విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీపై గులాబ్ పంజా: నీట మునిగిన పంట, కొట్టుకుపోయిన కల్వర్టులు.. 9మందికి పైగా మృతి..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో గులాబ్ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తుపాను విజయనగరం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. రహదారులు నీట మునగగా.. కల్వర్టులు కొట్టుకుపోయాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుపాను వల్ల ముగ్గురు ప్రాణాలు చనిపోయారు.

పశ్చిమగోదావరి జిల్లాపై తుపాన్ ఎఫెక్టు ఎక్కువగానే ఉంది. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. రహదారులపైకి వరదనీరు చేరడంతో అక్కడక్కడ గండ్లు పడ్డాయి. దెందులూరు-సత్యనారాయణపురం మధ్య జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. పొలాల్లోకి వర్షపునీరు చేరడంతో పంటలకు నష్టం జరిగింది.

Cyclone Gulab affect:heavy rain lashes in AP

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీగానే వర్షం కురుస్తోంది. ఉత్తరాంధ్ర 277 మండలాల్లో వానలు దంచికొడుతున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 98 మండలాల్లో ఓ మోస్తరు వానలు పడుతున్నాయి. గంటకు 60 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో 24.3 సెంటిమీటర్లు, విజయనగరం జిల్లాలో 23.4 సెంటిమీటర్లు, విశాఖ నగరంలో 57 చోట్ల 20 నుంచి 34 సెంటిమీటర్ల వర్షం , పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 12 సెంటిమీటర్లకు పైగా వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లాలో 10 సెంటిమీటర్ల నుంచి 16 సెంటిమీటర్ల వానలు కురుస్తోన్నాయి. కృష్ణా జిల్లాలో 10 సెంటిమీటర్ల నుంచి 14.7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

విజయనగరం జిల్లాలో 147 విద్యుత్ సబ్‌స్టేషన్లపై తుపాను ప్రభావం పడింది. వందలాది గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. ఆరు జిల్లాల్లో 1.64 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. విజయనగరం జిల్లాలో 13,122 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా వర్ష బీభత్సం కొనసాగింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. చాలా చోట్ల ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. దీంతో మంగళవారం ప్రభుత్వ/ ప్రైవేట్ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇవాళ ఇక్కడ వర్ష ప్రభావం ఏమీ లేదు.

English summary
Cyclone Gulab affect:heavy rain lashes in Andhra Pradesh state. Submerged crop in various districts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X