ఉద్యమ పార్టీని వదలని వారసత్వ పోరు?

గత శాసనసమండలి ఎన్నికలలో ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసినప్పుడే ఉద్యమ పార్టీ అనే హక్కును కోల్పోయినట్టుగా పలువురు భావిస్తున్నారు. ఉద్యమం పేరు చెప్పి ఓటును అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పలువురు టిఆర్ఎస్ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా వారసత్వ పోరు రసకందాయకంలో పడినట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో మరింతగా దాని ప్రతిష్ట పలుచన పడిపోయే అవకాశం ఉంది. గత సాధారణ ఎన్నికల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె తారక రామారావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితల మధ్య తీవ్రంగా ఆధిపత్య పోరు నడిచిందని ఆ పార్టీ నేతలు చెప్పుకున్నారని సమాచారం. వీరు ముగ్గురు ఇప్పుడు కూడా పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
కాగా ఆధిపత్య పోరును హరీష్‌రావు ఖండించారు. తామంతా ఒక్కటే అని కేసీఆర్ గ్రూప్ అని అన్నారు. తమ మధ్య విభేదాల్లేవు. అందరం కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాం. ఉద్యమాన్ని బలపర్చాలని, రాష్ట్రాన్ని త్వరగా సాధించాలనే లక్ష్యాలతోనే పని చేస్తున్నామని చెప్పారు. కాగా శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకున్న టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్, హరీశ్‌రావు చాలా సన్నిహితంగా మెలిగారు. పలుమార్లు గుసగుసలాడారు. ఇటీవల కాలంలో వివిధ సందర్భాల్లో మామ, మేనల్లుడు ఒకే వేదికను పంచుకున్నా, ఇలాంటి దృశ్యాలు మాత్రం కనిపించలేదు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు మాట్లాడాలని పలువురు డిమాండ్ చేయడంతో, కెసిఆర్ సరేననడంతో హరీశ్‌రావు మాట్లాడారు.
అనంతరం మాట్లాడిన కెసిఆర్ తన ప్రసంగంలో తన తనయుడు కెటిఆర్ గురించి ప్రధానంగా ప్రస్తావించడాన్ని బట్టి టిఆర్ఎస్‌లో వారసత్వ పోరు నడుస్తుందని అనుకోవచ్చు. పుణెలో ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ చేసిన కెటిఆఱ్ సెలవులకు ఇంటికొచ్చినప్పుడు ఏం చేస్తావని తాను ప్రశ్నించానని, అయితే తననే సలహా ఇవ్వమని కోరడంతో సివిల్స్ రాసి ఐఏఎస్సో, ఐపీఎస్సో కావచ్చని సలహా ఇచ్చానని అయితే తన తనయుడు మాత్రం ఆ థర్డ్‌క్లాస్ ఉద్యోగం చేయనన్నాడు. ఐఏఎస్, ఐపీఎస్‌లంటే థర్డ్ క్లాస్ ఏమిటని అనడిగితే అది తన మాట కాదని, మా తరం మాట అన్నాడు.
అమెరికా వెళ్లి గ్లోబల్ సిటిజన్ అవుతానని చెప్పాడు. అలా వెళ్లి అక్కడే ఎంబీఏ పూర్తిచేశాడు. షిప్పింగ్ కంపెనీలో నెలకు రూ. 4-4.5 లక్షలు సంపాదించాడు. అక్కడ ఉజ్వల భవిష్యత్తు ఉన్నా తెలంగాణ కాజ్ కోసం ఉద్యమంలోకి వచ్చాడని చెప్పారు. ఇటీవలె ఓ పత్రికలో కూడా టిఆర్ఎస్ వారసత్వ పోరుపై కథనం రావడం విశేషం.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications