కాంగ్రెస్‌లో లోపించిన కలివిడితనం: సమస్యలపై అధ్యయనం ఊసేలేదు, టీఆర్ఎస్‌ను నిలదీసేదెలా?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతున్నది. 1994 - 99 మధ్య అప్పటి విపక్ష నేత పీ జనార్ధన్ రెడ్డి తరహాలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే నాయకుడే కాంగ్రెస్ పార్టీలో కరువయ్యాడన్న చర్చ జరుగుతున్నది. మీడియా ముందు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతామని చెప్పి, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ సభ్యులే మౌనంగా ఉండడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే అధికార టీఆర్ఎస్ పార్టీకి వరంగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ప్రధాన ప్రతిపక్ష పార్టీ అస్త్రశస్త్రాలు లేకుండా అసెంబ్లీకి వస్తున్నట్లు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధ్యయనం చేసిన సమస్యలను, ఆయా శాఖల్లో జరుగుతున్న లోపాలను వివరాలతో సహా అసెంబ్లీ ముందు ఉంచి.. సరైన రీతిలో చెప్పే వాగ్దాటితో మెప్పించే వారు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. పంట రుణాల మాఫీలో వడ్డీ అంశంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టినా.. అది కేవలం టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత గొడవ మాదిరిగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు చూస్తున్నారు.

ప్రజాందోళనను సభ ద్రుష్టికి తేవడంలో విఫలం

ప్రజాందోళనను సభ ద్రుష్టికి తేవడంలో విఫలం

సమస్యలపై అధ్యయనం చేయడం చేతగాని కాంగ్రెస్ పార్టీ నేతలే అసెంబ్లీలో ప్రతిపక్షం నాన్‌ సీరియస్‌గా ఉందని చెబుతుండడం గమనార్హం. ఇలాగైతే ఇంకెప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తామని అంటున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలపై ఆందోళనలు చేస్తున్నారు. ప్రజాందోళనలను శాసనసభలో ప్రతిబింబించాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ రోజురోజుకు చతికిల పడుతున్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చర్చ జరిగినప్పుడల్లా ప్రతిపక్షాలే ముందుంటాయి. కనీసం 20 రోజుల నుండి 30 రోజులు జరపాలని కోరతాయి. కానీ అధికార పక్షంగా సీఎం కేసీఆర్‌ 50 రోజులు సభ పెడతామంటే, దానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమేనని చెప్పకపోవడం టీఆర్‌ఎస్‌పార్టీకి కలిసొచ్చినట్లయింది. మిగతా బీజేపీ, ఎంఐఎం, టీడీపీలు కూడా ఎన్నిరోజులన్న దానిపై సృష్టత ఇవ్వలేదు.

 వాకౌట్లపై కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో ఇలా గందరగోళం

వాకౌట్లపై కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో ఇలా గందరగోళం

చర్చించేందుకు పలు అంశాలు పెట్టుకుని, వాటిపై అధ్యయనం లేకుండా సభకు హాజరుకావడం వల్ల ఉపయోగమేమిటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎప్పుడైపోతుందబ్బా అన్న ఆలోచన తప్ప, సభలో ఉండి ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఆలోచనే కనిపించడం లేదు. రైతు సమస్యలపై సర్కార్ నిర్లక్ష్యపూరిత వైఖరి పట్ల కొంతమంది కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు వాకౌట్‌ చేసి బయటకు వెళ్లారు. కొంత మంది అక్కడే నిలుచున్నారు. ఇదే అంశాన్ని అసెంబ్లీలో ఎంఐఎం నేత అగ్బరుద్దీన్‌ కూడా గుర్తు చేస్తూ ప్రతిపక్ష పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల మధ్యే సమన్వయం లేదని, విపక్షాల మధ్య ఏం సమన్వయం సాధిస్తారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఆరోపించారు.

 చర్చలు, సంప్రదింపుల ఊసే లేని కాంగ్రెస్

చర్చలు, సంప్రదింపుల ఊసే లేని కాంగ్రెస్

ఏదైనా ఒక అంశంపై సభలో సభ్యుడు మాట్లాడుతుంటే ఆ సమస్య తమది కాదన్న కొంత మంది సభ్యులు సభలో మిన్నకుండిపోవడం కూడా జరుగుతున్నది. సభ్యుల మధ్య కలివిడితనమే లోపించింది. ఎవరికి వాళ్లూ సభలో మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఈ రోజు ఏం చేద్దాం...రేపు ఏం చేద్దాం అనే అంశాంలపై తాము చర్చించుకోవడం లేదని ఒక సభ్యుడు పేర్కొన్నారు. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఉదయం 8.30 అసెంబ్లీలోకి తన చాంబర్‌కు చేరుకుని ఈ రోజు సభలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. అధికార పార్టీ ఇంత పకడ్బందీగా వ్యవహరిస్తుంటే ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ సభ్యులు మాత్రం తమకేమీ పట్టనట్టు ఎవరికి వారే వస్తున్నారు. పోతున్నారని ఆ పార్టీ సభ్యులే అంటున్నారు. అసెంబ్లీ తొలి రోజు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టేందుకు కాంగ్రెస్‌పార్టీ పిలుపు ఇచ్చినా, దానిపైనా అంత సీరియస్‌గా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.

 సీఎం కేసీఆర్ ప్రశ్నలతో చేతులెత్తేసిన కాంగ్రెస్

సీఎం కేసీఆర్ ప్రశ్నలతో చేతులెత్తేసిన కాంగ్రెస్

సర్కార్ నాలుగు దఫాలుగా చేసిన రైతు రుణమాఫీపై 'వడ్డీ' కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా పోకస్‌ చేసింది. ఇటువంటి ప్రాధాన్యత కలిగిన అంశంపై ప్రతిపక్షం సరైన అధ్యయనం చేయకుండా ఆరోపణలు చేయడంతో వడ్డీ అందని రైతులు ఎంత మంది ఉన్నారు. ఆ జాబితా ఇవ్వాలని సీఎం కే చంద్రశేఖరరావు ప్రశ్నించడంతో కాంగ్రెస్‌ నేతలు చేతులెత్తేశారు. దీంతో కాంగ్రెస్‌ ఆత్మ రక్షణలో పడిపోయింది. వారం సమయం ఇస్తే వివరాలు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పడంతో కాంగ్రెస్‌ సెల్ఫ్‌గోల్‌లో పడింది. వడ్డీ వివరాలను ప్రభుత్వమే తెప్పించేలా ఒప్పించాల్సిన ప్రతిపక్ష పార్టీ పూర్తిగా విఫలమైంది. వడ్డీ అందని రైతుల వివరాలు సేకరించే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్‌గా తీసుకున్నట్టు లేదు. ఈ అంశం ఉత్తమ్‌ వ్యక్తిగత గొడవగా చూస్తున్నారు. రైతువడ్డీపై ఎంతో హీట్‌ పెంచి వెంటనే తుస్సుమనిపించారని ఒక సభ్యుడు చెప్పారు. 'ఆయన మాకు సలహాలు ఇవ్వరు. మేము ఆయనకు ఏమీ చెప్పలేం' ఇది మా దుస్ధితి అని ఆవేదన వ్యక్తం చేశారు.

 1994 - 99 మధ్య వణుకు పుట్టించిన పీజేఆర్

1994 - 99 మధ్య వణుకు పుట్టించిన పీజేఆర్

పత్తి పంటను ఎవరూ కొనడం లేదని, కొన్నా అతి తక్కువ ధరకు కొంటున్నారని, రైతుల బాధలను తాము తీర్చలేకపోతున్నామని, మీరు సభలో గట్టిగా మాట్లాడాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష సభ్యులకు చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. 1994 - 99 మధ్య ప్రతిపక్ష నేతగా ఉన్న పీ జనార్థనరెడ్డి 24 మంది ఎమ్మెల్యేలతో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం నారా చంద్రబాబునాయుడును ముప్పతిప్పలు పెట్టారని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆ పీజేఆర్‌ తరహాలో వాగ్దటి, పోరాట పటిమ నాయకుడు లేకపోవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష పార్టీగా విఫలమవుతున్నదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తర్వాత 2004 - 209 మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 47 మంది సభ్యులతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంపై పోరాడారని గుర్తుచేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Unity missing in Telangana Congress assembly. Congress MLA's comes individually and gone away daily. They aren't concerned about people's issues, problems in state. They had attending without studying peoples. farmers problems. In this way they are failing in assembly.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి