వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాకు కెసిఆర్‌ పాట్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao-Sonia Gandhi
తెలంగాణపై చర్చకు లోకసభ స్పీకర్ మీరా కుమార్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు రేపు బుధవారం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి తలనొప్పిగానే మారింది. తెలంగాణపై కెసిఆర్ మంగళవారం లోకసభలో వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. దాన్ని తిరస్కరిస్తూ బుధవారం కెసిఆర్‌కు తెలంగాణపై మాట్లాడేందుకు మీరా కుమార్ అవకాశం ఇచ్చారు. కెసిఆర్ చర్చలో కేంద్రం నుంచి స్పష్టమైన వైఖరిని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోతే ఆయనతో పాటు తెరాస లోకసభ సభ్యురాలు విజయశాంతి స్పీకర్ పోడియం వద్ద బైఠాయించే అవకాశాలున్నాయి. కెసిఆర్‌కు ఈ విషయంలో బిజెపి సభ్యుల నుంచి మద్దతు లభిస్తుందనడంలో సందేహం లేదు.

మొత్తం మీద, తెలంగాణపై కెసిఆర్ మరోసారి కదలిక తెచ్చారు. ఈ స్థితిలో తెలంగాణపై ఏం చెప్పించాలనే విషయంపై సోనియా గాంధీ తీవ్రంగా మథనపడుతున్నట్లు సమాచారం. పాత పాటే పాడితే చెల్లే అవకాశం లేదు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై రాష్ట్రానికి చెందిన అఖిల పక్ష సమావేశాన్ని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఓసారి ఏర్పాటు చేశారు. మరో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పి దాటవేశారు. తెలంగాణ అంశంపై సాచివేత వైఖరి అవలంబించే ఉద్దేశంతోనే కాంగ్రెసు అధిష్టానం వ్యవహరిస్తోందని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఈ సందర్భంలో కెసిఆర్ మరోసారి ముందుకు వచ్చారు.

కెసిఆర్ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించి ఆందోళనకు దిగితే తమ పార్టీ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ఏ వైఖరి తీసుకుంటారనే ఆందోళన సోనియాలో పొడసూపినట్లు చెబుతున్నారు. దీనిపై తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తమలో తాము చర్చించుకుంటున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తెలంగాణ అంశానికి తామే చాంపియన్లమని చాటుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ స్థితిలో అధిష్టానానికి, సోనియాకు వారు ఏ విధమైన ఇబ్బంది కలిగిస్తారనేది కూడా చర్చనీయాంశమే అయింది. ఏమైనా, తెలంగాణ అంశంపై కెసిఆర్‌ను ఒప్పించేలా సోనియా ఏ విధమైన వ్యూహాన్ని అనుసరించబోతున్నారనేది ఆసక్తిగానే ఉంది.

English summary
Congress president Sonia Gandhi in trouble with TRS president K Chandrasekhar Rao's on Telangana issue. KCR may get support from main opposition, BJP in Loksabha tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X