Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు

బయటకు కనిపించే గ్లామర్ ప్రపంచం వెనుక ఎన్నో కష్టాలు, నిరాశలు దాగి ఉంటాయి. ముఖ్యంగా సినీ రంగంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి ప్రయాణం సులభం కాదు. కొందరికి అవకాశాలు వచ్చినా, విజయం మాత్రం దూరంగానే ఉంటుంది. అయితే జీవితంలో కొన్ని మలుపులు మాత్రం అనూహ్యంగా అన్నింటినీ మార్చేస్తాయి. అలాంటి అరుదైన ప్రయాణమే ఈ నటి ది.

విద్య నుంచి మిస్ ఇండియా వరకు..

ఆమె ఎవరో కాదు.. టాలీవుడ్‌లో Ism చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన అదితి. 1993 సెప్టెంబర్ 18న చండీగఢ్‌లో జన్మించిన ఆమె.. చిన్నప్పటి నుంచే చదువులో ముందుండే విద్యార్థిని. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఆమె మేనేజ్‌మెంట్‌పై ఆసక్తితో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్‌లో చేరారు. ఇదే సమయంలో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి, 2015లో ప్రతిష్టాత్మక Femina Miss India World కిరీటాన్ని గెలుచుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అదే సంవత్సరం Miss World పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఆమె కెరీర్‌లో కీలక మైలురాయి.

interesting-details-about-ism-movie-actress-aditi-arya-personal-and-profesional-life-goes-viral-on-m

అయితే బాలీవుడ్‌లో 83 చిత్రంలోనూ కనిపించారు. అయితే, ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోవడంతో, ఆమెపై "ఫ్లాప్ హీరోయిన్" అనే ముద్ర పడింది. ఇది ఆమె సినీ ప్రయాణానికి పెద్ద సవాల్‌గా మారింది. సినిమాల్లో ఆశించిన ఫలితం రాకపోయినా, అదితి తన విద్యపై ఉన్న దృష్టిని తగ్గించలేదు. ఆమె 2023లో ప్రపంచ ప్రఖ్యాత Yale School of Management నుంచి ఎంబీఏ పూర్తి చేసి మరోసారి తన ప్రతిభను నిరూపించారు. ఈ విజయం ఆమెను కొత్త దిశలో నిలబెట్టింది.

ఈ క్రమంలోనే అదితి జీవితంలో మరో పెద్ద మలుపు ఆమె వ్యక్తిగత జీవితంలో వచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త Uday Kotak కుమారుడు Jai Kotakతో ఆమె ప్రేమ, తర్వాత వివాహంగా మారింది. 2023లో ఉదయ్‌పూర్‌లోని అద్భుతమైన Taj Fateh Prakash Palaceలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు దేశంలోని ప్రముఖులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోటక్ కుటుంబం భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటి. కోటక్ మహీంద్రా గ్రూప్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్స్, ఇన్సూరెన్స్ వంటి అనేక రంగాల్లో సేవలు అందిస్తోంది. Uday Kotak సంపద బిలియన్లలో ఉండగా, Jai Kotak కూడా వేల కోట్ల ఆస్తులతో ప్రముఖ యువ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+