పూసలమ్మడం టూ పాన్ ఇండియా హీరోయిన్.. ఇప్పుడు ఏకంగా !!!
లక్ అంటే వీరిదే అని కొన్ని ఘటనలు చూస్తే అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఈ తరహా ఘటనలకు ఉదాహరణ అంటే "మోనాలిసా భోంస్లే" అని చెప్పాలి. ఈ ఏడాది జరిగిన మహా కుంభమేళాలో రుద్రాక్ష మాలలు.. పూసలు అమ్ముతూ కనిపించి అందరినీ ఆకర్షించింది. ఆమె సహజమైన అందం, చిరునవ్వుకు అంతా ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా.. మోనాలిసాతో "ది డైరీ ఆఫ్ మణిపూర్" అనే చిత్రం అనౌన్స్ చేశారు. దాంతో మోనాలిసా క్రేజ్ నార్త్‌లోనే కాకుండా సౌత్‌లోనూ బలంగా పెరిగిపోయింది. ఆ తర్వాత షాప్ ఓపెనింగ్లు చేస్తూ బిజీ బిజీగా మారిన ఈ అమ్మడు.. రీసెంట్ గానే పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ తెలుగు ప్రేక్షకులను సైతం అలరించనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో "లైఫ్" అనే సినిమా ప్రారంభోత్సవం అయ్యింది. ఈ చిత్రానికి శ్రీను కోటపాటి దర్శకత్వం వహించనుండగా.. చరణ్ సాయి హీరోగా నటిస్తున్నాడు. చరణ్ గతంలో క్రష్, ఇట్స్ ఓకే గురు సినిమాల్లో హీరోగా చేశారు.

కాగా ఇప్పుడు రీసెంట్ గానే హైదరాబాద్ నగరంలోని ప్రముఖ సంస్థ 'బేల్ ట్రీ హోటల్' తన సేవలను మరింత విస్తరించింది. నూతన కిచెన్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీనిని మోనాలిసా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆ తర్వాత కిచెన్ విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హోటల్ పరిసర ప్రాంతాలు అభిమానుల కోలాహలంతో కిక్కిరిసిపోయాయి. ఈ మేరకు హోటల్ యాజమాన్యం, సిబ్బంది మోనాలిసాకు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మోనాలిసా మాట్లాడుతూ.. బేల్ ట్రీ హోటల్ కిచెన్ విభాగం చాలా శుభ్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండటం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆహార ప్రియులకు ఇక్కడ అద్భుతమైన రుచులు అందుతాయని నమ్మకం ఉందన్నారు. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం, ఆతిథ్యం చాలా బాగున్నాయి అని కొనియాడారు. స్వయంగా కొన్ని వంటకాలను పరిశీలించిన ఆమె స్వయంగా కిచెన్ లో కాఫీ కూడా తయారుచేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

బేల్ ట్రీ హోటల్స్ మరో యజమాని బాపిరెడ్డి మాట్లాడుతూ.. కస్టమర్ల ఆరోగ్యానికి, రుచికి పెద్దపీట వేస్తూ ఈ కొత్త కిచెన్‌ను డిజైన్ చేసినట్లు తెలిపారు. అత్యాధునిక పరికరాలతో వంటగదిని పూర్తిగా శానిటైజ్డ్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ తో పాటు కాంటినెంటల్ వంటకాలను అందించడానికి ప్రత్యేక షెఫ్‌లను నియమించారు. కూరగాయలు, నాణ్యమైన దినుసులతో ఇంటి రుచిని తలపించేలా వంటలు సిద్ధం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
హైదరాబాద్‌లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
బ్యాచిలర్ స్టైల్ మటన్ కర్రీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
సమ్మర్ స్పెషల్ "అరటిపండు ఆమ్లెట్" ఎలా చేయాలంటే ??? -
"ముల్లంగి మజ్జిగ పులుసు" ఇలా చేస్తే యమా టేస్టు.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా?












Click it and Unblock the Notifications