వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నిన్నటిదాకా టిఆర్ఎస్ పోటీ అనుకున్నా.. జగన్ రాకతో వైసిపి గెలుపు' (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించి రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనకు చరమగీతం పాడాలని వైసిపి అధ్యక్షులు జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం నిర్వహించారు.

తమ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. సోమవారం పాలకుర్తి, జఫర్ గఢ్, వర్ధన్నపేట, రాయపర్తి, తొర్రూరు తదితర మండలాల్లో రోడ్డు షో నిర్వహించారు. కడియం శ్రీహరిని తన మంత్రివర్గంలోకి తీసుకోవాలనే మోజుతో కెసిఆర్ ఆయనను ఎంపీ పదవికి రాజీనామా చేయించారన్నారు.

దీంతో, ఉప ఎన్నిక వచ్చిందని, ఇధి ప్రజలపై కోట్ల రూపాయల భారమే అన్నారు. నాడు వైయస్ చేపట్టిన ఫీజు రీయింబర్సుమెంట్స్, మహిళలకు పావలా వడ్డీ, ఉచిత విద్యుత్, పేదవారికి ఇళ్ల నిర్మాణం తదితర పథకాలకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు.

వైసిపి

వైసిపి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరంగల్ జిల్లా పాలకుర్తిలో సోమవారం ఉదయం ఘన స్వాగతం లభించింది. వరంగల్ ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తరఫున జగన్ ప్రచారం చేస్తున్నారు.

వైసిపి

వైసిపి

జగన్ ఉదయం హైదరాబాద్ నుంచి వరంగల్ బయల్దేరారు. లోకసభ నియోజకవర్గ పరిధిలో మొత్తం నాలుగు రోజుల పాటు ఆయన విస్తృతంగా పర్యటించి ప్రచారం చేస్తారు.

వైసిపి

వైసిపి

సోమవారం రాత్రి తొర్రూరులో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జగన్‌కు పాలకుర్తిలో మహిళలు బోనాలతో తరలి వచ్చి స్వాగతం పలికారు.

వైసిపి

వైసిపి

జగన్ పాలకుర్తిలో రోడ్డు షో నిర్వహించారు. ఈ రోడ్డు షోకు భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. జగన్ వెంట తెలంగాణ పార్టీ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైసిపి

వైసిపి

జగన్ రాకతో వరంగల్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ ఏ పార్టీ నుంచి పెద్దగా పోటీ లేకుండా గెలుస్తారని ఖమ్మం ఎంపీ, పార్టీ తెలంగాణ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

వైసిపి

వైసిపి

ఇప్పటి వరకు పార్లమెంటు ఉప ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీని తమకు పోటీగా భావించామని, ప్రస్తుతం జగన్ రావడంతో అడుగడుగునా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని, దీంతో తమకు పోటీ లేకుండా పోయిందన్నారు.

వైసిపి

వైసిపి

తప్పుడు హామీలు, మోసపూరిత విధానాలు అవలంభిస్తున్న టిడిపి, బిజెపి, టిఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని పొంగులేటి అన్నారు.

English summary
YSRCP chief YS Jagan lashes out at KCR in Warangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X