీదట కొందరు నేతలు రేవంత్‌ వెంట వెళ్ళలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. గతంలో కూడ ఆమె టిఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం కూడ సాగింది. కానీ, ఆమె టిడిపిలోనే ఉన్నారు. రేవంత్‌ వెంట ఉమామాధవరెడ్డి చేరుతారనే ప్రచారం సాగినా, ఆమె టిడిపిలోనే ఉన్నారు.భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి లేడు. ఇది కూడ ఉమామాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగడానికి కారణమనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.కానీ, ఆమె మాత్రం టిడిపిలోనే కొనసాగుతున్నారు. అసలే నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ ఉద్దండులకు నిలయం.పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి...సీఎల్పీ నేత జానారెడ్డి.. ఉప నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి.. రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ...బూడిద బిక్షమయ్యగౌడ్‌.. చిరుమర్తి లింగయ్య వంటి హేమాహేమీలు ఇక్కడ ఉన్నారు. వీరిని కాదని ఇతరులకు టికెట్‌ ఇవ్వడం కుదరని పని. ఈ కారణంగానే కొందరు టిడిపి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వెనుకంజ వేశారంటున్నారు.

గండ్ర సత్యనారాయణరావుకు అదే పరిస్థితి

గండ్ర సత్యనారాయణరావుకు అదే పరిస్థితి

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి అసెంబ్లీ నియోజకర్గం నుండి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా స్పీకర్ మధుసూధనాచారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సత్యనారాయణరావు టిడిపిని వీడి రేవంత్‌ వెంట కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి గండ్ర వెంకటరమణారెడ్డి గతంలో ఈ స్థానం నుండి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కూడ గండ్ర వెంకటరమణారెడ్డికే టిక్కెట్టు దక్కే అవకాశం ఉంది. అయితే ఈ తరుణంలో గండ్ర సత్యనారాయణరావు టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సాహసించలేదంటున్నారు ఆయన సన్నిహితులు. మరో వైపు గండ్ర సత్యనారాయణరావును టిఆర్ఎస్‌లో చేర్చుకోవాలని ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే గండ్ర సత్యనారాయణరావుకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వకపోయినా ఇతరత్రా పదవులను కట్టబెట్టనున్నట్టు టిఆర్ఎస్ నాయకత్వం హమీలు ఇస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే గండ్ర సత్యనారాయణరావు మాత్రం ఈ విషయమై హమీని ఇవ్వలేకపోయారంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Majority TTDP key leaders from Nalgonda district didn't go to Revanth Reddy . From this distirct except Patel Ramesh Reddy and Bilya Naik key leaders continues in TDP. Kancharla Bhupal Reddy will join in TRS on Nov6.
Please Wait while comments are loading...