Ind Vs SA: గంభీర్ చేసిన ఆ తప్పే టీమిండియా ఓటమికి కారణం.. మాజీల ఫైర్..!!
టీమిండియాను దక్షిణాఫ్రికా ఓడించింది. కాదు, టీమిండియా ఓడిపోయేలా ఆడింది. కొత్త ప్రయో గాలు ఓటమికి కారణమయ్యాయి. బలమైన ప్రత్యర్థితో ఆడుతున్న సమయంలో చేసిన అర్దం లేని ప్రయోగాలు ఓటమి తెచ్చి పెట్టాయి. భారీ స్కోరు లక్ష్యంతో దిగిన టీమిండియా కీలకమైన పవర్ ప్లే సమయంలో ప్రధాన బ్యాటర్ల స్థానాలను మార్చేసింది. గంభీర్ చేసిన ఈ ప్రయోగాలతోనే భారత్ ఓడిపోయిందని మాజీ క్రికెటర్లు.. ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రపంచ కప్ వేళ ఈ ప్రయోగాలతో ఏం చెప్పదలచుకున్నారని నిలదీస్తున్నారు.
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అటు బ్యాటుతో, ఇటు బంతితో ప్లేయర్లు విఫలమయ్యారు. ఆదుకుంటారు అనుకున్న అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా.. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో.. సౌతాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేశారు. ఛేదనకు దిగిన టీమిండియా.. సఫారీ బౌలర్ల ధాటికి కుప్పకూలింది. తిలక్ వర్మ(62) మినహా ఏ ఇతర బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో ప్రదర్శించలేదు. ఆఖరిలో 5 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తొలి వన్డేలో భారీ విజయం సాధించిన టీమిండియా ఈ రెండో టీ20లో స్వయం తప్పిదాలతో ఓటమి చవి చూపింది. ఈ ఓటమి పై మాజీ క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, డేల్ స్టెయిన్ తీవ్రంగా స్పందించారు. హెడ్ కోచ్ గంభీర్ నిర్ణయాలపై విమర్శలు గుప్పించారు.

భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు అత్యుత్తమ బ్యాటర్లు క్రీజులో ఉండాలి. అక్షర్ పటేల్‌ను వన్ డౌన్లో పంపించారు. దూకుడుగా ఆడాల్సిన అక్షర్.. 21 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అది అస్సలు సరైన పద్ధతి కాదు. టాప్ 3 బ్యాటర్ల స్థానాలు ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. బ్యాటింగ్ ఆర్డర్‌పై ప్రయోగాలు చేయడం వల్ల జట్టు స్థిరత్వం దెబ్బ తింటుందని అని రాబిన్ ఉతప్ప విశ్లేషించాడు. కాగా, 'సూర్య కుమార్ మీ బెస్ట్ బ్యాటర్. అతడిని వెనక్కి నెట్టి అక్షర్‌ను మూడో స్థానంలో పంపడమే గంభీర్ చేసిన పెద్ద తప్పు. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ చేయడానికి సమయం కాదు.
అక్షర్ పటేల్‌కు ఆడే సామర్థ్యం లేదని కాదు కానీ జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో వన్ డౌన్లో పంపడం సరికాదు. సింహాల గూటిలో అక్షర్‌ను నెట్టినట్టు అనిపించింది. సిరీస్‌లో ఆధిక్యం ప్రదర్శించే అవకాశం ఉన్న మ్యాచులో ఇలాంటి ప్రయోగాలు అనవసరం' అని డేల్ స్టెయిన్ వ్యాఖ్యానించాడు. మొత్తానికి, గంభీర్ తన 'ఫ్లెక్సిబుల్ బ్యాటింగ్ ఆర్డర్' సిద్ధాంతంపై పునరాలోచన చేయాలని మాజీలు సూచిస్తున్నారు. సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉండటంతో తర్వాతి మ్యాచ్‌లపై ఆసక్తి నెలకొంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications