వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవార్డు రేసులో జుంప లహరి నవల

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారతీయ అమెరికన్, ప్రముఖ రచయిత్రి జుంప లహిరి రచించిన ‘ది లోలాండ్' నవల అమెరికా నేషనల్ బుక్ అవార్డు 2013కు రేసులో ఉంది. జుంప లహిరి గతంలో పులిట్జర్ అవార్డును కూడా గెలుచుకున్నారు.

జుంప లహిరి రచించిన ‘ది లోలాండ్'తోపాటు టామ్ డ్యూరీ రచించిన ‘పసిఫిక్', ఎలిజమెత్ గ్రేవర్స్ ‘ది ఇండ్ ఆఫ్ ది పాయింట్', రచెల్ కుష్నర్ రచించిన ‘ది ఫ్లేమ్ త్రోవర్స్' రచనలు చేశారు. ది యంగ్ పీపుల్స్ లిటరేచర్, పోయిట్రి, నోటిఫికేషన్, ఫిక్షన్ కేటగిరీస్ ల రచనల ఎంపికను అక్టోబర్ 16న ప్రకటిస్తామని, విజేతలకు నవంబర్ 20న న్యూయార్క్ నగరంలో బహమతులు అందజేయనున్నట్లు అమెరికా నేషనల్ బుక్ హౌస్ ఫౌండేషన్ తెలిపింది.

Jhumpa Lahiri

జుంప లహరి లండన్‌లో జన్మించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రవాసులైన లహరి తల్లిదండ్రులు బ్రిటన్ కు వలస వెళ్లారు. లహరి ఇద్దరు సోదరులు కోల్‌కతాలో నివాససిస్తున్నారు. ప్రస్తుతం జుంప లహరి న్యూయార్క్ నగరంలోని బ్రూక్‌లిన్‌లో నివాసం ఉంటున్నారు. తన గొప్ప రచన ‘ఇంటర్ ప్రిటర్ ఆఫ్ మెలడీస్ కు పులిట్జర్ అవార్డుతోపాటు పెన్/హెమింగ్ వే అవార్డు గెలుచుకున్నారు.

న్యూయార్క్ టైమ్స్‌కు లహరి రచించిన ‘ది నమేసకే' నవలంపై ప్రసంశలు కురిపించింది. నవలను ఆ ఏడాదిలో వచ్చిన గొప్ప నవలలో ఒకటిగా యూఎస్ఏ టూడే, ఎంటర్ టైన్మెంట్ వీక్లీ, పలు ప్రచూరణ సంస్థలు ఎంపిక చేశాయి. ఈ నవల ఆధారంగా ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ ఓ సినిమాను చిత్రీకరించారు. లహరి రచించిన ‘అన్ అక్యుస్టడీ ఎర్త్'ను ఏడాదిలో ప్రచూరితమైన 10 గొప్ప పుస్తకాల్లో ఒకటిగా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

అమెరికాలో భారతదేశం నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడి జీవితాన్ని అలవర్చుకోవడానికి పడే ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆమె తన కొత్త నవల ‘ది లోలాండ్'నవలలో పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ ప్రచూరించింది. లహరి చాలా దగ్గర్నుంచి క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతనే నవలను రచించినట్లు ఉందని టైమ్స్ పేర్కొంది.

English summary
Days after being short listed for the Man Booker prize for her new novel, The Lowland, Pulitzer Prize winning Indian American author Jhumpa Lahiri has been shortlisted for the 2013 US National Book Award in fiction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X