లైఫ్ టైమ్ సెటిల్మెంట్- ఓ మనిషి జీవితకాలంలో ఎప్పుడూ చూడని అద్భుతాన్ని వీక్షించారు
విశ్వంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. మనిషి తన జీవితకాలంలో ఏనాడూ చూడని మహాద్భుత దృశ్యం అది. చందమామకు అవతలి వైపు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. దీన్ని ఆర్టెమిస్ 2 వ్యోమగాములు స్వయంగా వీక్షించారు. మనం రోజూ చూసే చంద్రుడికి ఇవతలి వైపు కంటే ఎంతో భిన్నంగా కనిపించిందా సూర్యగ్రహణం. ఇక్కడి కంటే సుదీర్ఘ గ్రహణ కాలం అది. గ్రహణం చీకటిలో ఆర్టెమిస్ 3 నౌక ప్రయాణం ప్రారంభమైందంటే అది ఎంత భిన్నమైనదో అర్థం చేసుకోవచ్చు.
ఆర్టెమిస్ 2 వ్యోమగాములు ప్రస్తుతం చంద్రుడికి వెనుకవైపు ఉన్నారు. వారు బయలుదేరిన ఓరియన్ స్పేస్ షిప్ ప్రస్తుతం చంద్రుడికి అవతలి వైపున పరిభ్రమిస్తోంది. అదే సమయంలో ఈ అత్యంత అరుదైన ఖగోళ దృశ్యానికి సాక్షీభూతంగా నిలిచింది. భూమిపై ఎవరూ, ఎప్పుడూ చూడలేని సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ఆ నలుగురు వ్యోమగాములు వీక్షించారు. ఒరియన్ అంతరిక్ష నౌక చంద్రుని వెనుకకు జారుకోవడంతో గ్రహణం చీకటిలో దాని ప్రారంభమైంది.

అనంతరం భూమికి తిరుగుముఖం పట్టిన వ్యోమగాములతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. వారికి సర్ ప్రైజ్ ఇచ్చారు. అంతరిక్ష అనుభవాల గురించి తెలియజేయాలని కోరారు. చంద్రుడికి అవతలి వైపు ఏముందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎగ్జయిటింగ్ ఉన్నానని, ఎప్పుడెప్పుడు మాట్లాడతానా అని ఎదురు చూశానని అన్నారు. అక్కడ ఏమి కనిపించిందని, అక్కడి వాతావరణం ఎలా ఉందని ఆరా తీశారు. గుర్తుండిపోయే క్షణం ఏమిటని ట్రంప్ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా వ్యోమగాములు చంద్రుడి అవతలి వైపు ఉన్న పరిస్థితుల గురించి ట్రంప్ కు వివరించారు. తమ మర్చిపోలేని అంతరిక్ష అనుభవాలను పంచుకున్నారు. భూమి నుండి చంద్రుడికి సంబంధించి ఇప్పటివరకు చూసిన దృశ్యాలను భిన్నమైన కోణంలో తిలకించామని, ఏ మనిషీ చూడని అద్భుత దృశ్యాలను తాము చూడగలిగామని కమాండర్ రీడ్ వైస్‌మెన్ తెలిపారు. ఇప్పుడే సంపూర్ణ సూర్య గ్రహణం నుండి బయటపడ్డామని పేర్కొన్నారు.
.@POTUS asks the Artemis II crew, "What is the most unforgettable part of this really historic day?"
— Rapid Response 47 (@RapidResponse47) April 7, 2026
Commander Reid Wiseman: "We saw sights... that no human has ever seen before — not even in Apollo." pic.twitter.com/f3ThoGm91e
చంద్రుని అవతలి వైపును చూడటం, అలాగే 45 నిమిషాల కమ్యూనికేషన్ విచ్ఛిన్నం కావడం, ఆ తర్వాత చంద్రుడి వైపు నుంచి తిరిగి వస్తూ భూమిని తిలకించిన మొట్ట మొదటి వీక్షణ తమకు ప్రత్యేకమైనవిగా, జీవితాంతం గుర్తుండిపోతాయని మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టినా కోచ్ పేర్కొన్నారు. సంపూర్ణ సూర్యగ్రహణాన్ని స్పష్టంగా చూడగలిగామని, భూమిపై ఉండే మరి ఏ ఇతర జీవికీ ఇది అసాధ్యమని అన్నారు. సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో చంద్రుడిపై చీకటి ఆవరించిందని, సూర్యుడి అంచుల నుంచి వెలువడిన శక్తిమంతమైన సోలార్ కరోనాను రికార్డు చేశామని తెలిపారు.
గతంలో అపోలో మిషన్ సృష్టించిన రికార్డును అధిగమించామని, అది అమెరికాకు ఎంతగానో గర్వకారణమని వ్యోమగాములు ట్రంప్ కు తెలిపారు. ఇప్పటివరకు చంద్రుడి దిశగా మనుషులు వెళ్ళనంత దూరం అంతరిక్షంలోకి తాము ప్రయాణించామని పేర్కొన్నారు. చారిత్రాత్మక ప్రయాణంలో కమ్యూనికేషన్ బ్లాక్‌అవుట్ కారణంగా 45 నిమిషాల పాటు భూమితో సంబంధాలు తెగిపోయిన సందర్భాన్ని ట్రంప్ కు వివరించారు.
-
అమెరికా- ఇరాన్ మధ్య సడన్ సీజ్ ఫైర్: 10 పాయింట్స్ ఫార్ములా -
ఎల్లుండే.. పాకిస్తాన్ లో ఏం జరగబోతోంది -
పాకిస్తాన్ వెళ్తోన్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ క్షేమంగా వెనక్కి రావాలని ప్రార్థనలు చేయండి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
పాకిస్తాన్ ప్రధాని చుట్టూ -
US Iran: గెలుపు ఎవరిది? అసలు ఇస్లామాబాద్‌లో ఏం జరగబోతోంది? -
మార్నింగ్ వాకింగ్ Vs ఈవినింగ్ వాక్ - ఈ రెండిట్లో ఏది మంచిది..!? -
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది












Click it and Unblock the Notifications