విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

NTR VARSITY:పేరు మార్పుపై భగ్గుమన్న నారాయణ, వెనక్కి తీసుకోవాలని అల్టిమేటం

|
Google Oneindia TeluguNews

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు అంశం ఆంధ్రప్రదేశ్‌లో వివాదాస్పదమైంది. వైఎస్ షర్మిల కూడా తప్పుపట్టడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ న్యూట్రల్‌గా మాట్లాడారు. ఇక ఇప్పుడు సీపీఐ నారాయణ వంతు వచ్చింది. జగన్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పేరు మార్పు వెనక...?

పేరు మార్పు వెనక...?

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని సీపీఐ నారాయణ అడిగారు. రాష్ట్రంలో ఇతర వర్సిటీలు ఉన్నాయి కదా అని గుర్తుచేశారు. వాటిలో ఒకదానికి తన తండ్రి వైఎస్ఆర్ పేరు పెట్టొచ్చు కదా అన్నారు. వర్సిటీ పేరు మార్చి మరో తప్పును జగన్ చేశారని మండిపడ్డారు. జగన్ తీసుకొచ్చిన నయా సంస్కృతి.. ప్రభుత్వాలు మారితే కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా ఒకరికొకరు పేరు మారిస్తే..ఆ వర్సిటీ పేరు ఏదీ ఉందో తెలుసుకోవడమే కష్టంగా మారే ఛాన్స్ ఉందన్నారు.

ఆశ్చర్యపోయా..

ఆశ్చర్యపోయా..

ఎన్టీఆర్ పేరు మార్పునకు సంబంధించిన విషయం తెలిసి ఆశ్చర్యపోయానని నారాయణ పేర్కొన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ తప్పేనని తెలిపారు. ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత దేశంలో తొలి హెల్త్ వర్సిటీని విజయవాడలో ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి పేరును తొలగించడం ఎంతమాత్రం సమంజనం కాదన్నారు. సీఎం జగన్ చేసిన పని ఫన్నీగా ఉందని.. తీరు మార్చుకోవాలని సజెస్ట్ చేశారు. పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

డాక్టర్ అని చేర్చగా.. ఇప్పుడు ఇలా

డాక్టర్ అని చేర్చగా.. ఇప్పుడు ఇలా

మెడికల్ కాలేజీలు ఒకే పాలసీతో నడవాలనేది ఎన్టీఆర్ ఉద్దేశ్యం. 1986లో వర్సిటీ ఎన్టీఆర్ స్థాపించారు. అందరూ పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపారు. 1996లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అని పేరు పెట్టారు. వైఎస్ఆర్ సీఎం అయ్యాక కూడా.. ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో డాక్టర్ అనే పదం చేర్చారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మార్చారు. కానీ సీఎం జగన్ మాత్రం ఏకంగా ఆ పేరునే మార్చివేశారు. దీనిపై దుమారం కొనసాగుతోంది.

English summary
NTR VARSITY:Cpi narayana asked andhra pradesh cm jagan mohan reddy withdrawl for name change decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X