Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సరైనోళ్లు తగిలితే బుడ్డోడి డొల్లతనం బయటపడుతుంది.!!

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌ 57 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అరంగేట్ర మ్యాచ్‌లోనే చెరో నాలుగు వికెట్లు పడగొట్టిన పేసర్లు సకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగేల మ్యాజికల్ స్పెల్.. ఈ జట్టును పాయింట్ల పట్టికలో టాప్-4లోకి చేర్చింది. ఈ విజయంతో హెన్రిచ్ క్లాసెన్ ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్ ఆడాడు క్లాసెన్.

ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ శర్మ అవుట్ అయినప్పటికీ ఏ మాత్రం బెదరలేదీ టీమ్. కేప్టెన్ ఇషాన్ కిషన్ ముందుండి నడిపించాడు. దూకుడుగా ఆడాడు. 30 బంతుల్లోనే అలవోకగా అర్ధ సెంచరీ సాధించాడు. ట్రావిస్ హెడ్ 18 పరుగులకు ఔటైనా, కిషన్ తన ధాటిని కొనసాగించాడు. హెన్రిక్ క్లాసెన్ 40 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 44 బంతుల్లో 91 పరుగులు చేసిన కిషన్ అద్భుత ఇన్నింగ్స్ జట్టుకు పటిష్టమైన పునాది వేసింది.

Debut Pacer Duo Sakib Hussain and Praful Hinge Dismantle RR in SRH Win Klaasen Tops Orange Cap

ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 28), సలీల్ అరోరా (13 బంతుల్లో 24 నాటౌట్) చివరి ఓవర్లలో మెరుపులు మెరిపించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆదిలోనే తడబడింది. అరంగేట్ర బౌలర్ ప్రఫుల్ హింగే చారిత్రాత్మకమైన మొదటి ఓవర్‌ లోనే వైభవ్ సూర్యవంశీ, జురెల్, ప్రిటోరియస్‌లను పెవిలియన్ చేర్చాడు. అనంతరం సకిబ్ హుస్సేన్ దెబ్బకు యశస్వి జైస్వాల్‌ అవుట్ కావడంతో ఆర్ఆర్ 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

డోనోవన్ ఫెరీరా (69), రవీంద్ర జడేజా (45) 118 పరుగుల భాగస్వామ్యంతో ప్రతిఘటించారు గానీ విజయాన్ని అందించలేకపోయారు. సకిబ్ హుస్సేన్ లోయర్ ఆర్డర్‌ను పడగొట్టాడు. లోయర్ ఆర్డర్ లో తుషార్ దేశ్ పాండే ఒక్కడే 25 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్ మొత్తం మీద ఫెరీరా, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్ పాండే మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగలిగారు. యశస్వి జైస్వాల్- 1, వైభవ్ సూర్యవంశీ- 0, జురెల్- 0, ప్రిటోరియస్- 0, రియాన్ పరాగ్- 4, జోఫ్రా అర్చర్- 2, రవి బిష్ణోయ్- 0, నాండ్రే బర్గర్- 3 (నాటౌట్) పరుగులు చేశారు.

హింగే (4/34), హుస్సేన్ (4/24) చెరో నాలుగు వికెట్లతో సన్ రైజర్స్ కు ఘన విజయాన్ని సాధించిపెట్టారు. ఈ ఇన్నింగ్ తో ఆరెంజ్ క్యాప్ రేసులో హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్.. వైభవ్ సూర్యవంశీని అధిగమించారు. మ్యాచ్ అనంతరం 224 పరుగులతో క్లాసెన్ ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. సూర్యవంశీ తన ఐపీఎల్ కెరీర్‌లో మొదటి గోల్డెన్ డక్ నమోదు చేయడంతో పరుగుల పట్టికలో పడిపోయినా, క్లాసెన్‌కు అతనికి మధ్య ఇంకా 24 పరుగుల తేడా ఉంది. పర్పుల్ క్యాప్ లో పెద్దగా మార్పులు లేవు. జోఫ్రా ఆర్చర్ ఎనిమిదో స్థానం నుండి నాలుగో స్థానానికి ఎగబాకాడు. టాప్-10లోని మిగిలిన బౌలర్లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+