అల్లు అర్జున్ రూ. 1,000 కోట్ల మైథలాజికల్ థ్రిల్లర్: దర్శకుడు ఎవరంటే..?
Allu Arjun: అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్నారు. పాన్ ఇండియా సినిమా చరిత్రను తిరగరాసిన ఈ మూవీ ఇది. ఐకాన్ స్టార్ నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు. కోలీవుడ్ కు చెందిన అట్లీ దర్శకత్వం వహిస్తోన్న సైంటిఫిక్ మాస్ ఎంటర్టైనర్ ఇది. అల్లు అర్జున్ కు ఇది 22వ మూవీ. అలాగే- అట్లీకి ఇది ఆరో సినిమా. దీని వర్కింగ్ టైటిల్.. 'AA22 x A6'.
బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణే ఇందులో కథానాయిక. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీలో కీ రోల్ లో కనిపించింది దీపిక. దాని తరువాత ఆమె నటించనున్న మరో తెలుగు మూవీ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్.. ఈ సినిమాను నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కబోతోంది అల్లు అర్జున్- అట్లీ మూవీ. పాన్ ఇండియాగా టాలీవుడ్ సత్తాను మరోసారి చాటబోతోంది.

అల్లు అర్జున్- దీపికా పదుకొణే కలిసి పని చేయడం ఇదే తొలిసారి. అట్లీ దర్శకత్వంలో నటించడం ఇది రెండోసారి. అంతకుముందు ఆమె అట్లీ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ జవాన్ లో నటించింది. షారుఖ్ ఖాన్ తో స్క్రీన్ ను పంచుకుంది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తో జతకట్టింది. వారియర్ క్వీన్ రోల్ లో ఆమె మెరుపులు మెరిపించనుంది. కల్కిలో ఎటువంటి కీలక పాత్రను పోషించిందో.. ఇందులో కూడా అంతే ప్రయారిటీ ఉన్న రోల్ ను ఆమె కోసం డిజైన్ చేశాడు దర్శకుడు అట్లీ. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకొంటోంది.
దీని తర్వాత త్రివిక్రమ్ తో భారీ మూవీ ప్లాన్ చేశాడు అల్లు అర్జున్. వీరిద్దరూ నాలుగోసారి రీయూనిట్ కాబోతోన్నారు. కలిసి పనిచేయనున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో.. బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత వస్తున్న వీరి నాలుగో ప్రాజెక్ట్ ఇది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఓ మైథలాజికల్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు పింక్విల్లా ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించింది. పురాణ ఇతిహాసాలు, భవిష్యత్ ను లింక్ చేస్తూ సినిమా రూపుదిద్దుకోనుంది.
1,000 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్‌తో, ఇదివరకెప్పుడూ చూడని స్థాయిలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని టాలీవుడ్ వర్గాలను ఉటంకిస్తూ పింక్ విల్లా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అద్భుతమైన విజువల్స్ వండర్ గా నిలుస్తుందని, పౌరాణిక జానర్‌కు కొత్త నిర్వచనం ఇచ్చేలా పాన్ ఇండియా స్థాయిలో సినిమా ఉండబోతుందని పేర్కంది. 2027 ఫిబ్రవరిలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ నిర్మాత ఎవరనేది ఇంకా రివీల్ కాలేదు.
-
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !!












Click it and Unblock the Notifications