హన్మకొండలో బీజేపీ- కాంగ్రెస్ నేతల డిష్యూం డిష్యూం.. టీఆర్ఎస్, పోలీసులపై ఫైర్
హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే క్రమంలో బీజేపీ - కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఫైట్ జరిగింది. హన్మకొండ బీజేపీ కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వచ్చారు. ఇదీ గొడవకు కారణమయ్యింది.

ఇరు వర్గాల మధ్య గొడవ
బీజేపీ
కార్యాలయంలో
ఉన్న
బీజేపీ
కార్యకర్తలు
తమపై
దాడికి
దిగారని
కాంగ్రెస్
నేతలు
ఆరోపించారు.
కాంగ్రెస్
పార్టీకి
చెందిన
ఓ
నేత
కారు
అద్దాలు
ధ్వంసం
కూడా
అయ్యాయి.
తమ
పార్టీ
కార్యకర్తలు,
నేతలను
లక్ష్యంగా
చేసుకొని
బీజేపీ
నేతలు
దాడికి
దిగారని
కాంగ్రెస్
నేత
రాజేందర్
రెడ్డి
ఆరోపించారు.
తాము
నిరసనకు
దిగకుండా
పోలీసులు
అడ్డుకున్నారని
తెలిపారు.
బీజేపీ
కార్యాలయం
వద్ద
ఇరువర్గాల
మధ్య
తోపులాట
జరగడంతో
ఉద్రిక్తత
నెలకొంది.

హామీలపై రగడ..
రాష్ట్రానికి
ఇచ్చిన
హామీలను
ప్రధాని
మోడీ
నెరవేర్చలేదని
కాంగ్రెస్
నేతలు
ఆరోపించారు.
బీజేపీ
జాతీయ
కార్యవర్గ
సమావేశాల
నేపథ్యంలో
హైదరాబాద్‌కు
మోడీ
వస్తోన్న
నేపథ్యంలో
నిరసనకు
తెలిపేందుకు
వచ్చిన
సమయంలో
రెండు
పార్టీల
కార్యకర్తల
మధ్య
వాగ్వాదం,
తోపులాట
జరిగింది.
నిరసన
కాస్త
వివాదానికి
దారితీసింది.

పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదు
హనుమకొండ
ఘటనపై
రాజ్యసభ
సభ్యుడు,
బీజేపీ
నేత
ఓం
ప్రకాశ్
మాథూర్
స్పందించారు.
అగ్నిపథ్
పథకానికి
వ్యతిరేకంగా
కాంగ్రెస్
నిరసనకు
దిగడంతో
గొడవ
జరిగింది.
దీంతో
పోలీసులు
లాఠీఛార్జి
చేశారు.
తెలంగాణ
ప్రజలను
కలవడానికి
తాము
వచ్చామని..
తాను
నిన్నటి
నుంచి
బీజేపీ
శ్రేణులను
కలుస్తున్నానని
తెలిపారు.
బీజేపీ
సమావేశాలను
అడ్డుకోవడానికి
కాంగ్రెస్
శ్రేణులు
ప్రయత్నించారని
మండిపడ్డారు.

ఎందుకు అడ్డుకుంటున్నారు..?
పోలీసులు
తమ
శాంతియుత
సమావేశాలను
ఎందుకు
అడ్డుకుంటున్నారని
ప్రశ్నించారు.
పోలీసులను
అడ్డుపెట్టుకుని
టీఆర్ఎస్
పార్టీ
డ్రామాలు
ఆడుతోందని
ధ్వజమెత్తారు.
నిరసనల
పేరుతో
కాంగ్రెస్
శ్రేణులు
దాడులకు
తెగబడ్డారని
ఆరోపించారు.