జాక్‌పాట్ కొట్టిన రోహిత్, కోహ్లీ.. !!
ఐసీసీ తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అప్రతిహతంగా దూసుకెళ్లాడు. రెండో స్థానానికి ఎగబాకాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 302 పరుగులు బాదాడీ రన్నింగ్ మెషీన్. దీంతో కోహ్లీ వన్డే ర్యాంక్ టాప్ లేపింది. నంబర్ వన్ స్థానానికి ఎనిమిది రేటింగ్ పాయింట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు కోహ్లీ. ప్రస్తుతం ఈ స్థానంలో రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. అతనికి చేరువ అయ్యాడు.
భారత్ 2-1తో గెలిచిన దక్షిణాఫ్రికా సిరీస్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శన కనపర్చిన విషయం తెలిసిందే. 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును గెలుచుకున్నాడు. 151 సగటుతో చెలరేగాడు. 117.05 స్ట్రైక్ రేట్‌ను సాధించాడు. రాంచీ, రాయ్పూర్లల్లో జరిగిన వన్డేల్లో వరుస సెంచరీలు కొట్టాడు కోహ్లీ. ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లల్లో చివరిసారిగా 2021 మార్చిలో నంబర్ వన్ స్థానాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజం అతని స్థానాన్ని ఆక్రమించాడు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ టాప్ పొజీషన్ కు చేరువ అయ్యాడు.

ప్రస్తుతం రోహిత్ శర్మ 781 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. విరాట్ కోహ్లీ 773 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్, అఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ వరుసగా మూడు, నాలుగు స్థానాలకు పడిపోయారు. వీరిద్దరి వద్ద ఉన్న పాయింట్లు వరుసగా 766, 764. 723 పాయింట్లతో శుభ్ మన్ గిల్ ఈ వన్డే ర్యాంకింగ్ లల్లో అయిదో స్థానంలో నిలిచాడు. అతని తర్వాత బాబర్ ఆజమ్ 722, హ్యారీ ట్రాక్టర్ (ఐర్లాండ్)- 708, షై హోప్ (వెస్టిండీస్)- 701, చరిత్ అసలంక (శ్రీలంక)- 690, శ్రేయాస్ అయ్యర్- 679 పాయింట్లతో టాప్ 10లో ఉన్నారు.
బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ కూడా గణనీయంగా ఎగబాకాడు. మూడు స్థానాలను మెరుగుపర్చుకున్నాడు. ఏకంగా మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లాండ్ జోఫ్రా ఆర్చర్ రెండో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో కుల్దీప్ 6.23 ఎకానమీ రేట్‌తో తొమ్మిది వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
-
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications