ప్రియురాలి అసభ్యకర వీడియో: హార్దిక్ పాండ్యా సీరియస్ వార్నింగ్!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తన ప్రియురాలు మహికా శర్మ విషయంలో జరిగిన సంఘటనపై బాలీవుడ్ ఫోటోగ్రాఫర్లకు (పపరాజీలకు) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తన ప్రియురాలిని అభ్యంతరకర రీతిలో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అసభ్యకర వీడియోలపై పాండ్యా ఆగ్రహం
మహికా శర్మ ఒక రెస్టారెంట్ మెట్లు దిగి వస్తుండగా.. కొందరు పపరాజీలు ఆమెను అనుచితంగా, అసభ్యకరమైన కోణాల్లో వీడియోలు, ఫోటోలు తీసి నెట్టింట వైరల్ చేశారు. ఈ సంఘటన హార్దిక్ పాండ్యాను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించిన హార్దిక్ పాండ్యా... "సెలబ్రిటీగా ఉండటం అనేది మా జీవితంలో భాగమే, కానీ ఈ రోజు హద్దులు దాటారు" అంటూ మండిపడ్డారు. కేవలం హెడ్‌లైన్స్, క్లిక్‌ల కోసం 'చీప్ సెన్సేషనలిజమ్‌కు' దిగజారడం సరికాదని ఆయన హితవు పలికారు.

పాండ్యా కీలక విజ్ఞప్తి
హార్దిక్ పాండ్యా మీడియా పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తూనే, వారికి ఒక కీలక విజ్ఞప్తి చేశారు: "స్త్రీలను గౌరవించడం ప్రాథమిక నియమం. దయచేసి కొంత మానవత్వం కలిగి ఉండండి. ప్రతీదీ క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతీ కోణాన్ని తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు." అంటూ మానవత్వాన్ని ప్రదర్శించాలని విజ్ఞప్తి చేస్తూ తన పోస్ట్‌ను ముగించారు. హార్దిక్ పాండ్యా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలో హద్దులు మీరకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన ఫోటోగ్రాఫర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
స్టన్నింగ్ లుక్ లో Hardik Pandya Girlfriend Mahieka Sharma #MahiekaSharma #HardikPandya #ReelTalk #OIUpdates #Oneindiatelugu pic.twitter.com/JrMwLxiRou
— oneindiatelugu (@oneindiatelugu) December 9, 2025
Hardik Pandya instagram story for his girlfriend Mahieka Sharma privacy pic.twitter.com/kpzn59Bkvr
— Teja (@Teja_twitts) December 9, 2025
వ్యక్తిగత జీవితంలో హార్దిక్
నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా కొందరితో డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇటీవల మహికా శర్మతో తాను ప్రేమలో ఉన్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ డేటింగ్ లైఫ్‌ను ఆస్వాదిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోలు వైరల్ కావడంతో హార్దిక్ పాండ్యా తీవ్ర అసహనం వ్యక్తం చేయాల్సి వచ్చింది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications