ఆంత్రోపిక్ AIటూల్స్ తో మార్కెట్ పతనమైందా? తేల్చేసిన సుందర్ పిచాయ్..!
ఆంత్రోపిక్ తీసుకొచ్చిన కొత్త టూల్స్, ప్లగిన్స్ వల్లే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుప్పకూలినట్లు జరుగుతున్న ప్రచారాన్ని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తోసిపుచ్చారు.
ఆంత్రోపిక్ తాజాగా తీసుకొచ్చిన ఏఐ (AI) టూల్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పతనమయ్యాయి. లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఈ టూల్స్ కారణంగా స్టార్టప్ కంపెనీల నుంచి టెక్ జెయింట్ల వరకూ అందరికీ ఎంట్రీ లెవెల్ ఉద్యోగుల అవసరం తగ్గిపోతుందని, దీంతో నిరుద్యోగం కూడా పెరిగే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ల పతనానికీ, ఆంత్రోపిక్స్ ఏఐ టూల్స్ కూ సంబంధం ఉందా లేదా అన్న దానిపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో పాటు ఎన్విడియా సీఈవో జెన్సన్ హుంవాగ్ కూడా స్పందించారు.
ఆంత్రోపిక్ AI టూల్స్ తో కుప్పకూలిన మార్కెట్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్లగిన్లపై మార్కెట్లలో నెలకున్న ఆందోళనను వీరిద్దరూ తోసిపుచ్చారు. ఇది అతిశయోక్తి అని పేర్కొన్నారు. ఆంత్రోపిక్ కొత్త టూల్స్, ముఖ్యంగా న్యాయపరమైన వాటి వల్ల స్టాక్ మార్కెట్లో భారీ పతనం జరిగిందన్నారు. సుందర్ పిచాయ్ ఏఐని ఓ సహాయక సాధనంగా చూస్తుండగా, హువాంగ్ అది సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపరుస్తుందే తప్ప భర్తీ చేయదన్నారు. ఆదాయాల సమావేశంలో పిచాయ్.. ఆంత్రోపిక్ AI ప్లగిన్ల వల్ల ఏర్పడిన భయాన్ని 'అతిశయోక్తి' అని కొట్టిపారేశారు. AI ఒక "సహాయక సాధనం" మాత్రమేనని, గూగుల్ ఉత్పత్తులైన సెర్చ్, యూట్యూబ్‌లో దాని ఉపయోగాన్ని వివరించారు. ఈ అవకాశాన్ని "సద్వినియోగం చేసుకునే" కంపెనీలకు భవిష్యత్తు ఉంటుందన్నారు.

లాజిక్ లేదన్న సుందర్ పిచాయ్
సాఫ్ట్వేర్ స్టాక్‌లు ప్రపంచవ్యాప్తంగా భారీ నష్టాలు చవిచూస్తున్న తరుణంలో పిచాయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆంత్రోపిక్ 'క్లాడ్ కోవర్క్' ప్లగిన్లు కేవలం ఒకే సెషన్లో సాఫ్ట్వేర్, లీగల్ టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్‌ల నుండి దాదాపు $285 బిలియన్లను తుడిచిపెట్టాయి. విశ్లేషకులు దీన్ని 'సాస్పొకలైప్స్' అని పేర్కొన్నారు. పిచాయ్ తో పాటుఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ కూడా మార్కెట్ స్పందనను ప్రశ్నించారు. సిస్కో ఈవెంట్లో ఆయన ఈ అమ్మకాలను ప్రపంచంలోనే అత్యంత అసంబద్ధమైన విషయంగా అభివర్ణించారు. ఏఐ ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపరుస్తుందే తప్ప తిరిగి కనుగొనదని వాదించారు. ఎన్విడియా కూడా ఇలాంటి టూల్స్‌ను విస్తృతంగా వాడి, ఉద్యోగులను చిప్ డిజైన్, కంప్యూటర్ సిస్టమ్స్ రూపకల్పనపై దృష్టి పెట్టేలా చేసిందని హువాంగ్ వివరించారు.

మార్కెట్ల పతనం ఎందుకంటే ?
వాస్తవానికి ఈ పతనానికి కారణం ఆంత్రోపిక్ నిపుణులు కాని వారి కోసం తమ ఏఐ అసిస్టెంట్ 'క్లాడ్ కోవర్క్'కు 11 ఓపెన్-సోర్స్ ప్లగిన్లను విడుదల చేయడమే. ఇవి సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, కస్టమర్ సపోర్ట్ వంటి అనేక ఎంటర్ప్రైజ్ పనులను కవర్ చేశాయి. అయితే, కాంట్రాక్ట్ రివ్యూ, ఎన్డీఏ (NDA) ట్రియేజ్, కంప్లయన్స్ చెక్‌లు, న్యాయపరమైన సంక్షిప్త అంశాల్ని ఆటోమేట్ చేసే లీగల్ ప్లగిన్ తీవ్ర ఆందోళన రేపింది.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications