వకీల్ సాబ్ పోస్టర్లు అతికిస్తున్న చంద్రబాబు- సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్
ఏపీలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రంపై వైసీపీ వర్సెస్ జనసేన ప్లస్ టీడీపీ ప్లస్ బీజేపీ వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. వకీల్ సాబ్ చిత్రం టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరాల్సిన నిర్మాతలు.. హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకోవడంతో ప్రభుత్వం బ్రేకులు వేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై వైసీపీ వర్సెస్ మిగతా పార్టీలుగా రాజకీయ మాటలయుద్ధం సాగుతోంది.
వకీల్ సాబ్ టికెట్ల రేట్ల పెంపు విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిపై ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన మండిపడుతుండగా.. అధికార పార్టీ నేతలు కూడా అందుకు తగ్గట్టుగానే కౌంటర్లు వేస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. వకీల్ సాబ్‌కు మద్దతు ఇస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న వారికి ఇందులో సాయిరెడ్డి తనదైన శైలిలో చురకలు అంటించారు. ఈ ట్వీట్‌లో చంద్రబాబు, బీజేపీ నేతలతో పాటు మీడియానూ లాగారు.

వకీల్ సాబ్ చిత్రం టికెట్ల రేట్ల పెంపు విషయంలో మద్దతిస్తున్న చంద్రబాబు, బీజేపీ నేతలతో పాటు వారికి అండగా ఉన్న మీడియాపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఓ ట్వీట్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీరంతా వకీల్ సాబ్ చిత్రానికి పోస్టర్లు అంటిస్తున్నారంటూ చురకలు అంటించారు. 'సినిమా ప్రమోషన్లలో హీరో, హీరోయిన్లు, కమెడియన్లు పాల్గొని సక్సెస్ కోసం వాళ్ల తిప్పలేవో వాళ్లు పడుతుంటారు. ప్యాకేజి స్టార్ రీమేక్ మూవీ కోసం బాబు, అను'కుల మీడియా, బిజెపి పెద్దలు 'పోస్టర్లు అతికించే' స్థాయికి దిగజారడం రాజకీయాలకు దాపురించిన దరిద్రం కాక మరేంటి?' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌లో రెచ్చిపోయారు.
సినిమా ప్రమోషన్లలో హీరో, హీరోయిన్లు, కమెడియన్లు పాల్గొని సక్సెస్ కోసం వాళ్ల తిప్పలేవో వాళ్లు పడుతుంటారు. ప్యాకేజి స్టార్ రీమేక్ మూవీ కోసం బాబు, అను’కుల మీడియా, బిజెపి పెద్దలు ‘పోస్టర్లు అతికించే’ స్థాయికి దిగజారడం రాజకీయాలకు దాపురించిన దరిద్రం కాక మరేంటి?
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 14, 2021
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
1,01,001 బియ్యపు గింజలపై "రామ" నామం..! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications