• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దళిత యువకుడి మృతి, అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే.. లాకప్ డెత్ అంటోన్న ఫ్యామిలీ, ఖండించిన..

|
Google Oneindia TeluguNews

దళిత యువతులపై జరుగుతోన్న లైంగికదాడులు, హత్యలతో దేశం దద్దరిల్లుతోంది. నిరసనలు, ఆగ్రహా జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడలో ఓ దళిత యువకుడు చనిపోయాడు. అయితే అతను పోలీసుల అదుపులో ఉండగా చనిపోవడంతో.. లాకప్ డెత్ అనే అనుమానాలు వస్తున్నాయి. కానీ దీనిని పోలీసు ఉన్నతాధికారులు ఖండిస్తున్నారు. సదరు యువకుడు అనారోగ్యంతో చనిపోయాడరిన చెబుతున్నారు.

కారు డ్రైవర్‌గా పనిచేస్తూ..

కారు డ్రైవర్‌గా పనిచేస్తూ..

కృష్ణలంక పెద్దివారి వీధికి చెందిన డీ అజయ్‌ కారు డ్రైవర్‌ కాగా.. ఇతనికి తల్లి నాగమల్లేశ్వరమ్మ ఉంది. సమీపంలో గల చర్చిలో తల్లి వాచ్‌మన్‌గా పనిచేస్తోంది. అయితే నెలరోజుల క్రితం పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ కార్గోలో వచ్చిన మద్యం సీసాలను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌సీబీ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవీ తెలంగాణ రాష్ట్రం నుంచి రాగా.. చేపల చెరువులో ఆహారంగా ఉపయోగించే ఫీడ్‌లో సీసాలను పెట్టి హైదరాబాద్‌ నుంచి తరలించారు. గుప్తా అనే వ్యక్తి పార్శిల్‌ చేశారని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పటమట ఎక్సైజ్‌ పోలీ‌స్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.

గుప్తా పేరుతో పార్సిల్..

గుప్తా పేరుతో పార్సిల్..

పార్సిల్‌ గుప్తా పేరుతో వచ్చింది. కానీ ఫోన్‌ నంబరు అజయ్‌ పేరుతో ఉంది. అప్పటినుంచి అజయ్, అతని ఫ్రెండ్ సాయికిరణ్‌ పరారీలో ఉన్నారు. ఎస్‌ఈబీ పోలీసులకు వారు గురువారం చిక్కారు. సమీపంలో గల రమేశ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత అజయ్‌ ఆస్పత్రిలో చనిపోయాడు. గంటల వ్యవధిలో అతను చనిపోవడంతో కుటుంబసభ్యులు సందేహాం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో పోలీసులు దాడి చేశారని.. దెబ్బలు తాళలేక మృతిచెందాడని మండిపడ్డారు. ఆస్పత్రి వద్దకు దళిత సంఘాలు చేరుకొని.. ఆందోళనకు దిగాయి.

Recommended Video

Galwan Valley ఘటన ఆధారం గా Ajay Devgn సినిమా || Oneindia Telugu
 అనారోగ్యంతోనే మృతి.. దళిత సంఘాల ఆందోళన

అనారోగ్యంతోనే మృతి.. దళిత సంఘాల ఆందోళన

అజయ్ అనారోగ్య కారణాలతో చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. ప్రశ్నిస్తుండగా చెమటలు పట్టి ఫిట్స్‌ వచ్చాయని.. ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడని వెల్లడించారు. ఘటన గురించి తెలియగానే ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ మేకా సత్తిబాబు, రమేశ్‌ ఆస్పత్రికి చేరుకొని.. దళిత నేతలతో రాత్రి వరకు మాట్లాడారు. అజయ్‌ అనారోగ్యంతో చనిపోయాడని.. ఒకవేళ పోలీసులు కొట్టడం వల్లే చనిపోతే పోస్టుమార్టం రిపోర్టు రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీపీ బత్తిన శ్రీనివాసులు కూడా హామీనిచ్చారు. దీంతో దళిత సంఘాలు ఆందోళనను విరమించాయి. కానీ కుమారుడు చనిపోవడంతో అజయ్‌ తల్లి విలపిస్తోంది. తన జీవనాధారం పోయిందని విలపిస్తోంది.

English summary
dalit man ajay dies at police station. family members are alleged this is lock up death. but police officers denied allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X