• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారట ... బెజవాడలో రిటర్న్ గిఫ్ట్ ఫ్లెక్సీలు

|
  బెజవాడలో రిటర్న్ గిఫ్ట్ ఫ్లెక్సీలు!! | Y.s.Jagan | Cm Kcr | Chandrababu Naidu | Return Gift

  గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసి ఇబ్బంది పెట్టినందుకు సీఎం కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన విషయం అందరికీ తెలుసు. ఇక ఆ తర్వాత ఎవరు మాట్లాడినా రిటర్న్ గిఫ్ట్ గురించే మాట్లాడటం జరిగింది. కేసీఆర్ ఏపీ ఎన్నికల్లో ఏ మాత్రం జోక్యం చేసుకోకుండానే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ప్రస్తుతం వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

  జగన్ విజయ వీరుడు అంటూ శివసేన ప్రసంశల వర్షం .. మమతపై విమర్శల అస్త్రం

  తెలంగాణా ఎన్నికల్లో కేసీఆర్ తో తలపడిన బాబు .. సెంటిమెంట్ తో దెబ్బ కొట్టిన కేసీఆర్

  తెలంగాణా ఎన్నికల్లో కేసీఆర్ తో తలపడిన బాబు .. సెంటిమెంట్ తో దెబ్బ కొట్టిన కేసీఆర్

  తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించడానికి కాంగ్రెస్ సహా ఇతర పక్షాలతో కలిసి మహా కూటమిగా ఏర్పడి టీఆర్ఎస్ ను ఓడించాలని విఫల యత్నం చేశారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు . ఇక ఈ నేపధ్యంలో కేసీఆర్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఆంధ్రోడి చేతుల్లో తెలంగాణను మళ్లీ పెడదామా అంటూ సెంటిమెంట్‌ను రగిల్చి గులాబీ చీఫ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇక ఈ సెంటిమెంట్ టీఆర్ఎస్ కు మరోమారు లాభం చేకూర్చింది. అనూహ్య విజయాన్ని అందించింది. ఇక చంద్రబాబుకు పరాభవం తప్పలేదు.

  బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ ..

  బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ ..

  ఇక ఫలితాల రోజున సాయంత్రం ప్రెస్‌మీట్‌లో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు కేసీఆర్ . ఏపీ ఎన్నికల్లో బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు. దాంతో అది ఎలా ఉండబోతోంది.... ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు, ఏపీలో వైసీపీ తరపున కేసీఆర్ ప్రచారం చేస్తారా, లేక ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేస్తుందా వంటి ప్రశ్నలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇక కేసీఆర్ చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కానీ చంద్రబాబు కేసీఆర్ తరహాలో ఆంధ్రా ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కానీ అది ఫలించలేదు.

  కేసీఆర్ వ్యూహం ముందు దెబ్బ తిన్న బాబు .. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఏపీలో చర్చ

  కేసీఆర్ వ్యూహం ముందు దెబ్బ తిన్న బాబు .. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఏపీలో చర్చ

  అయితే కేసీఆర్ మార్క్ వ్యూహాం ముందు చంద్రబాబు దెబ్బ తిన్నారు. తాను ఎక్కడ నోరు జారీనా అది బాబుకు ప్లస్ అవుతుందనే ఉద్దేశ్యంతో కేసీఆర్ సైలంటయ్యారు. జగన్ విజయంలో కేసీఆర్ సైతం బాహాటంగా కాకుండా జగన్ కు కావాల్సిన సాయం చేశారన్నది విశ్లేషకుల మాట. కేసీఆర్ ఎలా సహాయం చేసినా జగన్ సీఎం అయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అందుకోవడం కూడా జరిగిపోయింది. చంద్రబాబు ఘోర ఓటమి పాలయ్యారు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని పరాజయాన్ని మూట గట్టుకున్నాడు. ఏకంగా ఏపీలో పార్టీ పునాదులే కదిలిపోయేంత బలమైన గిఫ్టు కేసీఆర్ ఇచ్చారని వైసీపీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

  జగన్ ప్రమాణ స్వీకారం నాడు రిటర్న్ గిఫ్ట్ ఫ్లెక్సీలు.. సోషల్ మీడియా లో వైరల్

  జగన్ ప్రమాణ స్వీకారం నాడు రిటర్న్ గిఫ్ట్ ఫ్లెక్సీలు.. సోషల్ మీడియా లో వైరల్

  గురువారం జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. టీఆర్ఎస్ అధినేత రాక సందర్భంగా బెజవాడలో వైసీపీ శ్రేణులు జగన్, కేసీఆర్‌ల భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చే శారు. అందులో కేసీఆర్ కు థాంక్స్ ఫర్ రిటర్న్ గిఫ్ట్ అంటూ రాశారు . ప్రస్తుతం ఈ రిటర్న్ గిఫ్ట్ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Everyone knows that KCR is giving a return gift to Chandrababu for contesting in Telangana in the last assembly election. After that, every body talked about the return gift. The YCP is now discussing about the return gift without any interference of KCR in the AP election.On Thursday, the Chief Minister of Telangana CM KCR attended the swearing-in ceremony. During the arrival of the TRS chief, the YCP has set up a huge Flexi of Jagan and KCR. Thanks to KCR for the Return gift to Chandrababu . This return gift flexies are now becoming viral in social media.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more