తిరుపతి డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు .. పలు కీలక పత్రాలు స్వాధీనం

ఏపీలో ఇప్పుడు ఏసీబీ అధికారుల దాడులు అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.మొన్నటికి మొన్న ఎమ్మార్వో ఆఫీసులను ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయాలను, టౌన్ ప్లానింగ్ ఆఫీసులను, ఆస్పత్రులను , టీచింగ్ ఆస్పత్రులను జల్లెడ పట్టిన ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు చేసిన విషయం తెలిసిందే . ఇక తాజాగా అవినీతి అధికారుల భరతం పట్టటానికి రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే అధికారుల ఇళ్ళలో సోదాలు నిర్వహిస్తున్నారు.

అవినీతి అధికారులకు ఏసీబీ చెమటలు పట్టిస్తుంది ఏపీలో ప్రతి శాఖలోనూ పారదర్శకంగా పనులు జరగాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆదేశించిన నేపధ్యంలోనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు . తాజాగా చిత్తూరు జిల్లా తిరుపతి అటవీశాఖ డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ డిఎఫ్‌ఓ వెంకటా చలపతి నాయుడు నివాసంలో ఈ రోజు ఉదయం నుంచి ఏసీబి దాడులు కొనసాగుతున్నాయి. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్న నేపధ్యంలోనే దాడులు నిర్వహిస్తున్నారు .

ACB raids in Tirupati Deputy Forest Range Officer home

ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలపై అధికారులు అన్నారావు కూడలి సమీపంలోని మోర్‌ సూపర్‌ మార్కెట్‌ వెనుకవైపు ఉన్న ఎం 2 గ్రాండ్‌ హోటల్‌ నాలుగో అంతస్థులో ఉన్న చలపతి నాయుడు నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. తిరుపతితోపాటు కడప జిల్లా రాయచోటి, చిత్తూరు, బెంగళూరు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లు , నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+