శాన్వీ, సత్యవతి హత్య కేసు: వచ్చే నెల రఘునందన్‌కు మరణశిక్ష

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికాలో పది నెల చిన్నారి శాన్వీతో పాటు ఆమె నాయనమ్మ సత్యవతి(61)ని దారుణంగా హత్య చేసిన కేసులో రఘునందన్‌కు మరణశిక్ష వేస్తున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు.

భారత సంతతికి చెందిన అమెరికన్ రఘునందన్ యండమూరి (32)కి ఫిబ్రవరి 23వ తేదీన మరణశిక్ష అమలు చేస్తున్నట్లు స్థానిక జైలు అధికారులు చెప్పారు. రఘనందన్ డబ్బు కోసమే ఈ హత్యలు చేశారని పోలీసులు కోర్టుకు తెలిపారు.

అమెరికాలో శాన్వి హత్య: నన్ను చంపేయండంటూ రఘునందన్ ఆక్రోశం

 తొలుత అంగీకరించి తర్వాత..

తొలుత అంగీకరించి తర్వాత..

ఆ హత్యలు తానే చేశానని మొదట అంగీకరించిన రఘునందన్ ఆ తర్వాత మాట మార్చాడు. తాను కేవలం దొంగతనానికి మాత్రమే పాల్పడ్డానని చెప్పాడు. ఆ హత్యలతో తనకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పారు. ఆ హత్యలు అమెరికన్లు చేశారని ఆరోపించాడు.

కేసు విచారణ

కేసు విచారణ

రఘునందన్ మాట మార్చిన నేపథ్యంలో కేసు విచారణను ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ నుంచి ఏడుగుు న్యాయమూర్తుల బెంచ్‌కి బదిలీ అయింది. ఇరు పక్షాల వాదనలు విన్న పెన్సల్వేనియయా కోర్టు రఘునందన్‌కు మరణశిక్ష విధిస్తున్నట్లు తుదకు 2014 అక్టోబర్ 14వ తేదీన ప్రకటించింది.

 శిక్ష వాయిదా పడవచ్చు...

శిక్ష వాయిదా పడవచ్చు...

పెన్సిల్వేనియా టామ్ వుల్ఫ్ 2015లో విధించిన మారిటోరియం కారణంగా రఘునందన్‌కు అమలు చేయాల్సిన శిక్ష వాయిదా పడే అవకాశం ఉందని జైలు అధికారులు చెబుతున్నారు.

 అలా జరగకపోతే...

అలా జరగకపోతే...

శిక్ష అమలు కోసం నిర్ణీత గడువులోగా ఒకవేళ గవర్నర్ ఏ విధమైన ఆదేశాలు ఇవ్వకపోతే జైళ్ల శాఖ కార్యదర్శి 30 రోజుల్లోగా దోషికి విషపూరితమైన ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్ష విధించాలని ఆదేశాలు జారీ చేయవచ్చునని అన్నారు. ప్రస్తుతం రఘునందన్‌కు వేయాల్సిన శిక్ష, అమలు విషయమై పెన్సిల్వేనియా టాస్క్‌ఫోర్స్, సలహా కమిటీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. మరణదండన ఎదుర్కుంటున్న తొలి భారత సతతి అమెరికన్ రఘునందనే కావడం గమనార్ఙం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The execution date of the first death-row Indian-American prisoner convicted of killing a baby and her Indian grandmother has been set for next month.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి