నీళ్లలో దూకి ఈత కొడుతూ వీడియో తీయమని.. శవమై తేలాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

నిజామాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో ఘోరం జరిగింది. వీడియో సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తాను ఈత కొడతానని, దానిని వీడియో తీయమని స్నేహితులకు చెప్పిన శ్రీనివాస్ అనే యువకుడు మృతి చెందాడు.

చెరువులో ఈత కొడుతూ వీడియో తీయించుకుంటూ అతను నీట మునిగి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. శ్రీనివాస్ తన మిత్రులతో కలిసి చెరువులోకి స్నానం చేసేందుకు వెళ్లాడు. తన ఈత విన్యాసాలను వీడియో తీయాలని మిత్రునికి సెల్‌ఫోన్ ఇచ్చి నీళ్లలోకి దూకాడు.

Youth dies in Nizamabad district while swimming

అలా మొదటి సారి నీళ్లలోకెళ్లి విన్యాసాలు చేశాడు. అనంతరం బయటికి వచ్చి మరోసారి నీళ్లలోకి దూకాడు. వీడియో తీయమని స్నేహితులకు చెప్పాడు. అయితే నీళ్లలో దూకిన శ్రీనివాస్ కాసేపటికి కనిపించలేదు. ఇది కూడా వీడియో కోసమేనని భావించిన స్నేహితులు కాసేపు నిమ్మకుండిపోయారు.

ఎంతకూ కనిపించకపోయేసరికి ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు అయినా శ్రీనివాస్ ఇంటికి రాలేదు. దీంతో అనుమానం వచ్చి స్నేహితులను అడిగారు. గట్టిగా నిలదీయడంతో అసలు విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Youth dies in Nizamabad district while swimming.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి